జూన్ తేదిలు-సంఘటనలు

అంతర్జాతీయం
-జూన్ 11 - ఆర్థిక సంక్షోభం ప్రభావం నోబెల్ బహుమతిపైనా పడింది. ఈసారి నోబెల్ బహుమతిని అందుకోనున్న విజేత లకు బహుమతి మొత్తంగా కాస్త తక్కువ నగదు ముట్టింది. నోబెల్ బహుమతి కింద విజేతలకు 2001నుంచి కోటి స్వీడిష్ క్రోనోర్లు (రూ.7.84 ఓట్లు) చెల్లిస్తుండగా, 2012 విజేతలకు 80లక్షల స్వీడిష్ క్రోనోర్లు (రూ.6.26కోట్లు) చెల్లించినట్లు నోబెల్ ఫౌండేషన్ ప్రకటించింది.
-జూన్ 12 - అమెరికాలోని ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్సీల్స్ జడ్జిగా చత్తీస్‌గఢ్‌లో జన్మించిన ఇండియన్ - అమెరికన్ శ్రీనివాసన్ (45)ను అమెరికా అధ్యక్షుడు ఒబామా నామినేట్ చేసారు. ఇది అమెరికాలో రెండో అతి పెద్ద కోర్టు.
-జూన్ 13 - భారత్‌లో జన్మించి, దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వలస వెళ్ళి తన గజల్ గానా మృతంతో సరిహద్దులు చెరిపేసిన గజల్ రారాజు మెహదీ హసన్ కన్నుమూసారు. ఆయన సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి తీవ్రం కావడంతో కరాచీలోని అగాఖాన్ ఆస్పత్రిలో చేర్చారు. చివరకు ఆయన 12వ తేదీన తుదిశ్వాస విడిచారు.
-జూన్ 15 - చైనా తన తొలి మహిళా వ్యోమగామి లియు యాంగ్‌ను అంత రిక్షంలోకి పంపనుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు షెంజౌ-9 వ్యోమ నౌక ద్వారా రోదసిలోకి వెళతారు. ఈ సందర్భంగా అంతరిక్షంలో తన తొలి మానవసహిత డాకింగ్‌ను చైనా చేపడుతుంది.
జాతీయం
-జూన్ 8 - ఆహారాన్ని వృధా చేయకుండా ఎవరికైనా దానం చేస్తే బాగుంటుందని భావించేవారి కోసం త్వరలో దేశవ్యాప్తంగా ‘ఆహార బ్యాంకులు’ ఆవిర్భవించనున్నాయి. అందులో భాగంగా దేశ రాజధానిలో ‘ఢిల్లీ ఆహార బ్యాంక్’ను ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ప్రధానమంత్రి సలహాదారుడు శామ్ పిట్రోడా ప్రారంభించారు. ఇది విజయవంతమ యితే 2020 నాటికి జాతీయస్థాయిలో ప్రతి జిల్లాలో ఇలాంటి ఆహార బ్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
-జూన్ 12 - భారత్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్‌సేన్, బులు ఇమామ్‌లకు లండన్ లోని గాంధీ ఫౌండేషన్ అంతర్జాతీయ శాంతి పురస్కారా లను ప్రకటించింది. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ అహింసను పాటించే వారికి ఈ పురస్కారాలను బహూకరిస్తారు.
-జూన్ 12 - అద్వానీపై మీరా గోవింద్ రచించిన ‘దోజ్ వర్ ది డేస్ అండ్ దెన్: ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ లల్ కృష్ణ అద్వానీ’ని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. అద్వానీ వంటి సీనియర్ నేతల కృషి వల్లనే తనలాంటి వారికి పార్టీలో ఉన్నతస్థానం లభించిందని పుస్తకావిష్కణ సందర్భంగా గడ్కరీ పేర్కొన్నారు.
-జూన్ 12 - దేశానికి పదమూడో రాష్ర్టపతిని ఎన్నుకోవడానికి షెడ్యూలు విడుదలయింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా వీఎస్ సంపత్ పదవీ బాధ్యతలు చేపట్టిన మరునాడే రాష్ట్రపతి ఎన్నికల నగారా వెూగించారు.
Other News