Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 26, 2013
 


Home>>  Sunday>>  Cover Page
6/28/2012 10:47:37 PM
ముంబై: తెలంగాణ ప్రజల చెమట వేదిక

mumbai talangana patrika telangana culture telangana politics telangana cinema
ముంబై చరివూత నిర్మాణంలో మన వాళ్ళు ‘మట్టి మనుషులు’గా పేరు పొందారు. ‘కామ్’ (పని), ‘మాటి’ (మట్టి)... మట్టి పని చేసేవారు గనక, ‘కామాటి’గా వారు పిలువబడ్డారు. వీరి శ్రమకు ముగ్ధులైన నాటి తెల్లదొరలు వీరి కోసం ప్రత్యేకంగా ఓ భూభాగాన్నే కేటాయించారు. అదే ఇప్పుడు ‘కమాటిపురా’గా పిలువబడుతోంది.

- సంగివేని రవీంద్ర, ముంబై నుంచి
09971 45310



ఆకలి తీర్చుకునేందుకు మనిషి ఎన్నో యోజనాలు, ఖండాలు, ఖండాంతరాలు, సప్త సమువూదాలు దాటి వలస వెళ్ళాడు. అందులో భాగంగానే నైజాం ఆధీనంలోని తెలంగాణ ప్రాంతం నుండి కూడా ముంబైకి ఎన్నో కుటుంబాలు వలస వెళ్ళాయి. వరుస కరవుల్ని తట్టుకోలేక కొందరు, నిజాం రాజుల అక్రమాల్ని భరించలేక ఇంకొందరు పొట్ట చేతబట్టుకొని అక్కడి తీరానికి చేరుకున్నారు.

మొదటి తెలుగు వ్యక్తి మాత్రం 300 సంవత్సరాల క్రితం ముంబైకి చేరుకున్నట్లు చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. అప్పుడు ఈ నగరం వేర్వేరుగా ఏడు దీవులుగా ఉండేది. అధికార వర్గానికి చెందిన ఫ్రెంచ్ వారు, స్థానిక కోలీలు తప్ప స్థానికేతరుపూవ్వరూ ఇంకా అక్కడకు చేరుకోలేదు. ఒక విధంగా స్థానిక కోలీల తర్వాత ఆ దీవుల్లో మొదటిసారిగా అడుగు మోపింది మన తెలంగాణ వారే!

మట్టి మనుషుల శ్రమ ఫలం
శారీరక శ్రమకు నిరక్షరాస్యులైన ఆనాటి తెలంగాణ వారు వెనుకాడేవారు కాదు. అందుకే నడుం బిగించి ముంబై తీరంలోని ఆ ఏడు దీవుల్ని కలిపే పనిలో నిమగ్నమయ్యారు. వారే చరివూతలో ‘మట్టి మనుషులు’గా పేరు పొందారు. ‘కామ్’(పని) ‘మాటి’ (మట్టి)...మట్టి పని చేసేవారు గనక, ‘కామాటి’గా వారు పిలువబడ్డారు. వీరి శ్రమకు ముగ్ధులైన నాటి తెల్లదొరలు వీరి కోసం ప్రత్యేకంగా ఓ భూభాగాన్నే కేటాయించారు. అదే ఇప్పుడు ‘కమాటిపురా..’గా పిలువబడుతోంది. ‘కమాటిపురా’ అంటే తెలుగువారి కేంద్రం. ఆనాటి తెలంగాణ ముద్దుబిడ్డల నేల.

ఒకవైపు ముంబై నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహిస్తూనే, మరోవైపు కమాటిపురాలో వరుసక్షికమంలో అద్భుతమైన ఇళ్ళ సముదాయాన్ని వారు కట్టుకున్నారు. అందరూ కలిసి తెలుగు సంఘాలు స్థాపించుకున్నారు. తెలంగాణ ప్రజల దేవతలైన పోచమ్మ, రేణుకాదేవి లాంటి దేవతల మందిరాలూ అక్కడ వెలిశాయి. తెలుగువారి ప్రధానంగా తెలంగాణ వారి సాంస్కృతిక వారసత్వాన్ని అక్కడ తమంతట తాము నిలబెట్టుకున్నారు. తెలుగు కళల్ని, సాహిత్యాన్ని మరిచి పోకుండా హరికథల్ని, బుర్రకథల్ని, ఒగ్గుకథల్ని, చిందు బాగోతాల్ని సైతం వారు బతికించుకున్నారు.
mumbai4 talangana patrika telangana culture telangana politics telangana cinema

ఆసుపవూతులు నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందించారు. ‘కమాటిపురా’ కేంద్రంగా పలు తెలుగు గ్రంథాలయాల్ని ఏర్పాటు చేశారు. తెలుగు విద్యార్థుల కోసం ఉచిత విద్యాసంస్థల్ని నెలకొల్పారు. సేవా రంగాల్లోనే కాకుండా సామాజిక రంగాల్లో కూడా ముంబైలోని తెలుగువారి పాత్ర విస్మరించరానిది.
హైదరాబాద్ విముక్తి సంగ్రామం, స్వాంతంవూత్యోద్యమం, దాద్రానగర్ హవేలీ, గోవా విముక్తి పోరాటం, సంయుక్త మహారాష్ట్ర పోరాటాల్లో కూడా తెలుగు వారు ముందు నిలిచి అమరులయ్యారు. మహారాష్ట్ర సంయుక్త పోరాటంలో అమరులైన 10 మందిలో ఇద్దరు తెలంగాణ వారు కూడా ఉన్నారు. ఆ అమరుల స్మృత్యర్థం ‘హుతాత్మ చౌక్’లో ఏర్పాటు చేసిన శిలా ఫలకంపై ఇప్పటికీ ఆ ఇద్దరి పేర్లు లిఖించబడి ఉన్నాయి!
డా॥ అంబేద్కర్, జ్యోతిబా ఫూలేల ప్రభావంతో ముంబైలో మొదటిసారిగా దళితులకు ‘తెలుగువారి మందిరాల్లో’ ప్రవేశం కల్పించిది తెలుగువారే! అయితే, మిగతా సమాజం తెలుగువారిని అనుసరించక పోవడం వల్ల చాలాకాలం వరకు దళితులకు ఇతర మందిరాల్లో ప్రవేశం లభించలేదు. ఈ విషయాన్ని డా॥ అంబేద్కర్ పలు ప్రసంగాల్లో ఉటంకించారు. ఇవన్నీ చేస్తూ కూడా తెలుగోడంటే ‘కష్టపడేవాడు..,’ ‘నిజాయితీపరుడు’ అనే పేరు తెచ్చుకున్నారు.

భవన నిర్మాణ కార్మికుల నుండి మొదలు
అప్పట్లో ముంబైలో తెలుగువాడి (తెలంగాణ) ప్రధాన వృత్తి భవన నిర్మాణమే. ఇవాళ ముంబైలోని అనేక చారివూతిక కట్టడాలలో ఎక్కువ భాగం తెలుగువారు నిర్మించినవే. విదేశీ చరివూతకారులతోపాటు ఎందరో మరాఠీ చరివూతకారులూ ఈ విషయాన్ని ధృవీకరించారు.

దాదాపు 5 సంవత్సరాల పాటు శ్రమించి, తెలుగువారి 200 సంవత్సరాల చరివూతను వెలికి తీసి డా॥ మనోహర్ కదం రాసిన ‘ముంబయిచా ఉభర్జీత్ తెలుగు సమాజాచే యోగ్‌దాన్’(ముంబయి నిర్మాణంలో తెలుగువారి క్రియాశీల పాత్ర) అనే పరిశోధనా గ్రంథంలో తెలుగు వారి సేవల గురించి విస్తృతంగా వివరించారు. క్రీ.శ. 173 నుండి 1960 వరకు దాదాపు 90 సంవత్సరాల కాలావధిలో ముంబై ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, వైద్య తదితర ప్రముఖ రంగాల్లో తెలుగువారు ఎంతో గణనీయమైన సేవలందించారన్నది స్పష్టం.

మహారాష్ట్రలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి ఆధ్యుడైన మహాత్మ జ్యోతిరావు ఫూలే ‘సత్యశోధక సమాజం’లో తెలుగువారు భారీ సంఖ్యలో సభ్యులుగా చేరి, అప్పటి ఉద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్ర వహించడమేగాక ఆర్థికంగా కూడా ఎంతో సహాయపడ్డారు. శివాజీ మహరాజ్ వారసుడైన ఛత్రపతి సాహూ మహరాజ్, డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్‌ల సమతా పోరాటానికి కూడా తెలంగాణ వారెంతో సహకరించారు. డా॥ అంబేద్కర్ ఆధ్వర్యంలో వెలువడే ‘జనతా’ పత్రిక కోసం ‘భారత్ భూషణ్ ప్రింటింగ్ ప్రెస్’కై స్థలాన్ని, ముద్రణా యంత్రాన్ని సమకూర్చారు.

బట్టల మిల్లులలో తెలంగాణ వారి ముద్ర
ముంబైలో 19వ శతాబ్దం నుండి తెలుగువారి వలసలు విపరీతంగా పెరిగి పోయాయి. బట్టలమిల్లుల పెరుగుదలలే ఇందుకు కారణం. తెలుగు కార్మికులు లేని బట్టల మిల్లులను అక్కడ ఊహించుకోవడం కష్టం. మిల్లుల ప్రాంతాలైన లాల్‌బాగ్, వర్లీ, పరేల్, బైకల్లా, నాయ్‌గావ్, ఖేడ్‌గల్లీ తదితర ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా స్థిరపడ్డారు. వృత్తిరీత్యా ప్రావీణ్యులైన తెలుగువారి ముందు ఉత్తర భారతీయులు నిలువలేకపోయారు.
కానీ, సహజంగానే ఆధిపత్య ధోరణితో, రాజకీయాల్ని ఔపాపన బట్టే ఉత్తర భారతీయులు తెలుగు వారిపై దాడులు నిర్వహించి అణగదొక్కేందుకు ప్రయత్నించసాగారు. దాంతో తెలుగువారు ఆయా ప్రాంతాల్లో ‘సంఘాల్ని’ ఏర్పాటు చేసుకొని సంఘటితంగా ఎదుర్కొన్నారు. ఈ సంఘటనల వల్ల సంఘాల ప్రాధాన్యం తెలుగువారికి తెలిసొచ్చింది. ఈ స్ఫూర్తితోనే పలు ప్రాంతాల్లో విరివిగా సంఘాలు ఏర్పడసాగాయి. ఈ సంఘాల్లో 90 శాతం కులసంఘాలే కావడం కాస్త ఆశ్చర్యకరంగానే ఉన్నా అక్కడక్కడా తెలుగు గ్రంథాలయాలు, తెలుగు క్రీడా సంస్థలూ ఊపిరి పోసుకున్నాయి.

ఈ సంఘాల్లో అవకాశం చిక్కిన ప్రతి సారి ఏదో ఒక కార్యక్షికమం నిర్వహించేవారు. ఈ విధంగా ముంబైలో ఈ సంఘాల వల్ల తెలుగు భాషా, సాహిత్యం, సంస్కృతి, సంస్కారాలు సజీవంగా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ శతాధిక తెలుగు సంఘాలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఆంధ్రమహాసభ గత ఎనభై వసంతాల నుండి తెలుగు సాహిత్యాన్ని, భాషను పెంచి పోషిస్తూ, ముంబై తెలుగువారి స్వాభిమానానికి ప్రతీకగా నిలబడి వుంది. జూనియర్ కాలేజీ వరకు విద్యాబోధన చేస్తున్న ‘ఆంవూధాస్కూల్’ ఏకైక తెలుగు విద్యాలయంగా గుర్తింపు పొందింది.

మరాఠీ వారితో మమేకమైన తెలుగువారి జీవనశైలి
ఇప్పుడు ముంబైలో దాదాపు 10 లక్షల మంది తెలుగు వారున్నారని అంచనా. ఇందులో 90 శాతం మంది తెలంగాణ వారే! కొంత కాలం క్రితం వరకు వీరిలో ఎక్కువ శాతం కార్మిక వర్గానికి చెందినవారే. వీరిలోకూడా ఎక్కువ శాతం మిల్లుల స్థలాల్లో నిర్మితమైన సింగిల్ రూమ్‌లలోనే నివాసముండే వారే. స్వరాష్ట్రంలో చదువుకొని, ఉన్నత ఉద్యోగాల నిమిత్తం ఇక్కడికి చేరుకొని విశాలమైన అపార్టుమెంట్లలో ఉండేవారు ఇంకో రకం. మొదటి రకంలో దాదాపు వందశాతం తెలంగాణ వారైతే, రెండో రకంలో కోస్తాంధ్ర, సీమ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువ.

ముంబై తెలుగువారిలో ప్రత్యక్షంగా వివక్ష, పక్షపాతం, వ్యత్యాసాలు ఏవీ లేకున్నా ఎందుకో ఈ ఉన్నత విద్యావంతులైన సీమాంధ్ర ఉద్యోగుపూవ్వరూ ఈ కార్మికవాడల్లో కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఉండకుండా నవీ ముంబై లాంటి సుదూర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. తెలంగాణకు చెందినవారు ఉన్న ప్రాంతాల్లో బోనాల పండగలు, బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దసరా, సంక్రాంతి పండగల్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఈ 21వ శతాబ్దిలో వేగవంతమైన ఈ విశ్వనగరంలో ఇప్పటికీ తెలుగు (తెలంగాణ) సంప్రదాయాలు సగర్వంగా తలెత్తి నిలబడి ఉన్నాయి.
మహిళలు ఇప్పటికీ తెలుగు పద్ధతుల్ని తు.చ. తప్పకుండా ఆచరిస్తారు. పాతతరం తెలంగాణ మహిళల్లో 9 గజాల చీరలు కట్టేవారూ ఉన్నారు. వృద్ధులు దోతీ, తెల్ల చొక్కాలను ధరిస్తారు. తెలుగులోనే నామఫలకాలు ఉంటాయి.

ఇంట్లో పండగల సందర్భంగా గారెలు, బూరెలు, సకినాలు చేసుకుంటారు. సర్వపిండి, ఉప్పిడిపిండి కూడా ముంబైలో లభిస్తుంది. ఆంధ్రవూపదేశ్ నుండి పలు కార్యక్షికమాల నిమిత్తం ముంబై వచ్చిన ప్రముఖుల్ని వీరి జీవనశైలి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దశాబ్దాలుగా ముంబైలో ఉంటున్నా ఏడాదిలో ఒకసారైనా ఏదో ఒక సందర్భంలో సొంతూరికి వెళ్ళిరాని తెలుగువారు ఉండరు. ఒకవైపు స్థానిక మరాఠీ భాషా సంస్కృతులతో మమేకమవుతూనే మరోవైపు తెలుగుతనాన్ని ఏ మాత్రం విస్మరించకుండా ‘తెలుగు ముంబయికర్’లు తమ మనుగడను సాగిస్తున్నారు.

రాజకీయ రంగంలో మన దిగ్గజాలు ఎందరో!
జ్యోతిబా ఫూలే స్థాపించిన ‘సత్యశోధక సమాజానికి’ 173లోనే అయ్యవారు రామయ్య అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 193లోనే జాయా కారాడి లింగూ మున్సిపల్ కార్పొరేటర్‌గా నామినేట్ అయ్యారు. ప్రముఖ సామాజిక కార్యకర్తగా పేరొందిన యెల్లప్ప బలరామ్ 1 నుండి 27 సంవత్సరాల పాటు కార్పొరేటర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ప్రముఖ భవన నిర్మాత మానాజీ కాలేవార్ వరుసగా 20 సంవత్సరాల పాటు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

15లో మానాజీ రాజాజీ, సంబాజీ గాంగ్లా, 1922లో సయాజీరావు శీలం, 1926లో పుప్పాల శంకపూరావు కార్పొరేటర్‌లుగా ఎన్నికయ్యారు. 1949లో పుప్పాల నర్సింగ్‌రావు కార్పొరేటర్‌గా ఎన్నికై 1955లో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1946లో లింగన్న పూజారి, 1952లో గంజి నారాయణ, తుమ్మల బలరామ్, పుప్పాల పరశురామ్, ఆ తర్వాత జి.ఎల్.డ్డి, తారాడ్డి, పూజారి నారాయణ, ముల్కవాడ్ లక్ష్మణ్, మద్దికుంట దశరథ్ తదితరులు కార్పొరేటర్‌లుగా ఎన్నికై తెలుగువారి ఘనకీర్తిని చాటారు. 1956లో తుల్లా విశ్వనాథ్ శాసన సభ్యులుగా, పూజారి లింగన్న రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో తెలగువారి కీర్తిని దిగంతాలకు వ్యాపింపచేసిన వ్యక్తి శీలం సయాజీ రావు. మహారాష్ట్ర ప్రప్రథమ స్పీకర్‌గా ఎన్నికై తెలుగు వారి కీర్తిని మహారాష్ట్రలో స్వర్ణాక్షరాలతో లిఖించారు. (వారిపై ‘బతుకమ్మ’ ప్రత్యేక వ్యాసం 6-5-12 సంచికలో ప్రచురించిన విషయం తెలిసిందే.)
భీవండిలోనూ పలువురు తెలుగువారు కార్పొరేటర్‌లుగా ఎన్నికై ఇప్పటికీ రాజకీయంగా బలపడి ఉన్నారు. జాల్నా, సోలాపూర్ లాంటి ప్రాంతాల నుండి తెలుగువారు లోక్‌సభ సభ్యులుగా, శాసనసభ సభ్యులుగానూ గతంలో ఎన్నికయ్యారు. వీరిలో సాధుల్ ధర్మన్న, కూచన్ గంగాధర్, ఆడెపు నర్సయ్య ప్రభృతులున్నారు. కాగా, ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభలో జాల్నా నుండి ఎన్నికైన కైలాష్ గోరింట్యాల్ ఒక్కరే తెలుగువారికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఎందరో సారస్వత మూర్తులు
ముంబై తెలుగు సాహిత్యరంగంలో ఎందరో సారస్వత మూర్తులు ఉన్నారు. షోలాపూర్‌కు చెందిన బొల్లి లక్ష్మీనారాయణ ఇంతవరకు 17 పుస్తకాలు రచించి, తెలుగు, మరాఠీ భాషల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేసి గౌరవించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఎన్నో అవార్డులు, రివార్డులు బహూకరించింది. పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. అలాగే, ముంబైకి చెందిన ద్యావరశెట్టి వెంక 1952లోనే రెండు చందోబద్ధమైన తెలుగు శతకాలు రచించారు. వీరి సాహిత్య వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారు.

ఉపసంహారం
గతమెంతో ఘనంగా ఉన్నప్పటికీ రాన్రానూ ముంబై (మహారాష్ట్రలో కూడా..) తెలుగువారి పరిస్థితి నానాటికి దిగజారుతోంది. మిల్లులు మూతబడడం వల్ల తెలుగు సంఘటిత శక్తి క్షీణించడమే గాక, నేటి తరం తెలుగు భాషను విస్మరిస్తోంది. ఒకప్పుడు 56 తెలుగు పాఠశాలలు ఉండే ముంబైలో, ప్రస్తుతం ఆ సంఖ్య మూడు పదులకే పరిమితమైంది. వేలాది తెలుగు విద్యార్థులు ఉండాల్సిన చోట ప్రస్తుతం వందల సంఖ్యలోనే ఉన్నారు. తెలుగు గ్రంథాలయాల్లో పాఠకులు తగ్గిపోతున్నారు. ముంబైలో ఒక తెలుగు మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషలన్నీ క్రమంగా క్షీణిస్తున్నాయి. ఇందులో మరాఠీ కూడా ఉంది.

మరోవైపు ఈ భాషల్ని కాపాడుకోవడానికి భాషావేత్తలు (తెలుగువారితో సహా) ఉద్యమిస్తున్నారు. ప్రాంతీయ భాషల పరిరక్షణ కోసం పలువురు శ్రమిస్తున్నారు. అయితే, మరాఠీ భాషకు లభించినంతగా, అక్కడి అల్పసంఖ్యాకుల భాషైన తెలుగుకు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లభించడం లేదు. పైగా తెలుగు స్కూళ్ళను మూసివేయాలని అక్కడి అధికారులు పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నట్టూ తెలుస్తోంది.
మరోవైపు ఐక్యతా లోపం వల్ల తెలుగువారు ముంబైలో సమర్థుడైన ఒక నాయకున్ని తయారు చేసుకోలేక పోతున్నారు. కేవలం నాలుగు లక్షల జనం ఉన్న కన్నడిగులకు ఆరుగురు శాసనసభ్యులు, ముగ్గురు మంత్రులు ఉండగా, మనకిది ముఖ్యంగా తెలుగువారికే తలవంపులు తెచ్చే పరిస్థిక మరేమిటి?
ఏమైనా, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం పూనుకొని ముంబైలో ఒక తెలుగు భవనం ఏర్పాటు చేయాలి. అక్కడి తెలంగాణ వారికేకాక తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక గుర్తింపు కల్పించాలి. తెలుగు భాషా, సాహితీ సంస్కృతుల వికాసానికి మరింతగా సహకరించాలి. కనీసం, ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకోవాలనీ సామాన్య తెలుగు ముంబయికర్‌లు ఆకాంక్షిస్తున్నారు. ఒకనాటి ప్రాభవం ఇలా ముగిసిపోకుండా కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత అందరిదీను.

తెలుగువారి తొలితరం పత్రికలు
క్రీ.శ.17లోనే ‘తెలుగు మిత్ర’ అనే వారపవూతిక డా॥ ఈరాల ఇస్పతి సంపాదకత్వంలో వెలువడింది. ఈ పత్రికకు సయాజీరావు శీలం ఎంతో సహకరించారు. అందులో తెలుగు రాజుల చరివూతలు, తెలుగు భాషా ఔన్నత్యాల గురించిన వ్యాసాలు ప్రచురించేవారు. 192లో పడాల ఈరయ్య సంపాదకత్వంలో ‘సత్య నిర్ణయ్’ అనే పత్రిక వెలువడింది. ఇందులో తెలుగు ప్రముఖుల పరిచయాలతో పాటు తెలుగువారి జీవన శైలి గురించి రాసేవారు.

1912లో పర్శా శంకర్‌రావు ‘ఆంధ్ర వాంఘ్మయ్’ అనే 103 పేజీల పుస్తకాన్ని వెలువరించారు. ఇందులో తెలుగు భాషా శబ్ధోత్పత్తి, వ్యాకరణ వివరాలు, తెలుగు వర్ణమాల , తెలుగు చందస్సు లాంటివి పరిచయం చేశారు. 1915లో జక్కల్ విఠల్‌రావు స్వీయ సంపాదకత్వంలో ‘తెలుగు సమాచార్’ అనే పత్రికను తీసుకొచ్చారు. ఈ పత్రికలో బి.చింతామణి, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, డా॥ పట్టాబి సీతారామయ్య, మాడపాటి హనుమంతరావు, డా॥ వెంక కేత్కర్, డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రముఖుల రచనలు ప్రచురించే వారు. అంతేగాక, 1926లో 295 పేజీలతో మూడు భాషల్లో ప్రత్యేక సంక్రాంతి సంచికను విడుదల చేయడం విశేషం! ఈ సంచికలో బాల గంగాధర తిలక్, గాంధీజీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కొండా వెంకటప్పయ్య, బండారు అచ్చమాంబ, కందుకూరి వీరేశలింగం పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు, మోచర్ల రాంచంవూదరావు, చెల్లపల్లి వెంకటశాస్త్రి లాంటి వారి చరివూతలు, ఛాయాచివూతాలు కూడా ప్రచురించారు.

1926లో సుప్ప శంకర్‌రావు సంపాదకత్వంలో ‘ఆంవూధసేవక్’ మాసపవూతిక వెలువడింది. ఈ పత్రికను ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వీర సావర్కర్ ఎంతో అభిమానించేవారు. ఈ కాలంలోనే తోట లక్ష్మణ్ సంపాదకత్వంలో ‘తెలుగు పంచ్’ అనే వారపవూతిక కూడా వెలువడింది. కానీ, ఆ పత్రిక వివరాలు లభించడం లేదు. 1925లో కమాటిపురాలోని ‘ఆంధ్ర ఆత్మోన్నత మండలి’ ఆధ్వర్యంలో పి.ఇ. నారాయణ సంపాదకత్వంలో ‘ఆంవూధవీర్’ అనే ఆధ్యాత్మిక పత్రిక వెలువడేది. ఇందులో స్వామి రామతీర్థ, భక్త తుకారాం, స్వామి వివేకానంద లాంటి మహనీయుల సందేశాలు ప్రచురించేవారు.
వెన్నెల నర్సింగయ్య అనే తెలుగు రాని వ్యక్తి కూడా తెలుగు భాషాభిమానంతో‘తెలుగు సంగ్రామం’ అనే వారపవూతికను కొన్నాళ్ళు నడిపారు. ఇవన్నీ మన దేశానికి స్వతంత్రం రాక పూర్వం వెలువడిన పత్రికలే. స్వాతంవూత్యానంతరం ముంబై తెలుగు వారిలో ఆశ్చర్యకరమైన స్తబ్ధత ఏర్పడింది. ఉత్తరాది వలసల వెల్లువే బహుశా ఇందుకు కారణం కావచ్చు.

మరాఠీ యాసలో తెలుగు మాండలికం
స్వరాష్ట్రంలో మాండలికాలు ఉన్నట్లే ముంబై తెలుగుభాషకు కూడా ప్రత్యేకత ఉంది. ఈ భాషను ఒక విశిష్టమైన మాండలికంగా పేర్కొనవచ్చు. మరాఠీ యాసలో సామాన్య తెలుగు ప్రజలు మాట్లాడే భాషలో అద్వితీయమైన కమ్మదనం ఉంటుంది. ‘అక్కడ వెదుక్కో..’ అనే దానిని ‘అక్కడ లెంకు..’ అంటారు. ‘ఆ సభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు..’ అనే దాన్ని ‘ఆ సభలో ఉస్థితి భారీగా ఉంది..’ అంటారు. ‘ఆయన ఆరోగ్యం చెడింది’ అనడానికి, ‘ఆయన్ని తబ్యత్ బిగాడాయించింది..’ అంటారు.
‘సమ్జాయించిన గానీ దిమాక్కెక్కుతలేద్..’ (సముదాయించిన అర్థం చేసుకోవడం లేదు), ‘కంపిన్ల మాల్వోతలేదు. శంబర్ టక్క ఆడు కంపిన్ బంద్ పెడ్తడు..’ (కంపెనీలో మెటీరియల్ అమ్ముతలేరు. వంద శాతం వాడు కంపెనీ మూసేస్తాడు), ‘ఆమె నౌక్రీ ఠీకుంది’ (ఆమె ఉద్యోగం బాగుంది), ‘ఠీక్ టైముకు చేర్నా’ (సమయానికే చేరుకున్నా), ‘ఆ బేవ్డాగాన్ని తడీపార్ చేసిండ్రు’ (ఆ తాగుబోతును సరిహద్దు బయటకు పంపారు), ‘నేన్భీ పోతున్నా’ (నేను కూడా పోతున్నాను) ఇలా మరాఠీకరణ చెందిన తెలుగు చెవులకింపుగా ఉంటుంది. కాగా, వ్యవహారిక మరాఠీ భాష కాస్త విభిన్నంగా ఉన్నప్పటికీ గ్రాంథిక మరాఠీ భాషలోని పదాపూన్నో తెలుగు పదాలను పోలి ఉంటాయి. ఉదా: మరాఠీ గ్రాంథికంలో కూడా శ్రీమతిని ‘భార్య’ అనే అంటారు. వివిధ..వివిధ్,/విభాగం..విభాగ్ వంటివి మచ్చుకు కొన్ని.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine