సమ్మర్‌లో కూల్ ఐటమ్స్ ఎంత హాట్ ఫేవరేటో... హాట్ ఐటమ్స్‌కు కూడా అంతే ఫేవరేట్! ఇప్పుడు ‘హాట్’ను సెలెక్ట్ చేసుకోవడం ‘వెరైటీ’ మాత్రమే కాదు.. ‘స్వీట్’ కూడా! అందుకే ఈ వారం మెనూకార్డ్ అందిస్తున్న స్పెషల్స్ పుడ్డింగ్స్, కేక్స్! చూస్తుంటేనే నోరూరించే ఈ ఐటమ్స్ చేతికందితే హాట్ అంతా స్వీటైపోతుంది.
బ్లూబెర్రీ బీజ్ కేక్
కావలసిన పదార్థాలు:
పాలు - 250మి.లీ.
కోడిగుడ్లు - 2
గ్లాటరింగ్ - 1ఱగా.
క్రీమ్ - షగా.
గట్టి పెరుగు - 4 స్పూన్‌లు
స్వీట్ చీజ్ - 2షగా.
వెనీలా ఎసెన్స్ - 1 స్పూన్
వెనీలా స్పాంజి - 1
చెర్రీ పండు - 1
చక్కెర - తగినంత
బ్లూబెర్రీ పండ్లు - 10ఱగా.
మామిడిపండ్ల గుజ్జు - 5ఱగా.
తయారు చేయు విధానం: పాలల్లో చక్కెర, కోడిగుడ్డు పచ్చసొనను మాత్రమే వేసి మరిగించాలి. ఆ తర్వాత చల్ల ్లబడేందుకు పక్కన పెట్టుకోవాలి. బ్లూబెపూరీలను గుజ్జులా చేసుకోవాలి. ఓ గిన్నెలో గ్లాటరింగ్‌లో నీళ్లు పోసి కరిగేంతవరకు కలపాలి. దీంట్లో వెనీలా ఎసెన్స్, క్రీమ్, పెరుగు, స్వీట్ చీజ్, బ్లూ బెర్రీ పండ్ల గుజ్జు వేసి బాగా చిక్కబడేంత వరకు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందు గిన్నెలో పోసి పై నుంచి వెనీలా స్పాంజిని పెట్టాలి. ఓవెన్‌లో 10డిక్షిగీల వద్ద 20నిమిషాలు బేక్ చేయాలి. బయటకు తీశాక మామిడిపండ్ల గుజ్జును పోసి క్రీమ్, చెర్రీతో గార్నిష్ చేయాలి. స్వీట్‌గా ఉండే కేక్ మీ నోరూరించక మానదు!
కెరామిల్ కస్టర్డ్
కావలసిన పదార్థాలు:
పాలు - 250మి.లీ.
చక్కెర - తగినంత
కోడిగుడ్లు - 2
వెనీలా ఎసెన్స్ - 2 స్పూన్‌లు
తయారు చేయు విధానం: పాలల్లో చక్కెర వేసి వేడి చేయాలి. దీంట్లో కోడిగుడ్డును, వెనీలా ఎసెన్స్‌ని వేసి బాగా కలపాలి. దీన్ని ఓ గిన్నెలో తీసుకొని ఓవెన్‌లో 10డిక్షిగీల ఉష్ణోక్షిగత వద్ద 20నిమిషాల పాటు బేక్ చేయాలి. కెరామిల్ కస్టర్డ్‌ని లాగించేయొచ్చు.
కెవినట్ పుడ్డింగ్
కావలసిన పదార్థాలు:
పాలు - 250మి.లీ.
కోడిగుడ్లు - 2
వెనీలా స్పాంజి - 1
చాక్లెట్ స్పాంజి - 1
కిస్‌మిస్ - ళగా.
బాదంపప్పు - ళగా.
జీడిపప్పు - 2 గ్రా.
వెనీలా ఎసెన్స్ - 1 స్పూన్
చక్కెర - తగినంత
తయారు చేయు విధానం: పాలల్లో చక్కెర వేసి బాగా వేడిచేయాలి. దాంట్లో కోడిగుడ్ల తెల్లసొన, పచ్చసొన వేసి బాగా కలపాలి. చిక్కబడేంత వరకు బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఓ ట్రేలో చాక్లెట్ స్పాంజి, దానిమీద వెనీలా స్పాంజి పెట్టాలి. దానిపై నుంచి మరిగించిన పాలను పోయాలి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌లను చిన్నగా కట్ చేసుకొని పైన వేయాలి. ఇప్పుడు దీన్ని ఓవెన్‌లో 10డిక్షిగీల సెంటీక్షిగేడ్‌ల వద్ద 15నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది. వేడి.. వేడి పుడ్డింగ్ మీ ముందుంటుంది.
బనానా కేక్
కావలసిన పదార్థాలు:
అరటిపండ్లు - 6
కోడిగుడ్లు - 3
మైదా పిండి - 15ఱగా.
బేకింగ్ పౌడర్ - 2ఱగా.
బేకింగ్ సోడా - లగా.
వాల్‌నట్స్ - 2
వెనీలా ఎసెన్స్ - 1 స్పూన్
వెన్న - 5ఱగా.
చక్కెర - తగినంత
తయారు చేయు విధానం: అరటిపండ్లను మెత్తగా చేసుకోవాలి. వాల్‌నట్స్‌ని పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో వెన్న తీసుకొని అందులో చక్కెరను బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ తర్వాత కోడిగుడ్డు, మైదాపింది, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, అరటిపండ్ల గుజ్జు, వాల్‌నట్స్ పొడి, వెనీలా ఎసెన్స్ అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలో వేసి మైక్రోఓ 10డిక్షిగీల ఉష్ణోక్షిగత వద్ద 25నిమిషాల సేపు బేక్ చేయాలి. నోరూరించే బనానా కేక్ రెడీ. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకొని ఆ తర్వాతైనా తినొచ్చు.
సేకరణ: సౌమ్య నాగపురి
ఫోటోలు: భాస్కర్
| |
|
![]() |
|