Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 26, 2013
 


Home>>  Sunday>>  Articles
10/1/2011 10:20:56 PM
నమస్తే బతుకమ్మా...

G.Bharath-bushan-potrait‘‘తెలంగాణ బతుకమ్మకు గౌరమ్మ భరత్ భూషణ్ ’’ అని శేఖర్ అన్న మన తెలంగాణ కార్టూనిస్టు అన్నాడు. అట్లే, మరొకరన్నారు. ‘‘ఏ జాతికైనా తనదంటూ ఒక పూవు, ఒక పాట, ఒక పండగ ఉంటదని. మనకూ ఉంది. చిత్రమేమిటంటే, అన్నీ కలగలసిన పండగ అది. ఇంకా విశేషం ఏమిటంటే, మనకు బతుకమ్మేకాదు, భరత్ భూషణూ ఉన్నడు! ’’

ఇరవై ఏళ్ల ఫొటోక్షిగఫీ ప్రయాణం అది. ముందు రంగులు అతడ్ని ఆకర్షించాయి. ఆ తర్వాత తీరొక్క పూలు ఆయన్ని కట్టి పడేశాయి.

ముందు ఆడవాళ్లు ఆడే ఆట తీరు అతడ్ని ఆకర్శించింది. తర్వాత వొళ్లు వంచి కష్టించే శ్రామిక కులాల స్త్రీల ఆట పాటలు ఆకర్షించాయి.

అట్లా రంగులు, స్త్రీలతో మొదలైన బతుకమ్మ ఫొటోక్షిగఫి ఆ తర్వాత బొడ్డెమ్మ పండగ గురించి తెల్సుకునేలా చేసింది. అటెన్క దళిత కుటుంబాల్లో బొడ్డెమ్మలు పేడతో చేసి, పూలతో అలంకరించి, గోడకు కొడతారనీ తెలుసుకునేలా చేసింది. తలలో పెట్టుకునే పూలు సైతం బతుకమ్మ పేర్పులోకి వచ్చేశాయనీ తెలిసింది...ఇదంతా ప్రయాణం. బతుకు ప్రయాణం. బతుకమ్మ ప్రయాణం.

బొడ్డెమ్మ గురించి, బతుకమ్మ గురించి, కాగితం బతుకమ్మల గురించి, చెరువులు, కుంటలు లేని తెలంగాణలో చివరాఖరికి బక్కెట్లో నిమజ్జనం చేసే బతుకమ్మ పండగ దాకా...అన్నిటినీ తాను కళ్లారా చూశాడు. చూసింది చూసినట్టు ఛాయచివూతాల్లో బంధించాడు.

bathukamma7ఒక్క విషయం. ఎవరైనా, తాను పుట్టి పెరిగిన స్థానికతలో ఉన్న ఘనతను, వైభవాన్ని వ్యక్తిగా ఫీల్ కావడం వేరు. కళాకారుడిగా ఆ భావాల్ని ఒడుపుగా పట్టుకొని, అవే భావనల్ని అంతే గాఢతని చూపరులకు కలిగించి తద్వారా సంభ్రమాశ్చర్యాలకు గురిచేయడం వేరు. ఆ లెక్కన భరత్‌భూషణ్ తనకూ, తెలంగాణ బిడ్డలందరికీ మధ్య ఒక అపూర్వమైన సయోధ్య కుదిర్చిన ఫొటో జర్నలిస్టు, ఫొటో హిస్టారియన్. మొదట ఇల్లు తర్వాత లోకం. రెండు విధాలా ఆయన బతుకమ్మ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

చేసి, తెలుగునాట కమ్యూనిస్టులు, స్త్రీవాదులు, దళిత వాదులు, తెలంగాణ వాదులు, ముస్లిం వాదులు- ఇట్లా అస్తిత్వ ఉద్యమాల్లో ఉన్నవారూ, వర్గ పోరాట స్పృహతో పనిచేస్తున్న వాళ్లూ-ఆంవూధావాళ్లు, తెలంగాణ వాళ్లు-అందరికీ తన బతుకమ్మ ఛాయాచివూతాలను చూపించారు. వాళ్లను జ్ఞాపకాల్లోకి నెట్టేసి, తాము కోల్పోతున్న పండగ ఎంత ఘనమైనదో, మరెంత మహత్తరమైందో యాది చేశారు. వాళ్లను కలవరానికి గురిచేసి, ‘మా దగ్గర ఇట్లాంటి పండగ ఉంటే బాగుండు’ అనుకునేలానూ చేశారు. ఆయన ఫొటోల్ని చూసిన ఎందరో, ఇక నుంచి ప్రతి బతుకమ్మ పండగకు తమ ఊళ్లెకు వెళతామని ప్రమాణం చేసేంతటి ఆర్తినీ కలిగించారు. ‘ఫొటోక్షిగఫీతో తమనూ, తమ బతుకునూ ఇంతగా అనుసంధానం చేసిన మరో వ్యక్తి తెలంగాణలో లేరని అంటే, ‘‘అది నా గొప్పతనం కాదు, బతుకమ్మ వైభవమే’’ అన్నరాయన వినవూమంగా.

నిన్నా ఇవ్వాళ కాదు, దాదాపు ఇరవై ఏళ్లుగా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగ గురించి ఫీలై, ఆలోచించి, రికార్డ్ చేసి, ఆ పండగలోని విశిష్టతను, ప్రత్యేకతను- సౌందర్యాత్మను, ప్రాకృతిక లీనతను అసాధారణంగా చెప్పి ఒప్పించి మెప్పించి మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యతను నొక్కి చెబుతున్న కళాకారుడు ఎవరైనా ఉన్నారా? అంటే తానొక్కడే!

ఎన్నో ఏండ్ల కిందట, ఆ మాటకొస్తే దశాబ్దాల క్రితమే అసలు సిసలు తెలంగాణ అస్తిత్వ పండగైన బతుకమ్మ గురించిన అవగాహనను, లోచూపునూ పెంచింది మన భరత్‌భూషణే అంటే తెలిసిన వాళ్లకూ, తెలియని వాళ్లకూ ఈ పండగ సందర్భంలో తన యాది నిజంగా పండగే. ఒక్క మాటలో ఆయన బొమ్మలు చూసిన వాళ్లకు నిదానంగా బతుకమ్మాట ఆడే అక్కలు చెల్లెండ్లు కండ్ల ముందు కానవస్తరు. వాళ్ల అడుగుల సవ్వడి నెమ్మదై హఠాత్తుగా హుషారైన వాళ్ల చప్పట్ల తాళాలు జ్ఞాపకాల్లోకి వస్తయ్... అటు తర్వాత ఇండ్లు...దర్వాజలు...గొళ్లెం పెట్టున్న తలుపులు...జాజు తలుపులు, సున్నం గోడలు, ముదురు రంగుల వార్నీష్ అన్నీనూ...

bathukamma8చిత్రమేందంటే, ఆయన భూమ్మీది సింగిడి అయిన బతుకమ్మనే కాదు, వాకిట్లో మెరిసే ముగ్గుల చిత్రలిపినీ ఫొటోక్షిగఫి చేశాడు. అంతేకాదు, గాల్లో ఎగిరే బాల బంతుల పతంగులనూ ఫొటోలు తీశారు. కుమ్మరి, కమ్మరి, గౌండ్ల, శాల వంటి సమస్త వృత్తుల సహస్ర చిహ్నాలను గుర్తులుగా కాదు, అవి మనందరి జీవశక్తులుగా కొలిచి, వాటిని ఫొటోక్షిగఫి చేశారు. అట్లే, తెలంగాణ ఇండ్లు, గోడలు, ముఖ్యంగా దర్వాజలు చూపించారు. ఇక్కడే ఒక మాట చెప్పాలె! ఆయన తలుపుల్ని, గొళ్లెం వేసి ఉన్న పెద్దర్వాజాల్ని చూసిన ఎవ్వరికైనా తమ ఊరును, ఇండ్లనూ ఎట్ల చూడాలో తెలిసిపోతది. అవున్నిజం. మనల్ని మన ఇంట్లోకి నెట్టి తాళం వేసిన ఈ మనిషే మళ్లీ ఆ తాళం తీసి బతుకమ్మ పాటతో సహా మనల్ని నాలుగు కూడళ్ళలో బతుకమ్మ ఆట దగ్గరికి చేరుస్తడు. బతుకమ్మల్ని చెరువుల్లో నిమజ్జనం చేసే దాకా సాగనంపుతడు.

ఇక మళ్లీ చెప్పుకుంటే గాల్లో ఎగిరే పతంగులు, మూసి ఉన్న తెలంగాణ దర్వాజల్నే కాదు, తెలంగాణ అస్తిత్వ మినార్, చార్మినార్ చుట్టూ ఉన్న నాలుగు దిక్కులా, వాడవాడల్లా...లోలోపలికి వెళితే ఆవిష్కృతయయ్యే రకరకాల కళల్నీ ఆయన అపూర్వంగా చిత్రించాడు.

అంతేకాదు, మనుషులు...అవును. కొంగు నడుముకు చుట్టి కొడవలి ఎత్తిన మన చాకలి ఐలమ్మను తీసింది ఆయనే. పసుపుకొమ్మువలే కనిపించే గ్రామదేవత చిందు ఎల్లమ్మను ఆయనే గౌరమ్మగా తీశారు. కాళోజినీ తీశారు, కొండపల్లి సీతారామయ్యనూ తీశారు. అంటే, సామాజిక చలనాన్ని, దిశదశలను నిర్దేశించే కవులు, కళాకారులు, బుద్ధిజీవులను వాళ్ల ఆత్మతో పట్టుకున్న ఏకైక ఫొటోక్షిగాఫర్ భరత్‌భూషణ్. ఒక బాధ్యతాయుతమైన ఫొటోక్షిగాఫర్‌గా, బతుకమ్మ చిత్రకారుడంటే ఒక్క బతుకమ్మ పండగ మాత్రమే కాదు, జీవితాల్ని తీర్చిదిద్దే మనిషి కావచ్చు, కళా, పనిముట్టూ కావచ్చు, అంతా కూడా ఆయనకు వస్తువే. అందుకే ఆయన జనజీవనంలో బతుకమ్మను ఆరాధించారు. కలకాలం నిలిచే కళగా మన బతుకమ్మను సాక్షాత్కరింపజేశారు.
ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలతో సహా ‘ఆనాజ్’ వ్యాపారం చేసుకునే తండ్రి, ఆర్థికంగా ఫర్వాలేదనుకునే కుటుంబ వాతావరణం... ఇట్లాంటి నేపథ్యంలో వరంగల్‌లోని బీట్ బజార్‌లో పుట్టి పెరిగిన భరత్ భూషణ్ ముందు కోమట్ల ఇండ్లళ్ల ఆడే బతుకమ్మ ఆటకు ఆకర్శితులయ్యారు. అప్పట్లో వాళ్లే బతుకమ్మను పెద్దగా పేర్చేవారు. అటు తర్వాత భద్రకాళీ ఆలయం, చెరువు వద్ద సబ్బండ వర్ణాలు ఆడే ఆటను చూసి ఆశ్చర్య చకితులయ్యారు. ఇక ఆగలేదు. తెలంగాణలో బతుకమ్మ పండగ ఘనంగా జరిగే ప్రాంతాలన్నీ పర్యటించారు. ప్రముఖ కవి నందిని సిధాడ్డితో మాట్లాడి అట్లా సిద్దిపేట వెళ్లారు. అక్కడ అప్పుడే కాగితం బతుకమ్మల్ని చూసి నిస్పృహ చెందారు. పట్నాలు, నగరాలు వద్దు...ఇంకా ఊర్లెకి పోదామంటూ సిధాడ్డిసార్ వెంట వాళ్ల ఊరు బయ్యారం వెళ్లారు.

అక్కడికి వెళ్లే సరికి ఏ ఇంట చూసినా బతుకమ్మల్ని పేరుస్తున్న తల్లులు, బిడ్డలు, పిల్లలూ, పెద్దలూ. ఇంకేం. కావల్సినంత పండగ. అక్కడ మొదలైన భరత్ భూషణ్ బతుకమ్మ ఛాయచిత్ర కళ నిజంగా బతుకమ్మ పండగవపూనే విచ్చుకున్నది. అటెన్క తెలంగాణలోని పలు జిల్లాలు, అనంతరం పలు గ్రామాలు పర్యటించారు. అగ్ర కులం ఆడే ఆటా పాటకు కింది కులాలు ఆడే తీరుకూ మధ్య తేడా తెలిసినకొద్దీ తాను గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండగను లోతుగా పరిశీలించడం మొదపూట్టారు. తన కళతో ఆయా సంవత్సరాల ఆటను, పాటను, తీరొక్క పూల పండగ సంచయాన్ని పట్టుకున్నారు. అట్లా తనను తాను నిశితం చేసుకుని విస్తారంగా తిరిగి, తనను తాను బతికించుకుని ధన్యులయ్యారు. ఈ మాట ఎందుకంటే, ఆయన క్యాన్సర్‌ను కూడా జయించారు కనుక!

అలా ఆయన తెలంగాణ జాతీయ పండగైన బతుకమ్మను కళ్ల ముందు సాక్షాత్కరించే బతుకమ్మ ఛాయచిత్రకారులయ్యారు. ఇదంతా ఒక గునుగుపూల జాతర. తంగేడుపూల సంబురం. మొదట ఈ రంగురంగుల పూల పండగను బ్లాక్ అండ్‌వైట్‌తో ఫొటోక్షిగఫి చేసి, అటు తర్వాత కలర్‌లోకి మారి, రోజుకో ఫిల్మ్ లోడ్ చేసుకుంటూ, కలర్ ప్రింట్లు వేయించుకుంటూ, తీసిన ఫొటోల్ని ముందు చిన్నగా ప్రింట్లు వేయిస్తూ, తర్వాత ఎన్‌లార్జ్ చేయించి, చివరకు ఫ్రేం చేయించి ఇక్రిసాట్‌లో... అటెన్క తన ఇంటినే ప్రదర్శనశాలను చేసి వందలాది మంది కవులు, కళాకారులు, మేధావుల్ని చకితుల్ని చేసిన ఘనుడాయన.

చివరగా ఒక్క మాట. ఒక మనిషి...శారీరకంగా అనారోగ్యాన్ని, ఆర్థికంగా దారివూద్యాన్ని, మానసికంగా ఒత్తిడిని....వీటన్నిటినీ భరిస్తూనే మన పండగను దశాబ్దాలుగా గుండెలకు హత్తుకున్నాడంటే, కెమరాను భుజంతో మోశాడంటే, అది ఆయనలోని నిజాయితీ నిబద్ధతలకు నిదర్శనం అని రాయవచ్చు. కానీ, అంతేకాదు. అది తెలంగాణ స్వభావం కూడా. ఇక్కడి భూమి పుత్రుల నైజం. అట్లా లేకుండా పోవడం అన్నది ఒక వికృతేగానీ మరోటి కాదు. ఆ లెక్కన భరత్ భూషణ్ ప్రకృతి. పండగ. ఆయణ్ని సరిగ్గా చూడటం, చదవుకోవడం అన్నది తెలంగాణ పాఠశాలకున్న ఒక అద్భుతమైన అనుభవంగా అర్థం చేసుకోవాలి.
అవును మరి. ఎంత విధ్వంసం జరిగినా కూడా తెలంగాణ ఒక సమాజంగా కాపాడుకున్న చారివూతక, సాంస్కృతిక, మానవీయ కళల్నీ, విలువలు అన్నీ ఆయన కెమెరా గూట్లో ఒదిగి పోయినై. అవన్నీ ఛాయచివూతాల్లోనే కాకుండా రక్తమాంసాలతో ఉజ్వలంగా వెలిగి పోవాలంటే అది తెలంగాణ రాష్ట్ర సాధనతోనే సాధ్యం. అప్పటిదాకా ప్రకృతితో మమేకమైన ఆ మనిషి ఉండాలి. పండగా ఉండాలి. భరత్ భూషణ్‌లు ఉండాలి. అప్పుడే మన జాతి నిండుగ వెలుగుతది.
అందుకే, బతుకమ్మా...బతుకు...
మమ్మల్ని గౌరవంగా బతికించు...

నమస్తే బతుకమ్మా...
- కందుకూరి రమేష్ బాబు
‘బతుకమ్మ’ ప్రతినిధి

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine