HomeLATEST NEWSRayudu, Dhoni, Yuvi shine as India A scored 304 against England

దుమ్మురేపిన రాయుడు, ధోనీ, యువీ

Published: Tue,January 10, 2017 05:12 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ముంబై: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న వామ‌ప్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగా రాణించారు. ముఖ్యంగా వెట‌ర‌న్ ప్లేయ‌ర్‌ యువ‌రాజ్‌, కెప్టెన్‌గా త‌న చివ‌రి మ్యాచ్ ఆడుతున్న ధోనీ చెల‌రేగ‌డం టీమిండియాకు శుభ‌సూచ‌క‌మే. ఇంగ్లండ్‌తో వ‌న్డే, టీ20 టీమ్స్‌కు ఎంపిక కాని అంబ‌టి రాయుడు కూడా సెంచ‌రీతో దుమ్మురేపడం విశేషం. రాయుడు సెంచ‌రీ, ధోనీ, యువీ, ధావ‌న్‌ హాఫ్ సెంచ‌రీల‌తో ఇండియా ఎ టీమ్ 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 304 ర‌న్స్ చేసింది.

రాయుడు 97 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 100 ప‌రుగులు చేసి రిటైర్ ఔట్‌గా పెవిలియ‌న్‌కు వెళ్లాడు. ఇక జార్ఖండ్ డైన‌మైట్ ధోనీ స్లాగ్ ఓవ‌ర్ల‌లో వ‌చ్చి త‌న‌దైన స్టైల్లో రెచ్చిపోయి ఆడాడు. అభిమానుల అంచ‌నాల‌ను ఏమాత్రం వ‌మ్ముచేయ‌ని మిస్ట‌ర్ కూల్‌.. కేవ‌లం 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 68 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక యువ‌రాజ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 56 ర‌న్స్ చేశాడు. గాయం కార‌ణంగా చాలా రోజులు టీమ్‌కు దూరంగా ఉన్న ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. 84 బంతుల్లో 63 ర‌న్స్ చేసి ప‌ర్వాలేద‌నిపించాడు.
3242
1

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology