జనవరి తేదీలు సంఘటనలు
అంతర్జాతీయం
- జనవరి - 11 - భారత ఉన్నతాధికార యంత్రాంగం ఆసియాలోకెల్లా చెత్తదిగా నిలిచింది. హాంకాంగ్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక కన్సల్టింగ్ సంస్థ నివేదిక ప్రకారం మొత్తం10పాయింట్లలో 9.27 రేటింగ్‌తో అత్యంత చెత్త అధికార యంత్రాంగం కలిగిన దేశాల్లో ప్రధమ స్థానం సంపాదించుకుంది. భారత్ కంటే వియత్నాం (8.54), ఇండొనేసియా (8.37), ఫిలిప్పీన్స్ (7.57), చైనా (7.11) రేటింగ్‌లతో భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది.
- జనవరి - 14 - గ్రీన్‌విచ్ మీన్ టైం (జీఎంటీ) స్థానంలో అణు గడియార సమయాన్ని ప్రవేశపెట్టేందుకు యత్నాలు జరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ శావేత్తలు, జిఎంటినే కొనసాగించాలని పట్టుపడుతున్నారు. అయితే వచ్చే వారంలో జరిగే అంతర్జాతీయ సదస్సులో అణు గడియార సమయాన్ని మార్చే అవకాశముంది. ప్రస్తుతం భూభ్రమణానికి అనుగుణంగా సమయం ఉండేందుకు ప్రపంచ వ్యాప్తంగా అమల్లో ఉన్న సమయాల్లో కొనేళ్ళకోసారి లీప్ సెకండ్లను ప్రవేశపెడుతున్నారు. ఒకవేళ అణుగడియారాన్ని అమల్లోకి తెస్తే ఈ విధానాన్ని తొలగిస్తారు.
- జనవరి - 14 - సామాజిక అనుసంధాన నెట్‌వర్క్ ‘ఫేస్‌బుక్’ ఒక కొత్త సైట్‌ను ప్రారంభించింది. ‘ఇఫ్ ఐ డై’ పేరుతో ఓ అప్లికేషన్‌ను ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా ఒకరు తన చివరి మాటను వీడియో లేదా టెక్స్ ్ట రూపంలో పోస్ట్ చేయవచ్చు. ఈ రహస్య సమాచారాన్ని సదరు వ్యక్తి మరణించే వరకు భద్రంగా దాచిపెట్టి ఉంచేందుకు ముగ్గురు స్నేహితులను ఎంచుకోవచ్చు. వీరు ఆ వ్యక్తి మరణానంతరం ఆ సందేశాన్ని వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
జాతీయం
- జనవరి - 11 - ప్రముఖ పాత్రికేయుడు, ది హిందూ గ్రామీణ వ్యవహారాల సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్ ‘ఎన్‌ఆర్. చందూర్-జగతి’ పురస్కారాన్ని అందుకున్నారు.
- జనవరి - 12 - హెచ్‌ఐవిపై అవగాహన కోసం మూడో రిబ్బన్ రైలును ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రారంభించారు. అంతకుముందు ప్రారంభించిన రెండు రైళ్ళు విజయవంతమయిన నేపథ్యంలో మూడో రైలును ప్రారంభించారు. 2007లో రైల్వే మంత్రిత్వశాఖ, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం, రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించాయి. తొలిదశలో ఈ రైలు మొత్తం 1.4 కోట్ల ప్రజల వద్దకు చేరింది. ఈ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం ఏడు బోగీలుంటాయి.
తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ధరించిన జాకెట్‌కు ప్రపంచ ప్రముఖ రాజకీయ నాయకుల ఫ్యాషన్ జాబితాలో చోటు లభించింది. జననేత అయిన నెహ్రూ ధరించిన జాకెట్ ఆ కాలంలో ఒక ఫ్యాషన్‌గా గుర్తింపు సాధించినట్లు టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. చైనా మాజ నేత మావో జెడాంగ్ ధరించిన సఫారీ సూటు, 1976 నుంచి 2006 వరకు క్యూబా అధ్యక్షుడిగా పనిచేసిన ఫిడెల్ కాస్ట్రో ట్రాక్ సూట్ జాబితాలో స్థానం సంపాదించినట్లు వెల్లడించింది.
వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌లో ఒక్క పోలియో కేసు కూడా నవెూదు కాలేదు. అదే రెండేళ్ల క్రితం ప్రపంచలోనే అత్యధికంగా 741 పోలియో కేసులు దేశంలో నవెూదయ్యాయి. స్వల్పకాలంలోనే పోలియోను సంపూర్ణంగా నివారించడం విశేషం.
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఉపరాష్ర్టపతి హమిద్ అన్సారీ గౌరవ డాక్టరేట్‌ను బహకరించారు. ఉపఖండంలో సాంస్కృతిక ప్రజాస్వామ్యం, శాంతి పరిరక్షణకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా త్రిపుర యూనివర్సిటీ ఈ అవార్డును ప్రధానం చేసింది.
రాష్ట్రీయం
-జనవరి - 13 - హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో మొత్తం 243 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రూ.6,47,832 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిల్లో కొన్నింటికి అవగాహనా ఒప్పందాలు కుదరగా, కొన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వ ఆదేశాలతో అనుమతులు మంజూరయ్యాయి.
- జనవరి - 18 - జాతీయ సాహస బాలల అవార్డులకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు, ఎస్. శివప్రసాద్ (14), అమర ఉదయ్ కిరణ్ (8) ఎంపికయ్యారు.
- జనవరి - 19 - ప్రభుత్వ ఉద్యోగుల ఒక్కొక్క కుటుంబానికి అట్లాగే పింఛనుదార్లుకు కూడా మూడు వార్షికంగా లక్షల రూపాయల విలువైన వైద్యం ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని తొలివిడతగా లక్షమంది ఉద్యోగులకు వర్తింపజేయనున్నారు.
- జనవరి - 19 మండల రెవెన్యూ అధికారుల (ఎమ్మార్వో)ల పేర్లను తహసీల్దార్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- జనవరి - 19 - తూర్పుతీర సముద్ర భద్రతకు సుమారు మూడు దశాబ్దాలపాటు సేవలందించిన మూడు గస్తీనౌకలకు అధికార లాంఛనాలతో వీడ్కోలు పలికారు. వీటి పేర్లు వరుసగా, ఇన్‌సోర్ పెట్రోల్ వెసల్ విక్రమ్, చాందిబీబీ, రమాదేవి.
ఆర్థికం
- జనవరి - 14 - ప్రముఖ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్, యూరప్‌లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఫ్రాన్స్ సహా తొమ్మిది దేశాల పరపతి రేటింగ్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 1975 నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ ఫ్రాన్స్ రేటింగ్ ఎఎఎ స్థాయినుంచి తగ్గలేదు.
సైన్స్&టెక్నాలజీ
- జనవరి - 18 - అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఛాయాచిత్రాలను తీయగలిగే సామర్థ్యం ఉన్న మైక్రోవేవ్ రివెూట్ సెన్సింగ్ రిశాట్-1ను భారత రోదసి సంస్థ ‘ఇస్రో’ వచ్చే మార్చి 15 తర్వాత ప్రయోగించనుంది. 1850 కిలోగ్రాముల బరువుండే ఈ ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌విసి 19 వాహక నౌకతో ప్రయోగిస్తారు.
- జనవరి - 19 - పుట్టబోయేది ఆడ లేక మగ శిశువా అనే విషయం ఇక ఒక్క రక్తపరీక్షతోనే తేలిపోనుంది. గర్భం దాల్చిన ఐదువారాల్లోనే దీన్ని నిర్ణయించవచ్చు. ఈ విధానాన్ని దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని చీల్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హ్యూన్ మీ ర్యూ నేతృత్వంలోని బృందం ఆవిష్కరించింది.
Other News