ఓయూ దూరవిద్యా పీజీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

Mon,March 20, 2017 10:45 PM

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్(పీజీఆర్‌ఆర్‌సీడీఈ) ద్వారా అందించే అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కోర్సుల వార్షిక పరీక్షల ఫీజును వచ్చే నెల 11వ తేదీ లోగా ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 18వ తేదీలోగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే జూన్, జులై నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు పీజీఆర్‌ఆర్‌సీడీఈ వెబ్‌సైట్ www.oucde.net/pg లో చూసుకోవచ్చని సూచించారు.

358

More News

మరిన్ని వార్తలు...