Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> Current Affairs
జూన్ తేదిలు-సంఘటనలు

June-Dఅంతర్జాతీయం
-జూన్ 16 ః గజల్ గాన గంధర్వుడు మెహదీ హసన్(84)కు వందలాది మంది అభిమానులు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు 15వ తేదీన పాక్‌లోని కరాచిలో షాహమ్మద్‌షా శ్మశానవాటికలో జరిగాయి. హసన్ 1927లో భారత్‌లోని రాజస్థాన్‌లో లూనా గ్రామంలో జన్మించారు.
-జూన్ 17 ః మయన్మార్ పునర్‌వ్యవస్థీకరణలో తన పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెవెూక్రసీ, తాను ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆంగ్‌సాన్ సూకీ తెలిపారు. ఓస్లోలో సూకీ 21 ఏళ్ల తర్వాత నొబెల్ శాంతి బహుమతి ప్రసంగం చేశారు. 1991లో నోబెల్ బహుమతి లభించినప్పటికీ.. గృహ నిర్బంధంలో ఉన్న సూకీ పురస్కారాన్ని స్వీకరించటానికి రాలేకపోయారు. 1991లో సూకీ తరపున ఆమె భర్త మైఖేల్ ఆరిస్ నోబెల్ అవార్డును తీసుకున్నారు.
-జూన్ 17 ః సౌదీ యువరాజు నయేఫ్ బిన్ అబ్ధుల్ అజీజ్ (79) మృతి చెందారు. రాజు అబ్ధుల్లాకు ఆయన సవతి సోదరుడు.
-జూన్ 18 ః 2011 సంవత్సరానికి ప్రపంచంలోని 10 సంపన్న మార్కెట్‌లలో భారత్ 10వ స్థానం సంపాదించిందని ‘‘డేటా మానిటర్ 2012 గ్లోబల్ వెల్త్ మార్కెట్ రిపోర్ట్’’లో పేర్కొంది. అమెరికా, జపాన్, చైనాలు మొదటి మూడు స్థానాలు ఆక్రమించాయి.
-జూన్ 18 ః స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో విదేశీయులు దాచుకున్న మొత్తంలో భారతీయుల సొమ్ము కేవలం 0.14 శాతమేనని ‘‘స్విస్ నేషనల్ బ్యాంక్’’ (ఎస్.ఎన్.బి) వెల్లడించింది. 2011 చివరి నాటికి ఈ బ్యాంకుల్లో 1.53 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంకుల (రూ.90 లక్షల కోట్లు) విదేశీ సొమ్ము ఉందని చెప్పింది. అందులో రూ.12,700 కోట్లు భారత పౌరులు, సంస్థలకు చెందిన మొత్తమని పేర్కొంది.
-జూన్ 19 ః ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రీస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్థిక ఉద్దీపనల అనుకూల ‘‘న్యూ డెవెూక్రసీ పార్టీ’’ విజయం సాధించింది. దీంతో యూరోజోన్ సంక్షోభంతో సతమతమవుతున్న యూరప్‌కు తాత్కాలిక ఉపశమనం కలిగింది.
-జూన్ 19 ః ఈజిప్టు అధ్యక్షుడిగా ఇస్లామిక్ చాందస్ వర్గానికి చెందిన ముస్లిం బ్రదర్‌హుడ్ అభ్యర్థి మహామ్మద్ ముర్సీ గెలుపు దాదాపు ఖరారైంది. ఎన్నికల్లో ముర్సీకి 52 శాతం ఓట్లు పోలవ్వగా, ముబారక్ వద్ధ చివరి ప్రధానిగా పని చేసిన అహ్మద్ షఫీక్‌కు 48 శాతం ఓట్లు పోలయ్యాయి.
జూన్ 20 ః పాకిస్థాన్ ప్రధానమంత్రి సయద్ యూసుఫ్ రజా గిలానీ(60) ప్రధాని పదవికి అనర్హుడని ఆదేశ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కోర్డు ధిక్కరణ కేసులో దోషిగా నిర్ధ్ధారించి శిక్ష విధించిన ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి ఆయన ప్రధాని కార్యాలయ ప్రవేశ అర్హత కోల్పోయారని పేర్కొంది. పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడానికి యూసుఫ్జ్రా గిలాని అనర్హుడు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికర్ చౌదరి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం తన సంక్షిప్త ఆదేశంలో పేర్కొంది.
-జూన్ 20 ః వందేళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ నౌక ప్రేరణగా ఆస్ట్రేలియా వ్యాపార దిగ్గజం క్లైవ్ పామర్ ఒక భారీ నౌకను నిర్మించనున్నారు. టైటానిక్-2 పేరుతో చైనాలోని నౌక నిర్మాణ కేంద్రంలో ఇది తయారు కానుంది. 2016లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

జాతీయం
-జూన్ 16 ః కాంగ్రెస్ కురు వృద్ధుడు, 45 ఏళ్ల అపార పార్లమెంటరీ అనునభవమున్న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ (77)కి రాష్ట్రపతి అయ్యే అవకాశం దక్కింది. యూపిఏ తరపున రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రణబ్ పేరును యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధికారి కంగా ప్రకటించారు.
-జూన్ 16 ః చలన వడ్డీ రేట్ల ప్రాతిపదికన ఉన్న గృహ రుణాలను ముందస్తుగా చెల్లిస్తే ప్రీ పేమెంట్ జరిమానాలను విధించరాదని రాష్ట్ర, కేంద్ర సహకార బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
-జూన్ 17 ః రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం నామినేషన్లకు తుది గడువు జూన్ 30. నామినేషన్ల పరిశీలన జులై 2న జరుగుతుంది. ఉప సంహరణకు చివరి తేదీ జులై 4. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కాకుండా పోటీ నెలకొంటే జులై 19న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ ఎన్నిక నిర్వహిస్తారు. 22న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
-జూన్ 18 ః దేశంలో ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. వచ్చే ఆర్నెళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. దేశంలో 40 శాతం కుటుంబాలకు బ్యాంకుల సేవలు అందుబాటులో లేవని 2011జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక శాఖ తెలిపింది.
-జూన్ 18 ః భారత్‌కు గత ఏప్రిల్‌లో తరలివచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐలు) 41 శాతం మేర క్షీణించి 1.85 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2011 ఏప్రిల్‌లో భారత్‌కు 3.12 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి.

రాష్ట్రీయం
-జూన్ 16 ః ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ నూతన అధ్యక్షుడిగా 2012-13 సంవత్సరానికి గాను భాగ్యనగర్ ఇండియా ఎం.డి దేవేంద్ర సురానా ఎంపికయ్యారు. గతంలో ఆయన ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
-జూన్ 17 ః అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో వచ్చిన ప్రతిపాదనల ద్వారా రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న, విస్తరించనున్న 31 పరిశ్రమలకు మెగా పారిశ్రామిక రాయితీల మంజూరుకు పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ ప్రభుత్వానికి సిపారసు చేసింది. ఈ పరిశ్రమల ద్వారా 43 వేల కోట్ల పెట్టుబడులు, 78,330 మందికి ఉపాధిని ఎస్‌ఐపిసి అంచనా వేసింది.
-జూన్ 19 ః మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి ఇకపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. రుణాలపై కేవలం అసలు చెల్లిస్తే.. బ్యాంకులకు ప్రభుత్వమే నేరుగా వడ్డీని చెల్లిస్తుంది. ఇది ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
-జూన్ 19 ః రాష్ట్రంలో త్వరలో వ్యవసాయ పాడి ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ‘‘ఈ-మార్కెట్లు’’ స్పాట్ ఎక్స్చేంజీలు రంగ ప్రవేశం చేయబోతున్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతి స్తూ మార్కెటింగ్ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.

క్రీడారంగం
-జూన్ 17 ః టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేపాల్ క్రికెట్ రాయబారిగా నియమితుడయ్యారు. నేపాల్ పర్యాటక, పౌర, విమానయాన శాఖ మంత్రి బహదూర్ బోగతి ధోని నియామ కాన్ని ప్రకటించారు.
-జూన్ 18 ః భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్ ప్రపంచ మేటి షట్లర్లు పోటీ పడిన ‘‘ఇండోనే షియా ఓపెన్ సూపర్ సిరీస్’’ను చైనాకు చెందిన జురులిని ఓడించి మూడో సారి కైవసం చేసుకుంది.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine