వెన్నునొప్పికి ఉపశమనం-3

yoga
వెన్నెముకను శక్తివంతం చేసే మరికొన్ని ఆసనాలు ఈ వారం చూద్దాం....
శలభాసనం వేరియేషన్ 1
బోర్లా పడుకుని రెండుసార్లు శ్వాసను సాధారణంగా తీసుకోవాలి. తరువాత రెండు చేతులను మోచేతుల వద్ద మడిచి ఛాతి భాగానికి కిందుగా తీసుకురావాలి. భుజానికి మోచేతులు సమాంతరంగా ఉండేట్లు చూసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు కాళ్లను మోకాళ్లవరకు మడిచి పైకి తీసుకురావాలి. ఇప్పుడు గాలిపీల్చుకుని ... నెమ్మదిగా గాలివదిలేస్తూ తలని కుడివైపు, పాదాలను ఎడమవైపు తిప్పాలి. తిరిగి శ్వాస పీల్చుకుంటూ మధ్యకు వచ్చిన తరువాత ... మళ్లీ గాలి వదులుతూ తలను ఎడమవైపు, పాదాలను కుడివైపు తిప్పాలి. ఇలా పదిసార్లు కుడివైపు, పదిసార్లు ఎడమవైపు తిప్పాలి. తరువాత బోర్లా పడుకుని రిలాక్స్ అవ్వాలి. మరలా ఒకసారి సేమ్ రిపీట్ చేయాలి.
ఉపయోగాలు :నడుము భాగాన పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.
వెన్నెముక మధ్య ట్విస్ట్ చేసినట్లు అవుతుంది, కాబట్టి వెన్నెముకతో అనుసంధానమైన అన్ని కండరాలకు మంచి వ్యాయామాన్ని ఇస్తుంది.
జాగ్రత్తలు : మెడనొప్పి ఉన్నవారు తల పక్కలకు తిప్పకుండా కేవలం కాళ్లను మాత్రమే తిప్పాలి.
శలభాసనం వేరియేషన్ 2
ముందుగా నేలమీద బోర్లా పడుకోవాలి. రెండు అరచేతులను ఒకదానిమీద ఒకటి పెట్టి నుదుటిని ఆ రెండు చేతుల మీదుగా ఆనించాలి. పాదాలని మోకాలివద్ద మడిచి 90 డిగ్రీల కోణంలో తీసుకురావాలి. ఇప్పుడు గాలి పీల్చుకుంటూ మోకాళ్లన్ని పైకి ఎత్తాలి. మళ్లీ గాలి వదిలేస్తూ మోకాళ్లని మాత్రమే భూమికి ఆనించాలి. ఇలా 10 సార్లు రిపీట్ చేసిన తరువాత పాదాలని నేల మీదకు తీసుకొచ్చి పూర్తిగా రిలాక్స్ అవ్వాలి.
ఉపయోగాలు : ఈ ఆసనం వల్ల వెన్నెముక శక్తివంతం అవుతుంది.
నడుము, పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగిస్తుంది.
(కొత్తగా ప్రయత్నించేవారు సాధన చేయడం ద్వారా పూర్తి ఆసనాన్ని చేయగలుగుతారు)

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine