Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home>>  Sunday>>  Vasthu
8/4/2012 10:20:57 PM
వాస్తు

classic-bedroom-design

నైరుతి బెడ్‌రూమ్ బాల్కనీ ఎటువైపు ఉండాలి?

- వెంక మోత్కూర్
నైరుతి పడక గది ఇంటికి గుండెకాయ లాంటిది. దానికి అపసవ్యంగా రంధ్రాలు పెట్టకూడదు. పడక గదిలో అతి తక్కువ వెంటిలేషన్, అతి తక్కువ గాలి, వెలుతురు రెండూ సరైనవి కావు. నైరుతి గది విశ్రాంతికి తల్లి ఒడిలా ఉండాలి. రోడ్డు మీది బస్టాండులా కాదు. దాని ఉష్ణోక్షిగతలో సమతుల్యత ఉన్నప్పుడే ఆ ఇంటి గృహ యజమానులకు స్వాంతన చేకూరుతుంది. చాలామంది తమ గదిని అధికంగా ప్రేమిస్తూ దానికే ఒక బాల్కనీ ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిని చాలామంది ఇంజనీర్లు ప్రోత్సహిస్తున్నారు. ఇంటి హాలులోంచి పడకగదిలోకి వెళ్ళే తూర్పు లేదా ఉత్తర ఈశాన్య ద్వారాలు తప్ప పడక గదినుంచి దక్షిణ, పశ్చిమాల వైపు ఇంటి పరిధిని దాటి వెళ్ళే బాల్కనీలు పెను ప్రమాదాన్ని కలిగిస్తాయి. దక్షిణమైనా, పడమరైనా ఇంటి స్థలాన్ని కత్తిరించి అంటే గోడ లోపలికి కట్టుకొని ఏర్పాటు చేసుకునే బాల్కనీలు కూడా సరైనవి కావు. కాబట్టి, నైరుతి పడక గదికి బాల్కనీ పెట్టాలన్న ఆలోచనే తప్పు.

పెద్దవాళ్ళు పై అంతస్థులో, చిన్నవాళ్ళు కింద ఉండాలా?

- రామేశ్వరరావు, లింగంపల్లి
అంతస్థులు కట్టుకొని ఉంటున్నప్పుడు మేడలు ఏర్పడగానే పై మేడ గొప్పది, కింది మేడ తక్కువది అనే భావన చాలామందికి వస్తుంది. నిజానికి పై మేడలన్నీ నేలమీద ఇంటికి పుట్టిన బిడ్డలే కదా! దేనికదిగా కట్టుకున్నప్పుడు ఎవరికేది నచ్చితే ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు. చిక్కంతా పంచుకోవడంలో ఇబ్బంది వచ్చినప్పుడే కలుగుతుంది. నేలమీద ఇళ్ళు లేకపోతే పై మేడలు తయారు కాలేవు కదా.
ఆ రకంగా మొదటి స్థానం నేలమీద ఇళ్ళకే వర్తిస్తుంది. ఈ శాస్త్రీయ కోణంలో ఇంటి పెద్దలు అంటే తల్లిదంవూడులు భూమిమీది గృహాన్ని, ఆ తర్వాత వరుసగా పెద్ద సంతానం నుండి చిన్న సంతానం వరకు ఆపై మేడలను తీసుకోవాలి.


ఈశాన్యంలో తులసి కోట పెట్టుకోవచ్చా?
- మూర్తి రమణి, దిల్‌సుఖ్‌నగర్
దేవుడు ఈశాన్యంలో ఉంటాడని చాలామంది ఈశాన్యంలో తులసి కోట పెట్టి పూజిస్తారు. అది మంచిది కాదు. తులసి కోటకు ఎండ ఎక్కువ కావాలి. అది దక్షిణ, పశ్చిమాలలో ఎక్కువగా లభిస్తుంది. ఐతే, తులసి కోటను తూర్పు నుండి ఆగ్నేయం వరకు, దక్షిణ ఆగ్నేయం నుండి దక్షిణ నైరుతి వరకు, దక్షిణ నైరుతి నుండి పడమర వరకు, అక్కడి నుంచి ఉత్తరం సగం వరకు తులసి కోటను పెట్టుకోవచ్చు. ఎక్కడ తులసి తొట్టిగాని, కోటగాని కట్టుకున్నా అది ఇంటి ద్వారాలకు ఎదురుకాకుండా చూసుకోవాలి.


మా అపార్ట్‌మెంట్‌కు బాల్కనీ ఈశాన్యంలో ఉంది. దీన్ని ఉంచుకోవాలా? తీసివేయాలా?

- వేదవతి, చెన్నూర్
చాలామంది అపార్ట్‌మెంట్స్ నిర్మించేవాళ్ళు బాల్కనీ కొరకు గదులను వెనక్కు తీసుకొని బాల్కనీలు చూపిస్తూ పైకి మురిపిస్తూ ఆ తర్వాత ఏడిపిస్తున్నారు. ఎందుకంటే, మనిషి ఆనందం, ఫ్రెష్‌నెస్ పొందాలంటే ఆరు బయటకు నడవాలి. ఉదయ సాయంవూతాలు మనిషి ప్రకృతితో మమేకమైనప్పుడు జీవితంలో ఉత్సాహం ఎప్పుడూ తరిగి పోకుండా ఉంటుంది. ఈ ఉల్లాసపు క్షణాలు గృహసభ్యులకు అందడం కోసమే ఇంటి పరిధిని దాటి బాల్కనీలు బయటికి పెంచి కట్టడం సంప్రదాయ వాస్తు పద్ధతి. స్థలం పోతుందని, ఖర్చవుతుందని అనేక కుంటి సాకులతో మన ఇంటి స్థలాన్నే వాడుకొని, మన బాల్కనీ అని చూపిస్తుంటారు. ఈ కోణంలో తూర్పు ఈశాన్యంలో, ఉత్తరంలో, తూర్పులలో బాల్కనీలను పెట్టి వాస్తును నట్టేటముంచుతున్నారు. మీ ఇంటికి ఈశాన్యంలో ఉన్న బాల్కనీ బయటికి పెరిగి ఉంటే ఫరవాలేదు. లేదంటే ఆ బాల్కనీకి వెంటనే ఒక అల్యూమినియం గ్రిల్ వేయండి. మంచి శుభాలు పొందుతారు.


స్థలానికి పడమర వాయవ్యం పెరగవచ్చా?

- లోకేశ్వర్, తూప్రాన్
ఒక మంచి స్థలం అనేది దాని రూపం పైనా, స్వభావం పైనా ఆధారపడి ఉంటుంది. రూపం బాగుండి, స్వభావం బాగాలేక పోతే ఉపయోగం లేదు. రూపం బాగా లేకున్నా సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, భూమికి స్వభావమే ప్రధానం. ఏ స్థలమైనా ఎటువైపు పెరగకుండా ఉండటమే మంచిది. పడమర వాయవ్యం పెరిగి ఉండటం తప్పుకాక పోయినా దానికి అనేక సుగుణాలు తోడైతే అది మంచిదవుతుంది. కాబట్టి, సాధ్యమైన మేరకు భూమిని సమభుజాలు గానే వాడుకోవాలి. అప్పుడే సమృద్ధి కలుగుతుంది.


పెరిగిన మూలల్లో సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవచ్చా?

- సందీప్, కొండాపూర్
ఇల్లు కట్టుకునేటప్పుడు పెరిగిన మూలలను తొలగిస్తూ ఉంటారు. ఆ పెరిగింది పోగా మిగతా భాగాన్ని ఇంటికి వాడుకోవడం మంచిది. ఐతే, వదిలేసిన మూలలను వాడుకోవడమే తప్పు. పైగా దానిలో సెప్టిక్ ట్యాంక్ అనేది చాలా దారుణం అవుతుంది. కాబట్టి ఆగ్నేయం, నైరుతి, వాయవ్య, ఈశాన్య మూలలు ఏవి పెరిగినా, వాటిని సెపరేట్ చేసినా, అందులో సెప్టిక్ ట్యాంక్‌లు పెట్టకూడదు. మరుగుదొడ్లు గుంతలకు సరైన స్థానం తూర్పు సెంటర్, ఉత్తరం సెంటర్ మాత్రమే. దీనికి విభిన్నంగా కట్టవద్దు.


vasthu


vasthu1

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine