Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home>>  Sunday>>  Articles
11/6/2011 2:21:28 AM
లోకేశ్వర్ పుస్తకాలు

ఆనాటి జ్ఞాపకాలు
viplavaveerulu talangana patrika telangana culture telangana politics telangana cinemaనిరంకుశ నిజాం పరిపాలనను అంతమొందించడానికి అలుపెరుగని పోరాటం చేసిన వీరుపూందరో. వారిలో నారాయణ్ రావ్ పవార్, జగదీష్ ఆర్య, నాచుపల్లి మాధవరావులు ముఖ్యులు. వీరు నిజాం నవాబుపై ప్రత్యక్షంగా బాంబులు విసిరి నిప్పులు కురిపించారు. ఆనాటి వీరి సాహసాన్ని ఉద్విగ్నభరితంగా రచించారు పరవస్తు లోకేశ్వర్. దీనిని ‘నిజాంపై నిప్పులు కురిపించిన విప్లవ వీరులు’ శీర్షికన ఒక భాగంగా రాశారు. ఇంకొక భాగాన్ని ‘1948 సెప్టెంబర్ పోలీస్8 యాక్షన్’ (జ్ఞాపకాలు-గాయాలు) శీర్షికన రాశారు. ఇందులో పోలీస్8 యాక్షన్ పేరుతో హైదరాబాద్ సంస్థానంలోని రెండు లక్షల మంది అమాయక ముస్లింలపై భారత సైన్యం, కొందరు మతోన్మాదులు జరిపిన దాడులు, అత్యాచారాలు, ఊచకోతలను వివరించారు. ఆనాడు జరిగిన ఆ పాశవిక చర్యలను కళ్లారా చూసిన, అనుభవించిన వ్యక్తుల మాటల్లో, నేటి తరానికి కళ్ళకు కట్టించారు. ఈ పుస్తకంలో రచయిత పొందుపర్చిన, మానవతావాదులైన కొందరు హిందువులు, కొంత
మంది ముస్లింలకు అండగా ఉన్న సంఘటనలు హృదయాన్ని కదిలిస్తయి. వెల ₹. 30

దక్కన్ కథలు
hizrakatha talangana patrika telangana culture telangana politics telangana cinemaవివిధ పత్రికల్లో వచ్చిన సుప్రసిద్ధ ఉర్దూ, హిందీ కథలను తెలుగులో అనుసృజన చేశారు రచయిత. దీనిని ‘ఒక హిజ్రా కథ’ అనే పేరుతో కథల సంపుటిగా తెచ్చారు. ఇందులో 8 కథలున్నాయి. అనేక విదేశీ దండయావూతల వల్ల విధ్వంసానికి గురైన ఢిల్లీ నగర పునర్నిర్మాణంలో పాలు పంచుకుంది కూలీలు. కానీ, వారు నాగరికతకు ఎప్పుడూ అంటరాని వాళ్లేనని చెప్పేదే ‘ఒక అస్పృశ్యుడి ఆత్మకథ’. ఢిల్లీ నగరంపై ప్రణయతత్త్వ పతాకాన్ని ఎగురవేసింది ‘మీర్ తకీ మీర్’ కథ. ఇట్లా ఇందులోని కథలన్నీ ప్రత్యేకమైనవే. ఈ కథల్లో రచయిత హైదరాబాద్ భాషతో దక్కన్ గుభాళింపులను పూయించారు. వెల ₹. 50

తెలంగాణ ముచ్చట
book3 talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ ప్రజల ప్రగాఢ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఇది సార్వజనీనం. దీని కోసం ఒడవని తండ్లాట ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. అలాంటి ప్రజా ఉద్యమ ప్రస్థానాన్ని ‘తెలంగాణ సంభాషణ’ పేరుతో వ్యాసాల సంపుటిగా రూపొందించారు ఈ రచయిత. ఇందులో మొత్తం 11 వ్యాసాలున్నయి. ఇవన్నీ వివిధ సందర్భాలలో, వివిధ దిన, వార పత్రికల్లో అచ్చయినవే. వీటిలో రచయిత తెలంగాణ సంభాషణ పరిధిని పెంచి నేటి తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ స్వాతంత్య్ర ఉద్యమంతో పోలుస్తరు. అంతేకాదు, చైనా కబంధ హస్తాల నుండి టిబెట్ బయట పడటానికి చేస్తున్న ప్రయత్నం వంటిదే ‘తెలంగాణ రాష్ట్ర డిమాండ్’ అనీ పాఠకులకు విస్తారంగా వివరిస్తరు. వెల ₹.30

మహానుభావులు
book4 talangana patrika telangana culture telangana politics telangana cinemaకొందరు తమ కోసమే పుడతారు, మనుషులవుతారు. కానీ, మరి కొందరు ప్రజల కోసం పుడతరు, మహానుభావులవుతారు. అలాంటి గొప్పవారి గురించి రచయిత వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలను ఒక దగ్గర చేర్చి ‘ప్రపంచ పాద యాత్రికుడు’ పేరిట పుస్తకంగా వెలువరించారు. ఇవన్నీ గతంలో వివిధ దిన, వార పత్రికల్లో ప్రచురితమైనవే. ఇందులో మన కాలం గాంధీ బాలగోపాల్, తెలంగాణ సింహం ఇ.వి.పద్మనాభన్, చంద్రశేఖర్, శివసాగర్, జైని మల్లయ్యగుప్త, ప్రపంచ పాద యాత్రికుడు గాస్పర్ ఒరేహేక్, మాటల మాంత్రికుడు జి.కృష్ణ, వరంగల్ కీ షాన్ కాళోజీ రామేశ్వర్ రావు, తెలంగాణ దీపస్తంభం కాళోజీ నారాయణ రావు, తెలంగాణ శీర్ష మాణిక్యం సామల సదాశివ, స్వామి సుందరానంద్, ఆలూరి భుజంగరావ్ తదితర విశిష్ట వ్యక్తుల
విశేషాలు పాఠకులకు స్ఫూర్తినిస్తాయి. వెల ₹.30

- సలీం పాషా


Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine