|
|
స్కూల్స్ తెరచిన వేళ...చదువులు చకచకా సాగాలంటే..!
స్కూల్స్ ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు పిల్లలకు కావలసిన అన్ని పుస్తకాలు, వస్తువులూ సమకూర్చి సిద్ధం చేశారు. బడి వారిని స్నేహ పూర్వకంగా ఆహ్వానించింది. బడి ఆవరణ, తరగతి గదులు పిల్లల లేత కాలి స్పర్శతో నూతనోత్తేజాన్ని పొందాయి. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్‌నూన్ సెషన్, పీరియడ్స్, సబ్జెక్ట్స్, ఇంటర్‌వెల్స్.. ఒక్కొక్క కాలాంతరాన్ని వేరు చేస్తూ బెల్స్ మోగుతున్నాయి. విన్నూత్న ఉత్సాహంతో పాఠశాలలో అడుగిడిన చిన్నారులకు పాఠాలను మిఠాయిల్లా అందించడం టీచర్ల వంతయితే, వాటిని ఆస్వాదించి అర్ధం చేసుకోవడం స్టూడెంట్స్ చేయాల్సి ఉంది. టైం నోట్ చేసుకోండి ఏ పీరియడ్‌లో ఏ సబ్జెక్టు బోధించేది టైం ఉంటుందని మనకు తెలుసు. ఈ విద్యా సంవత్సరానికి క్లాస్ వైజ్‌గా రూపొందించిన టైమ్‌టేబుల్స్‌ను ఆయా తరగతుల విద్యార్థులందరూ తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. దాని ప్రకారం ప్రతి పీరియడ్లో ఉపాధ్యాయులు చెప్పబోయే అంశాలను వినడానికి సిద్ధం కావాలి. అలా చేసినట్లయితే ఓ వారం రోజుల్లో బోధనాంశాలకు, బోధించే పద్ధతికి విద్యార్థులు ట్యూన్ అయ్యే అవకాశం ఉంటుంది.
 రెగ్యులారిటీ మెయింటెన్ చేయండి ప్రతి రోజూ తప్పని సరిగా స్కూల్‌కు హాజరు కావడం వల్ల విద్యార్థి అవిచ్ఛిన్నం గా పాఠాలు నేర్చుకో వడానికి వీలవు తుంది. రెగ్యులా రిటీ వల్ల విషయ అనుసంధానం బల పడి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. తొలి తరగతుల్లో ఉపాధ్యాయులు చెప్పే బేసిక్ కాన్సెప్ట్స్ మొదలు కొని, బోధనాంశాలు అర్థం కావడానికి వారిచ్చే ‘లైవ్’ ‘ఎగ్జాంపుల్స్’ను విద్యార్థులు ‘మిస్’ కాకూడదు. అదే విధంగా విద్యార్థులు రెగ్యుల ర్‌గా క్లాసులకు అటెండ్ అయినట్లయితే ఉపాధ్యాయులకు వారి అవగాహనాస్థాయి చక్కగా అర్థమవుతుంది. అప్పుడే వారి బోధనా పద్ధతిలో విద్యార్థుల స్థాయినను సరించి మార్పులు చేసుకోగలుగుతారు. రచనా శక్తికి మెరుగులు దిద్దండి ప్రతి పీరియడ్‌లో వినడం, అర్థం చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం రోజూ జరిగే పనే. అయితే, ఇంటికి వెళ్లిన తరువాత రాసిన నోట్స్‌ని ఫెయిర్ చేసేటప్పుడు ఓపికగా రాయడం అలవరచుకోవాలి. అప్పుడు తొందరలో తప్పిపోయిన అంశాలేమైనా ఉంటే సరి చేసి రాసే వీలుంటుంది. అలాగే రాసేటపుడు కొద్ది నైపుణ్యాన్ని చూపిస్తే అక్షరాల సైజు, సౌష్టవం, పదాల మధ్యన సరైన వ్యత్యాసంతో రాయగలుగుతాం. ఇక విరామ చిహ్నాలను సహేతకంగా వాడడం వల్ల మీ రచన అకర్షణీయంగా మారుతుంది. ‘మొక్కైవంగనిది మానై వంగునా’ అన్న సామెత మీకు తెలుసుకదా! మీ రచనా శైలికి మీరు ఇప్పుడే మెరుగులు దిద్దగలరు. అది మీ భావ వ్యక్తీకరణకు భవిషత్తులో మంచి ఆయుధం కాగలదు. మీరు అత్యున్నత సర్వీసులు చేపట్టడంలో మీకెంతో సహకరించగలదు. మూడు భాషలూ అవసరమే త్రి భాషా సూత్రం ప్రకారం మన విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవలసి రావడం ఒక మంచి అవకాశంగా భావించాలి. మాతృ భాష తెలుగు ఎన్నో ప్రక్రియలతో సుసంపన్నమైన భాష. ఎంతో మధురమైనది కూడానూ. తెలుగు వాచకంలో ఉన్న పద్యాలు, సూక్తులు, సామెతలు, పద బంధాలు, నుడికారాలు అర్థం చేసుకుంటే అవి ‘స్వీయరచన’లో ఉపయోగపడి చదివే వారిని ఆకట్టుకోగలుగుతాయి. ఇలాంటి ప్రజెంటేషన్ స్కిల్స్ హిందీలో, ఆంగ్లంలో కూడా అత్యవసరం. వాటి సాధనకు భాషా విజ్ఞానం తప్పనిసరి. అందుకే విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లను సమ ప్రాధాన్యతతో చదవాలి. ఆయా భాషలలోని కథల పుస్తకాలను లైబ్రరీ నుంచి తెచ్చుకుని చదవడం వల్ల భాషలపై పట్టు సాధించవచ్చు. ఆల్ రౌండర్ కావాలి పాఠశాల స్థాయిలో విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ చూపాలి. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధిస్తేనే అది సమగ్రమైన అభివృద్ధి కాగలదు. ఏదైనా సబ్జెక్టు ఫాలో కాలేకపోతే దాన్ని వదిలేయకుండా టీచర్స్, పేరెంట్స్ సహకారంతో జూన్ నెలాఖరుకల్లా లోపాన్ని సరిదిద్దుకొని ఫాలో అయ్యేలా మిమ్మల్ని మీరు మలచుకోవాలి. దేహ దారుఢ్యాన్ని పెంచి, మానసిక ప్రశాంతత కలిగించే వ్యాయామం, ఆట పాటలలో కూడా పాల్గొనాలి. పాఠశాలలో అదనంగా నేర్పించే కంప్యూటర్, జి.కె.లను కూడా నేర్చుకోవాల్సిందే. అకడమిక్ ఇయర్‌లో వచ్చే స్కూల్ ఫెస్టివల్స్‌లో వ్యాసరచన, ఉపన్యాసాల పోటీల్లో చిన్న తరగతి నుండే పాల్గొనడం అలవరచుకోవాలి. ఇవన్నీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయి. 1సరైన వేళకు స్కూల్‌కు చేరుకుని టైం ప్రకారం క్లాసులకు సిద్ధం కావాలి. 2స్వల్పమైన ఆటంకాలు, ఆరోగ్య సమస్యలను పక్కన బెట్టి స్కూల్‌కు రెగ్యులర్‌గా వెళ్లడం అలవరచుకోండి. 3ఏదైనా బలమైన కారణం వల్ల ఒక రోజు స్కూల్‌కు వెళ్లనట్లయితే దగ్గరలో గల క్లాస్‌మేట్ సహాయాన్ని పొంది నెక్ట్స్ డే క్లాసుకు సిద్ధం కండి. 4అందంగా, తప్పులు లేకుండా, ఓపికగా రాయడం అలవాటు చేసుకోండి. ప్రయత్నిస్తే మంచి ‘దస్తూరి’ మీ సొంతం అవుతుంది. 5మూడు భాషలనూ సమ ప్రాధాన్యతతో చదవండి. మీరు విశ్వ విజేత కావడానికి అవి దోహదం చేస్తాయి. 6గణితం, సామాన్య శాస్త్రాలలో సూత్రాలు, భావనలు ఒక్కటి కూడా ‘మిస్’ కాకుండా చదవండి. 7విజ్ఞాన ప్రయోగాలు, ప్రదర్శనల్లో పాల్గొనండి, సైన్స్ క్విజ్, మ్యాథ్స్ ఒలెంపి యాడ్‌లలో పాల్గొనండి. 8సోషల్ స్టడీస్‌లోని అంశాలను మ్యాప్‌లతో అనుసంధానించి నేర్చుకోండి. రాష్త్ర, దేశ, ప్రపంచ పటాలను నిరంతరం గమనిస్తూ సాధన చేయండి. 9చదువుతో పాటూ వ్యాయామం, క్రీడలు, ఆట పాటలు, సాంస్కృతిక అంశాలు.. ఇలా అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేయండి.
Other News
|
|