Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home>>  Sunday>>  Articles
6/24/2012 12:17:09 AM
ఫటాఫట్...

venu talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలుగు చలన చిత్ర రంగంలో గాడ్ ఫాదర్‌లు లేకుండా రాణించడం మహా కష్టం. కానీ స్వయంకృషితో ఎదిగిన హాస్యనటుడు ఎల్దండి వేణు. నల్లవేణుగా సినిమా ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన సినిమా పట్ల ఉన్న ఆసక్తితో ఇంట్లో చెప్పకుండా పారిపోయి హైదరాబాద్ చేరిండు. అవకాశాల కోసం ఎదురు చూస్తూనే చిన్నచితకా పనులు చేసిండు. ‘జై’ చిత్రంలో హీరో స్నేహితుడిగా నటించి ఆకట్టుకున్నడు. సినిమా నటుడిగానే కాకుండా అనేక వేదికల మీద యాంకర్‌గా రాణిస్తున్న వేణుతో ఈ వారం ఫటాఫట్.....
మీ అసలు పేరు?
ఎల్దండి వేణు
సినిమా తెచ్చిన పేరు?
నల్ల వేణు
నల్ల వేణే ఎందుకయ్యారు?
నల్లగా (బ్లాక్) ఉంటాను గనుక.
పుట్టింది?
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల.
చదువు?
ఆపేశాను.
సినిమాలకు ఎలా వచ్చారు?
పారిపోయి.
సినిమాకు ముందు ఏం చేసేవారు?
సిరిసిల్లా మార్కెట్‌లో కూరగాయలు అమ్మాను. కరాటే మాస్టర్‌గా క్లాసులూ నిర్వహించాను.
కూరగాయలు అమ్మానని చెప్పుకోవడం పట్ల నామోషి ఏమీలేదా?
గర్వపడతాను. ఆ అనుభవం వల్లే రకరకాల వ్యక్తుల్ని దగ్గరగా చూసి, వాళ్ళను ఇమిటెడ్ చేసేవాడిని. సినిమాల్లో రాణించడానికి అదే ప్లస్ పాయింట్ అయింది.
ఎవరినన్న లవ్ చేశారా?
లవ్ తెలియని వయస్సులో నలుగురైదుగురిని లవ్ చేశా.
పెళ్లయిందా?
అయ్యింది. భార్య శ్రీలత, కొడుకు రేవంత్.
కట్నం తీసుకున్నరా?
తీసుకోలేదు, నా మేనకోడలినే పెళ్లి చేసుకున్నాను.
మొదటి ఉద్యోగం?
టచప్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ రైటర్- ఇలా ఇండస్ట్రీలో చేయని పనంటూ లేదు.
ఫస్ట్ సాలరీ?
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏడెకరాల ఖాళీ స్థలం ఉంటుంది. దాని గేటు వెల్డింగ్ చేయించడానికి వెళ్తే నలుగురు బాయ్స్‌తో పాటు నాకూ 60 రూపాయలు ఇచ్చారు.
మీకే బండి ఉంది?
షవర్లేస్ కారు ఉంది.
సెటిలైన
సినిమా రంగంలో సెటిల్‌మెంట్ అంటూ ఉండదు.
మొదటి చిత్రం?
జై (2003)
ఇప్పటి వరకు చేసిన సినిమాలు?
96-97
ఎన్ని దేశాలు తిరిగారు?
యూఎస్‌ఏ, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, ఇటలీ ఇంకా చాలా దేశాలు.
మీకు బాగా నచ్చిన సినిమా?
ఒక్కటని చెప్పలేను. మనసుకు నచ్చినవన్నీ.
మీకు చేయాలని ఉన్న పాత్ర?
అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది, అయితే ‘వాస్తవ్’ చిత్రంలో సంజయ్‌దత్ చేసిన లాంటి పాత్ర చేయాలన్నది కోరిక.
మీకు ఇష్టమైన కమెడియన్?
బ్రహ్మానందం, వేణుమాధవ్- ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.
మీ బలం?
బ్లాక్ బెల్ట్.
మీ బలహీనతలు.
కోపం ఎక్కువ. ‘మంచి చెడు’ అనే లౌక్యం తెలియదు.
మీలో నచ్చే విషయం
కోపం ఎక్కువైనప్పటికీ వెంటనే రీ కలెక్ట్ అవుతా. నా వల్ల తప్పు జరిగింది అనుకుంటే వెంటనే సారీ చెబుతా.
మీరు దేనికి భయపడతరు?
నా మీద నాకు నమ్మకం ఉంది.
అబద్ధం ఆడాల్సి వస్తే...
సందర్భాన్ని బట్టి ఆడతాను. అది ఎదుటివారిని బాధపెట్టింది అనుకుంటే వెంటనే సారీ చెప్తాను.
మీరు ఏడ్చిన సందర్భాలున్నాయా?
చాలాసార్లు. చిన్న పిల్లలు, ముసలివాళ్లు కష్టపడుతుంటే నేను తట్టుకోలేను.
దేవుడు కనపడి వరమిస్తానంటే..?
రెండు వరాలు కోరుకుంటాను. ఒకటి సంతోషంగా బతికిన నా చిన్ననాటి జీవితాన్ని ఇవ్వమని, రెండవది అద్వితీయమైన శక్తులు ఇవ్వమని.
మీ జీవితంలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు?
మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. అమ్మకోసం ఏదైనా చేస్తాను.
మీ ఊరి పట్ల మీకున్న అభివూపాయం..
ఉన్న ఊరు కన్న తల్లి. నాకు జన్మనిచ్చిన ఊరంటే నాకెంతో ఇష్టం.
అవినీతి పరుడంటే..?
మనిషిని మనిషిగా చూడని ప్రతివాడు నా దృష్టిలో అవినీతిపరుడే.
ఎవరి మీద మీరు ఎక్కువగా ఆధారపడతరు?
నా మీద నేనే.
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వాళ్లు.
ముఖ్యంగా మదర్‌థెరిసా, నెల్సన్ మండేలా, చిరంజీవి, రాంగోపాల్ వర్మ.....
జీవితంలో మరచిపోలేని వ్యక్తులు?
మిత్రుడు కొత్తపల్లి శేషు, డైరెక్టర్లు తేజ, వంశీ పైడిపల్లి....
మీకు ఫేస్ బుక్కు ఉందా?
ఉంది. అయితే అది ఫ్రెండ్స్ కోసమే.
ఏదైనా రాజకీయ పార్టీ మీకు పిలిచి టికెటిస్తానంటే ఏం చేస్తారు?
నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. అయితే, సేవ చేయడానికి సిద్ధమే.
ప్రస్తుతం చేతిలో ఉన్న పని?
నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. నాని హీరోగా ఒక చిత్రం, నందినిడ్డి డైరెక్షన్‌లో ఒక చిత్రం, ఆది హీరోగా ఒక చిత్రం, ‘పొగ’, ‘ముద్ర’ చిత్రాల్లో చేస్తున్నాను.
ఎటువంటి పాత్రలు చేస్తున్నారు?
చిలక జోస్యం చెప్పేవాడి నుంచి ఆడంగి పాత్ర దాకా... విభిన్నమైన క్యారెక్టర్లు...
మీకు సినిమా అవకాశాలు రాకుంటే?
తిరిగి కూరగాయలు అమ్ముకోవడానికి కూడా మొహమాట పడను. హాయిగా వెళ్లి సిరిసిల్ల మార్కెట్‌లో సెటిలవుతా...
- మధుకర్ వైద్యుల

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine