DIAry
జాతీయం
-జూన్ 6 ః ఒకప్పుడు దేశంలోనే అత్యంత పేదరికంతో మగ్గిపోయే రాష్ట్రంగా పేరుపడ్డ బీహార్, ఇప్పుడు శరవే గంగా అభివృద్ధి చెందే రాష్ట్రంగా నవెూదయింది. వరుసగా రెండో ఏడు కూడా అభివృద్ధి వేగం మరింత ఊపందు కుంది. 2011-12 ఆర్థిక సంవత్స రానికి రాష్ర్ట ఆర్థిక ప్రగతి 13.1 శాతంగా నవెూదయింది. ప్రగతిపథంలో వేగంగా పయనిస్తున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో బీహార్ తరువాత వరుసగా ఢిల్లీ, పుదుచ్చేరి ఉన్నాయి. గోవా, నక్సల్స్ బెడదతో సతమత మవుతున్న చత్తీస్‌గఢ్‌లు మొదటి ఐదు స్థానాల్లో చోటు సంపాదించాయి. గుజరాత్ 9.1% ప్రగతి చూపింది. తమిళనాడు ఆర్థిక ప్రగతిలో గుజరాత్‌ను మించి 9.4%గా (2004-05 ధరల ప్రకారం) నవెూదయింది. ఇక దేశానికే ధాన్యాగారమని పేరుపడ్డ పంజాబ్, ఐటి హబ్‌లుగా పేరుపడ్డ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌ల ప్రగతి దేశ సగటు ఆర్థిక ప్రగతి 6.5 శాతం కంటే తక్కువ ప్రగతిని నవెూదు చేసాయి.
-జూన్ 6 ః కొత్త కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ప్రభుత్వం వీఎస్ సంపత్‌కుమార్‌ను నియమించింది. సంబంధిత ఫైలుపై రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ ఆవెూదముద్ర వేసారు. ప్రస్తుత సీఈసీ ఖురేషీ జూన్ 10న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం సంపత్ బాధ్యతలు స్వీకరిస్తారు. ముగ్గురు సభ్యుల కమిషన్‌లో సంపత్ తర్వాత సీనియర్ కమిషనర్‌గా హెచ్‌ఎస్ బ్రహ్మ కొనసాగుతారు. తాజాగా ఏర్పడిన ఖాళీలో మరో కమిషనర్‌ను నియమించే అవకాశముంది.
-జూన్ 7 ః దేశవ్యాప్తంగా కనిపించే 1224 పక్షి జాతుల్లో 155 అరుదైన పక్షులు ప్రమాదపు టంచుల్లో ఉన్నాయి. ఇందులో 110 స్థానిక పక్షులు కాగా, 20కి పైగా వలస పక్షులు. డాక్టర్ అసద్ ఆర్‌రెహమానీ అనే రచయిత ‘థ్రెటన్డ్ బర్డ్స్ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో ఈ వివరాలు పేర్కొన్నారు. అంతరించే దశలో ఉన్న 155 పక్షి జాతుల్లో 15 అరుదైన పక్షులు ఇప్పటికే కనిపించకుండా పోయాయి. మరో 52 పక్షి జాతుల సంతతి తగ్గిపోయింది. 66జాతి పక్షులు పర్యావరణ కాలుష్యం కోరల్లో చిక్కుకొని అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
అంతర్జాతీయం
-జూన్ 7 ః అగ్రరాజ్యం అమెరికాలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక జాతీయ వర్ణక్రమం పూరణ (స్పెల్లంగ్ బీ) పోటీలో తెలుగు తేజాలు మరో మారు తమ సత్తా చాటారు. భారతీయ అమెరికన్లే మొదటి మూడు స్థానాలు దక్కగా అందులో మొదటి, మూడవ స్థానాలను తెలుగువారు కైవసం చేసుకోవడం విశేషం. స్పెల్లింగ్ బీ పోటీలో మొత్తం 278 మంది తలపడగా, తొమ్మిదిమంది ఫైనల్‌కు చేరుకు న్నారు. తుది పోటీలో తెలుగమ్మాయి స్నిగ్థ నందిపాటి విజేతగా నిలిచారు. విజేతకు రూ.15 లక్షల నగదు, రూ.1.25 లక్షల సేవింగ్ బాండ్లు, రూ. 2.5 లక్షల ఉపకారవేతనం, రూ. 1.5లక్షల విలువైన పుస్తకాలు అందజేస్తారు. ఫ్లోరిడాలోని ఓర్లాండోకు చెంది భారతీయ అమెరికన్ స్తుతి మిశ్రా (14) రెండో స్థానంలో నిలిచారు. ఇక న్యూయార్క్‌కు చెందిన అరవింద్ మహంకాళి(12) మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ టైటిల్ వరుసగా ఐదుసార్లు భారతీయ అమెరికన్లకే దక్కడం గమనార్హం.
-జూన్ 3 ః బ్రిటన్ సింహాసనాన్ని రాణి ఎలిజెబెత్ అధిష్ఠించి 60 ఏళ్ళయిన సందర్భంగా నిర్వహిస్తున్న సంబరాలు అంబరాన్నంటాయి. 86 సంవత్సరాల బ్రిటన్ మహారాణి ఎలిజెబెత్ భర్త ఫిలిప్‌తో కలిసి అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొం టున్నారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాలు జూన్ 5 వరకు జరిగాయి. వజ్రోత్సవాల్లో భాగంగా థేమ్స్ నదిపై నౌకాయానాన్ని నిర్వహించారు. ఇందులో వెయ్యి పడవలు పాలు పంచుకున్నాయి. 350 ఏళ్ళలో ఈ తరహా నౌకా విన్యాసం జరగడం ఇదే ప్రథమమని పేర్కొంటున్నారు.
రాష్ట్రీయం
-జూన్ 4 ః హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వంగాల ఈశ్వరయ్య వ్యవహరించనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీ అయినట్లు నోటిఫై చేసారు. దీంతో హైకోర్టులో నెంబర్-2గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య తాత్కాలిక సీజేగా బాధ్యతలు నిర్వహిస్తారు.
-జూన్ 7 ః 2010-11లో సేకరించిన మండలస్థాయి జనాభా వివరాలను రాష్ట్ర జనాభా లెక్కల విభాగం విడుదల చేసింది. వీటి ప్రకారం రాష్ట్రంలోకెల్లా విజయవాడ అర్బన్ మండలంలో అత్యధిక జనాభా నివసిస్తున్నారు. ఈ మండల జనాభా 10,34,987. అతి తక్కువ జనాభాతో తూర్పు గోదావరి జిల్లా మారేడిమిల్లి మండలం చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక్కడ కేవలం 19,366 మంది మాత్రమే నివసిస్తున్నారు.
మొత్తం మండలాల సంఖ్య 1128. వీటిల్లో పూర్తి స్థాయి పట్టణాలుగా మారిన అర్బన్ మండలాలు 30. మిగిలినవన్నీ గ్రామాలే.
రాష్ట్రంలో మండలాల సంఖ్య 1125. గత పదేళ్ళలో మరో మూడు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. అవి కరీంనగర్ జిల్లాలోని ఎలిగేడు, మెదక్ జిల్లాలోని తొగుట, తూర్పుగోదావరి జిల్లాలోని రౌతులపూడి.
మండలమంటే కనీసం ఐదువేల జనాభా ఉండాలి. అందులో 75శాతం మంది వ్యవసాయేతర వృత్తులో పనిచేయాలి. చదరపు కిలోమీటరుకు 400 జనాభా ఉండాలి. ఇలాంటివి రాష్ర్టంలో 30 మండలాలున్నాయి.
జనాభా వృద్ధిరేటు 11.10 శాతం. పోయిన దశాబ్దంతో పోలిస్తే ఇది 3.49శాతం తక్కువ.
రాష్ట్ర జనాభా 8,46,65, 533. ఇందులో 66.51శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో , మిగిలిన 33.49 శాతం పట్టణాల్లో నివసిస్తున్నారు. 2001తో పోలిస్తే పట్టణ జనాభా 6.19శాతం పెరిగింది.
మండలాల్లో బాలుర కంటే బాలికల సంఖ్య తక్కువగా ఉంది. 2001లో ప్రతి వెయ్యిమంది బాలురకు 900 కంటే తక్కువ బాలికల సంఖ్య ఉన్న మండలాలు కేవలం 12 కాగా, 2011 నాటికి వీటి సంఖ్య 122కు పెరిగింది. 850 కంటే తక్కువగా బాలికలున్న మండలాలు 15 ఉన్నాయి.
మొత్తం ఆరేళ్ళలోపు బాలురకు బాలికల నిష్పత్తి 943. అదే 2001లో ఇది 961గా ఉండేది.
జిల్లా చిట్యాల మండలంలో రాష్ర్టంలో కెల్లా అతి తక్కువగా ప్రతి వెయ్యిమంది ఆరేళ్ళలోపు బాలురకు 528 మంది బాలికలే ఉన్నారు. దీని తర్వాతి స్థానం మహబూబ్ నగర్ జిల్లా ఆలమూరు మండలానిది. ఇక్కడ 704 మంది బాలికలున్నారు. పదేళ్ళ క్రితం ఏ మండలంలోను ఇంత తక్కువ సంఖ్యలో బాలికలు లేరు.
ప్రతి వెయ్యిమంది పురుషులకు, స్త్రీల నిష్పత్తి 992. దీంతో పోలిస్తే 635 మండలాల్లో రాష్ర్ట సగటుకన్నా అధికంగా మహిళలున్నారు.
వెయ్యిమంది పురుషులు కన్నా మహిళలు అధికంగా ఉన్న మండలాలు 481.
రాష్ర్టంలో బాగా వెనుకబడిన జిల్లాలుగా పేరుపడిన ఆదిలాబాద్, విజయనగరం వంటి చోట్ల పురుషులకంటే మహిళలు అధికంగా ఉండటం విశేషం.
పాటు గోల్కొండ మండలాలు అతి తక్కువ మహిళలున్న మండలాల్లో రాష్ర్టంలోనే 4,5 స్థానాల్లో ఉన్నాయి.
సగటు అక్షరాస్యత 67.66. దీనికన్నా తక్కువ ఉన్న మండలాలు 800 దాకా ఉన్నాయి. 503 మండలాల్లో అక్షరాస్యులు 59.9 శాతం.
సగటు అక్షరాస్యత 74.04 శాతం. 2001లో 2.61 కోట్లమంది నిరక్షరాస్యులుంటే ఇప్పుడు వారి సంఖ్య 2.45కోట్లకు తగ్గింది.
హిమయత్‌నగర్ మండలం 90.03 శాతం అక్షరాస్యతతో రాష్ర్టంలోనే ప్రధమ స్థానంలో ఉంది.
రాజధాని హైదరాబాద్ జనాభా 77,34,602కు చేరుకుంది. 2001లో ఈ సంఖ్య 60,11,416. రంగారెడ్డి జిల్లా రాష్ర్టంలోనే అత్యధిక జనాభా ఉన్న జిల్లాగానే కాక, వేగంగా పట్టణీకరణ చెందుతున్న జిల్లాగానూ అవతరించింది.
శాస్త్ర సాంకేతిక రంగాలు
-జూన్ 3 ః విశ్వంలో పదార్ధానికి ద్రవ్యరాశి సమకూరడానికి ప్రధాన కారణంగా భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్) అసలు వాస్తవంగా ఉందా? లేదా? అన్న చిక్కుముడి ఈ ఏడాది చివరి నాటికి విడిపోనున్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. విశ్వవిర్భావానికి కారణమైన బిగ్ బ్యాంగ్‌ను ఎల్‌హెచ్‌సిలో కృత్రిమంగా సృష్టించి దైవకణం ఆచూకీని పరిమితమైన హిగ్స్ బోసాన్ కణ ఉత్పత్తిపై ఈ ఏడాది చివరి నాటికి కచ్చితమైన సమాచారం లభిస్తుందని సెర్న్ డైరెక్టర్ రోల్ఫ్-డైటర్ హ్యూర్ తెలిపారుయకీడారంగం
-జూన్ 6 ః భారీ సౌర విమానం ‘సోలార్ ఇంపల్స్’ ఖండాతర ప్రయాణం పూర్తిచేసి చరిత్ర సృష్టించింది. స్పెయిన్ నుంచి జిబ్రాల్టర్ సంధి మీదుగా ప్రయాణించిన ఇది మొరాకో రాజధాని రబాట్‌లో క్షేమంగా కిందకు దిగింది. ఇందులో ప్రయాణించిన సైకియాట్రిస్టు (స్విట్జర్లాండ్) బెర్‌ట్రాండ్ షికార్డ్ సేల్ విమానాశ్రయంలో క్షేమంగా దిగారు.
-జూన్ 6 ః ప్రేమదేవతగా పేరున్న శుక్రగ్రహం, సూర్యుడి మీదుగా పయనించిన దృశ్యాన్ని ప్రపంచమంతా తిలకించి పులకించింది. ఇటువంటి దృశ్యం మరో 105 ఏళ్ళదాకా వీక్షించే అవకాశం లేదు.
-జూన్ 6 ః ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ మహిళల చెస్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. జార్జియాలోని బాతుమి నగరంలో జరిగిన పోటీలో హంపి ఎనిమిది పాయింట్లతో మూడో స్థానాన్ని సాధించారు.
-జూన్ 6 ః ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు ఎర్రా దీక్షిత, కటిల వెంకటలక్ష్మి కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటారు. సమెవాలోని అపియాలో జరిగిన పోటీల్లో వెంకటలక్ష్మి స్వర్ణం, కాస్యం నెగ్గగా, దీక్షితకు స్వర్ణం దక్కింది.
Other News