విలువ ఆధారిత పన్ను (వ్యాట్)
- వస్తువు వివిధ ఉత్పత్తి లేదా అమ్మకపు దశలలో పెరిగిన విలువపై మాత్రమే విధించే పన్నును విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అంటారు.
- ప్రతిస్థాయిలోనూ అమ్మకాలపై పన్ను విధిస్తూ అంతకు ముందు జరిగిన అమ్మకాలపై విధించిన పన్నుకు ‘రిబేటు’ ఇవ్వడమనే మౌలిక సూత్రంపై వేసేదే విలువ ఆధారిత పన్ను.
- వ్యాట్ అనేది బహుళ బిందు పన్ను, పరోక్షపన్ను అడ్వరోలమ్ టాక్స్
- పన్నుల వ్యవస్థను సరళతరం చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం వ్యాట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది.
- వ్యాట్‌ను తొలిసారిగా 1954లో ఫ్రాన్స్‌లో ప్రవేశపెట్టారు.
- మొదటిసారిగా వ్యాట్‌ను సూచించింది వాన్ సెమన్స్
- భారత్‌లో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తొలిసారిగా ఎల్.కె.ఝూ కమిటీ (197) సూచించింది.
- ఎల్.కె.ఝూ సూచనల మేరకు 196-7లో మ్యాన్యుఫాక్చరింగ్ రంగంలో వెూడ్ వ్యాట్ (MODVAT) మాడిఫైడ్ వ్యాల్యూయాడెడ్ టాక్స్‌ను ప్రవేశపెట్టారు.
- 1991లో రాజా చెల్లయ్య అధ్యక్షతన పనిచేసిన పన్ను సంస్కరణ కమిటీ కేంద్రీకృత వాల్యు యాడెడ్ ట్యాక్స్‌ను సూచించింది.
- 2000-01 బడ్జెట్ నుండి ఎక్సైజ్ సుంకాల విషయంలో సెన్ వ్యాట్ (CENVAT) ను ప్రవేశపెట్టారు.
- భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాట్‌ను అమలుపరిచేందుకు విధివిధానాలను రూపొందిం చేందుకు 2000 సం॥ వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వ్యాట్ సాధికార కమిటీ ఏర్పడింది. అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థికమంత్రి ఆసిన్ దాస్ గుప్తా ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించారు.
- ప్రస్తుతం వ్యాట్ సాధికార కమిటీకి కన్వీనర్‌గా బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ వెూడి వ్యవహరిస్తున్నారు.
- వ్యాట్ అమలు వల్ల రాష్ట్రా ఆదాయం తగ్గితే మొదటి సంవత్సరం 100%,ండవ సంవత్సరం 75%, మూడవ సంవత్సరం 50%. కేంద్రం భరించేందుకు సిద్ధపడింది. ఫలితంగా 2005 ఏప్రిల్ 1 నుంచి దేశంలోని చాలా రాష్ట్రాల్లో వ్యాట్ అమల్లోకి వచ్చింది.
- భారతదేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను అమలు చేసిన తొలి రాష్ర్టం హర్యానా (2003 ఏప్రిల్ 1 నుండి)
- వ్యాట్‌ను చివరగా ఆవెూదించిన రాష్ర్టం ఉత్తరప్రదేశ్.
- 200 జనవరి 1నుండి ఉత్తరప్రదేశ్‌లో వ్యాట్ అమలులోకి వచ్చింది. దీనితో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాట్ అమలులోకి వచ్చినట్లయింది.
- ప్రస్తుత పాండిచ్ఛేరిలో వ్యాట్ అమలులో లేదు.
- కేంద్రంలో ఎక్సైజ్ సుంకాల స్థానంలో, రాష్ట్రాలలో అమ్మకం పన్ను స్థానంలో వ్యాట్‌ను అమలు చేస్తున్నారు.
- కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్, లక్షదీవులలో అమ్మకం పన్ను అమలులో లేనందున వ్యాట్ అమలులో లేదు.
- ఆంధ్రప్రదేశ్‌లో వ్యాట్‌ను 2005 ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నారు.
- రూ. 5 లక్షలలోపు టర్నోవర్ కలిగిన వ్యాపారస్తులకు వ్యాట్ నుంచి మినహాయింపు ఉంటుంది.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కనిష్ట పరిమితిని 5 లక్షల నుంచి 7 లక్షలకు 2012 ఫిబ్రవరి 1వ తేదీ పెంచింది.
- రూ.5 లక్షల నుండి 40 లక్షల మధ్య టర్నోవర్ గల వ్యాపారస్తులు టర్నోవర్ టాక్స్ లేదా వ్యాట్‌లలో దేనినైన ఎంచుకోవచ్చు.
- 40 లక్షల టర్నోవర్ దాటిన వ్యాపారస్తులు తప్పనిసరిగా వ్యాట్ పరిధిలోకి వస్తారు.
వ్యాట్ వలన లాభాలు
- పన్నుపై పన్ను (కాస్‌కేడింగ్ ఎఫెక్ట్) తొలగిపోతుంది.
- పన్ను ఎగవేతను అరికట్టవచ్చును.
- ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది
- పన్ను భారాన్ని తగ్గించవచ్చును
- క్రాస్ చెకింగ్‌కు వీలవుతుంది
- అంతర్జాతీయ పోటీకి దోహదపడుతుంది
- ప్రపంచంలోనూ, భారత్‌లోనూ వ్యాట్‌ను ట్యాక్స్ డ్రిట్ లేదా ఇన్‌వాయిస్ పద్ధతిలో గణిస్తున్నారు.
- ఈ పద్ధతిలో ఉత్పత్తి కారకాలను కొనుగోలు చేసిన ఇన్‌వాయిస్ వోచర్ ను చూపించినపడే ఇన్ పుట్ ట్యాక్స్ డ్రిట్ మినహాయింపు ఉంటుంది. అంటే ముందు దశలో చెల్లించిన పన్ను తరువాత దశలో మినహాయించ బడుతుంది.
- ఇన్‌పుట్ ట్యాక్స్ డ్రిట్ మినహాయింపు పొందాలంటే తప్పనిసరిగా లెక్కలు నిర్వహించాలి కాబట్టి పన్ను ఎగవేతకు అవకాశం లేదు.
- ప్రస్తుతం రాష్ర్టంలో 20 రకాల వస్తువులపై 14.5% వ్యాట్ అమలవుతుంది.
- మరో 270 రకాల నిత్యావసర వస్తువులపై 4% వ్యాట్‌ను అమలు చేస్తున్నారు.
- రాష్ర్టంలో 46 రకాల వస్తువులను వ్యాట్ పరిధి నుంచి మినహాయించారు.
- రాష్ర్ట ప్రభుత్వానికి అధిక ఆదాయానిచ్చే ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులపై 70% వ్యాట్ అమలవుతుంది.
- పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై పాత అమ్మకం పన్ను కొనసాగుతుంది.
Other News