ఎక్స్‌పెక్టెడ్ క్వశ్చన్స్
1. అమెరికాలో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచి, ఎన్నో సంచలన తీర్పులకు కారణమై ప్రతిష్టాత్మక ‘టైమ్’ మేగజైన్ ముఖపత్రంపై చోటు సంపాదించిన ప్రీత్ భరారా ఏ దేశ సంతతికి చెందిన న్యాయవాది?
1బంగ్లాదేశ్ 2. చైనా
3. ఇండియా 4. పాకిస్థాన్ (3)
2. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో సిరియాఅధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏ రెండు శాశ్వత సభ్య దేశాలు వీటో చేశాయి? (1)
1. రష్యా, చైనా 2. అమెరికా, ఫ్రాన్స్
3. అమెరికా, చైనా 4. అమెరికా, బ్రిటన్
3. కేంద్ర గణాంక సంస్థ సత్వర అంచనాల ప్రకారం 2010-11 సంవత్సరానికి భారతదేశ వార్షిక తలసరి ఆదాయం పస్తుత ధరల్లో ఎంతగా నమోదైంది)?
1. రూ. 46,117 2. రూ. 35,993
3. రూ. 53, 332 4. రూ. 55,651 (3)
4. ‘‘డయానా క్లోజ్ లీ గార్డెడ్ సీక్రెట్’’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? (4)
1. స్టీఫెన్ ఎవాన్స్ 2. ఎవాన్స్ గార్డ్
3. కీరా చార్లెస్ 4. కెన్‌వార్ఫే
5. ‘‘టైమ్ గెరిల్లా’’ ఎవరి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం? (2)
1. రౌల్ క్యాస్ట్రో 2. ఫిడెల్ క్యాస్ట్రో
3. సద్దాం హుస్సేన్ 4. ఒసామా బిన్ లాడెన్
6. ప్రతిష్టాత్మక అమెరికా స్పేస్ ప్రోగ్రామ్‌కి మొదటి అంతర్జాతీయ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన వందనా సూర్యవంశీ ఏ నగరానికి చెందినవారు?
1. హైదరాబాద్ 2. పూణె (2)
3. బెంగళూర్ 4. చెన్నై
7. 2012 జాతీయ స్నూకర్ చాంపియన్ షిప్‌ను ఎవరు గెల్చుకున్నారు?
1. కమల్ చావ్లా 2. ఆదిత్యా మెహతా
3. సంతోష్‌కుమార్ 4. ప్రదీప్ మెహతా (2)
. దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్ర హైకోర్టులో అను అనే హిజ్రాకు ఉద్యోగం కల్పిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అల్తమాస్ కబీర్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు? (1)
1. కర్ణాటక 2. మహారాష్ట్ర
3. ఢిల్లీ 4. గుజరాత్
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చరిత్రలో మొదటిసారిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా ఎన్నికైన మహిళ ఎవరు?
1. అన్నపూర్ణ 2. మస్తానమ్మ (2)
3. మీనాకుమారి 4. స్వాతి
10. 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఎన్ని కంపెనీల లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది?
1. 122 2. 142 (1)
3. 132 4. 112
ప్ర - రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి లేనప్పుడు వారి బాధ్యతలను ఎవరు నిర్వహిస్తారు?
జవాబు - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
(Asst. Director of Eco. & Stat. Service - 2011)
ప్ర - సెజ్ పూర్తి పేరు?
జవాబు - స్పెషల్ ఎకనమిక్ జోన్
(Asst. Director of Eco. & Stat. Service - 2011)
Other News