బ్రోకెన్ సాంగ్స్

సినిమా సాహిత్యం అంటే...
సూటిగా గుండెల్లో గుచ్చుకునే అక్షరశరాలు
ఘోషించే హృదయానికి భాసించే మనసుకు
బాసటగా నిలుస్తూ కన్నీటి కాలువలై ప్రవహిస్తూ
వేదనాభారాన్ని దింపుతూ సాగే ఒక ప్రవాహం...!
ఎన్నెన్నో మలుపులతో సాగే మధురమైన పాటల ఝరి..!!

Dhanush talangana patrika telangana culture telangana politics telangana cinemaసినిమా పాటలు... విని వదిలేసేవి కావు. ఒంటరిగా నడుస్తున్నప్పుడు హుషారుని, గుంపుగా ఎగురుతున్నప్పుడు జోష్‌ని నింపుతాయి. సాహిత్యం సినిమాలోని డెప్త్‌ను పెంచుతుందనేది కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఒక విషయం గుర్తు చేసుకోవాలి. సినిమాల్లో ‘మార్పు’ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఒక్క సాంకేతికతనే. అదికాకపోతే కథ, కథనాల్లో మార్పులు ప్రస్తావిస్తారు. కానీ స్క్రీన్‌ప్లే, ఫైట్స్, పిక్చరైజేషన్, హీరోల స్టార్‌డమ్... అన్నిట్లోనూ ఎంతోకొంత మార్పులు వచ్చినట్టే... సినిమా పాటలు కూడా ట్రెండ్‌కు అనుగుణంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ప్రతి విషయమూ పలుచనే. ఆ ప్రభావంతోనే సాహిత్యం కూడా పలుచనైపోతుందనేది సాహిత్యాభిమానుల మాట. సందర్భోచితంగా వినిపించే పాటలకు క్రమంగా కాలం చెల్లిపోయింది. ఇప్పటి పాటల్లోని అక్షర విన్యాసాలు, అభ్యంతరకరంగా ఉన్న సందర్భాలూ అనేకం ఉన్నాయి.చిత్ర పరిక్షిశమలోకి కొత్తనీరు వస్తున్నకొద్దీ సినిమా పాటల లెక్కలు మారినయ్. ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక డ్యూయెట్, ఒక మెలోడి సాంగ్, క్లయిమాక్స్ సాంగ్, ఒక మాస్ పాట, ఒక ఐటమ్ సాంగ్...! కథానుసారం సందర్భోచితంగా ఉపయోగించే పాటల క్రమం తగ్గిపోయింది. ఇలాంటి పరిణామాన్ని చూసే సినిమా అంటే నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు... మధ్యమధ్యలో డైలాగ్స్ అనే అభివూపాయానికొచ్చారు సినీ అభిమానులు, ప్రేక్షకులు.కామెడీ, సెంటిమెంట్, టీజింగ్, డ్యూయట్, ఇంట్రడక్షన్... సిట్యుయేషన్ ఏదైతే ఏంటి? ఒక పాట కావాలి. దర్శకుల పాపమో, ప్రేక్షకుల అభిరుచో కచ్చితంగా చెప్పలేం కానీ ఇప్పటి పాటల్లో పదాల పదనిసలు తప్ప సాహిత్యపు రాగాలు వినిపించడం లేదనేది కొందరు పరిశీలకుల అభివూపాయం. ఆవేదన కూడా. యంగ్ జనరేషన్ ఇండవూస్టీలో అడుగుపెట్టాక సినిమా కథలకు ‘ట్రీట్‌మెంట్ కొత్తగా ఇస్తున్నాం’ అనే పేరుతో మాటల్లో, పాటల్లో హెచ్చు మీరిపోయారు. హీరోయిన్లను ఏడిపించే పాటల్లో ‘రాయే..వాయే, రావే పోవే’లు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్‌లో ఇష్టమొచ్చిన పదాలు వాడటం బాగా అలవాటు చేసుకున్నారు. సదరు హీరో నటించిన సినిమాలనో, తాతల, తండ్రుల చరివూతనో బేస్ చేసుకుని రాయడం ఎక్కువైంది. ఒక్కసారి హీరో మెప్పు పొందిన అలాంటి పాటల వైఖరి తరువాత సినిమాలకూ పాకడం కామన్‌గా జరిగిపోయింది. మెప్పుకోసం రాసిన పాటల పిచ్చి అటు హీరోలకూ, రచయితలకూ ముదిరి తెరనిండా కనిపించే హీరోను పాటల్లోనూ చూపించే ప్రయత్నం చేశారు. హీరో కోసమే రాసే పాటలు... ‘వన్ టు త్రీ నేనొక కంత్రీ’లాగా తయారయ్యాయి. ‘నందమూరి’ నాయకా... ముందరుంది కానుకా, ‘ఎన్ పేరే మురుగన్..భయమంటే ఎరుగన్ మా తాత ‘నందమూరి నాయగన్’, ‘అల్లు’వారి పిల్లగాడా... అల్లుకోరా గిల్లుకోరా, ‘మామయ్యది మొగల్తూరు’... మా నాన్నది పాలకొల్లు’... ఇలాంటి ‘మోత’ ఇప్పటికీ మోగిపోతూనే ఉన్నది.sruthihassan talangana patrika telangana culture telangana politics telangana cinema

ఇప్పటి స్పెషాలిటీ ఏంటంటే...
పరభాషా పదాలు ఎంత ఎక్కువగా వాడితే అంత పాపులర్ అవుతుంది ఆ పాట. ఇంకా చెప్పాలంటే అదొక ప్రయోగం. అంతేకాదు ‘లస్కూ లేదు బుస్కూ లేదు’ లాంటి అర్థం లేని, అసలే వినని పదాలు వాడటం కూడా ఫ్యాషనే. సంగీతం హోరులో సాహిత్యం వినిపించని విధంగా పాటలు కంపోజ్ చేస్తున్న వేళ... ఇలా పదవూపయోగాలూ ఎక్కువై పాట తీరే మారుతూ వస్తున్నది. ఇలాంటి విషయాల్లో ఫలితం వెంటనే కనిపించదు. కొన్నేళ్లు ఇదే ట్రెండ్ కొనసాగితే అచ్చమైన తెలుగు పాట వినగలమా? అసలు రచయితలకు తెలుగు పదాలు దొరుకుతాయా? తెలుగు భాషమీద ఎంత ప్రేమున్నా రాసే అవకాశాలు ఉంటాయా? చిత్ర పరిక్షిశమలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం భాషమీద పట్టులేకున్నా ‘మాటకారి’ అయితే చాలు పాట రాయవచ్చు అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం.అయినా ఒకపాట వినసొంపుగా ఉంటే సరిపోతుంది. అంతేకానీ సాహిత్యం, దాని అర్థం అందరికీ అవసరమా? కాకపోవచ్చు. కానీ ఒక ప్రామాణికం అంటూ ఉండాలి కదా! ఇటీవల వచ్చిన చాలా సినిమాల్లో అన్నీ ఇంగ్లీష్, హిందీ భాషల కలయికతో కూడిన పాటలే. లేటెస్ట్‌గా బిజినెస్‌మేన్ చిత్రంలో పాటలు గమనిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

ఏదీ అచ్చతెలుగు పాట?
ఇప్పుడు ఇదొక సవాల్. ఇప్పుడున్న సినిమా పాటల్లో పరభాషా పదంలేని అచ్చ తెలుగు పాట ఒక్కటి చూపించినా జన్మధన్యమే. రచయితలు లేక కాదు.. వాళ్లకు రాసే అవకాశం లేదు. అదే ఇక్కడ గుర్తించాల్సిన విషయం. చాన్నాళ్లకు ఒక అచ్చమైన తెలుగు పాటలాగ ఖలేజా సినిమాలోని ‘సదాశివ సన్యాసి’ వినిపించింది. కానీ అందులో కూడా ఇంగ్లీష్ ట్యూన్ పంటికింది రాయిలా తగిలింది. అంతేకాదు ఇప్పుడు కాపీట్యూన్స్ కూడాఎక్కువే కాబట్టి ఆ ట్యూన్‌ను అందుకోవడం కోసం పదాల కోసం, పదబంధాల కోసం పరభాషను నమ్ముకోక తప్పడం లేదు. ఇదొక కొత్త అలవాటు. దాని ఫలితం అందరూ ఊహించగలిగేదే! ఏదేమైనా ట్రెండ్ పేరుతో తెలుగును పక్కన పెట్టాల్సిన పనిలేదు. అందుకే ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ సూత్రం మళ్లీ పాత రోజులను తీసుకొస్తుందని ఆశించడమే మంచింది.

ఆ గౌరవం కాపాడాలి
chintakayalaravi talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలుగు సినిమా పాటల్లోని సాహిత్య గమనంలో అనేక మార్పులు వచ్చాయి. నా పాటల్లో తెలుగు మాధుర్యం నింపడం నేను ఎప్పుడూ మరిచిపోలేదు. పరిక్షిశమలో అనేక మార్పులు వస్తున్నప్పటికీ తెలుగువాడిగా తెలుగు భాషను గౌరవించడం నా బాధ్యత. అయితే కొన్ని బాణీలకు తెలుగు పదాలకంటే పరభాషా పదాలు వాడితేనే ఆ పాటకు అందమొస్తుంది. కొన్నిసార్లు అది తప్పదు. అంటే అవకాశం లేనప్పుడు తప్ప ఎప్పుడూ పరభాషను ఆశ్రయించాల్సిన పనిలేదు. ఆ పరిస్థితి ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ అని పాడుకున్న కాలం నుంచే ఉంది. పాటల్లో పదవూపయోగాలు చేయడం ఒక వెరైటీ. అందుకోసం కూడా వేరే భాషలపై ఆధారపడనవసరం లేదు. నేను చేసిన పదవూపయోగాలు గమనించండి.. వయస్కాంతం, వన్నెవూపాసన, ముద్యోగం, ముద్దార్థి, మదుమోహవ్యాధి, అమ్మాయకుడు, వెన్నెలవంక, అరనవ్వు, సొంప్యూటర్, థ్రిల్లింత, రసవద్గీత, తాపావళి, సోకులాష్టమి, ఇష్టకష్టాలు, మోహమాటాలు, కోకసీమ, అందగత్తెగాడు....! ఇలాంటివన్నీ తెలుగు పదాలతో చేసిన ప్రయోగాలే కదా. మన భాష మీద మనకు మమకారం ఉండాలి. అప్పుడే ఏదైనా చేయవచ్చు. అయినా తెలుగుదనానికి వస్తున్న నష్టం రెండు నిమిషాలు వినిపించే సినిమా పాటల వల్ల కాదు.. నట్టింట్లో పాగా వేసిన టీవీలు, ఎఫ్.ఎమ్. వల్ల! నిజానికి సినిమా పాటల వల్ల తెలుగు భాషకు వచ్చిన ప్రమాదం ఏమీలేదు. దాన్ని కాపాడటానికి ఎవరో ఒకరు పరిక్షిశమలో ఉండనే ఉంటరు. అది అలా సాగిపోతూనే ఉంటుంది.

- చంద్రబోస్, సీనియర్ సినీ గేయరచయిత



దర్శక నిర్మాతల అభిరుచి మేరకే...
man talangana patrika telangana culture telangana politics telangana cinemaచంద్రబోస్‌గారి పరిచయం తర్వాత పాటల రచయితగా మారాను. ఆరేళ్లుగా ఆయన ప్రోత్సాహంతోనే పాటలు రాస్తున్నా. ‘పోరంబోకు’ సినిమాతో మొదటి అవకాశం వచ్చింది నాకు. అందులో ఒక్క పాట రాశాను. ఆ తరువాత ‘రాత్రి’ అనే సినిమాలో మొత్తం నాలుగు పాటలు రాశాను. సశేషం, కోరమీసం...ఇంకా రెండుమూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్‌ను బట్టి పాటలు రాసే పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. మొదటితరం దర్శకనిర్మాతలకు సాహిత్యం మీద పట్టుండటం వల్ల అప్పుడు కథానుగుణంగా పాటలు రాయాల్సి ఉండేది. సహజంగానే సాహిత్యానికి ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పటి ట్రెండ్ వేరు కదా. ఒకప్పటిలాగ పల్లవితో అనుసంధానంగా చరణాలు సాగిన పాటల్లాగ ఇప్పుడు రాసే అవకాశం లేదు. కథాకథనాల్లో వచ్చిన మార్పు వల్ల ఇప్పుడు పాటలంటే ‘క్యాచీ’గా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టే రచయితలు కూడా అందుకు అనుగుణంగా పాటలు రాయక తప్పడం లేదు. అదీ దర్శకుడి అభిరుచి మేరకే. కాబట్టి పరోక్షంగా తెలుగుపాటల్లో తెలుగుదనం కొరవడుతున్న మాట వాస్తవం. అయితే అచ్చమైన తెలుగు పాటలు రాసే రచయితలు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరినీ తప్పు పట్టే అవకాశం లేదని నా అభివూపాయం.

- సదాచంద్ర, వర్ధమాన సినీ గేయరచయిత



వై దిస్ కొల
పాటకు భాషే ప్రధానం కాదని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ‘వై దిస్ కొల డీ’ పాట నిరూపించింది. అదే స్థాయిలో పాటకు ఉండాల్సిన ప్రమాణాలు ఆ పాటకు లేవనే విమర్శలనూ మూటగట్టుకుంది. ఆ పాటలో వినిపించే బ్రోకెన్ ఇంగ్లీష్ జనాల వాడుకభాషగా అనిపించడంతో ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు. దాంతో పాటు పాడుకునేందుకు ఈజీగా ఉన్న ట్యూనుదీ ప్రధాన పాత్ర అయ్యింది. ఆ పాటకు వచ్చిన పాపులారిటీని చూసి ‘వన్స్ ఆపాన్ టైమ్ నాకో అదిరే గాళ్‌వూఫెండ్ ఉండేదిరో’ అని నితిన్ ‘ఇష్క్’ సినిమాలో ఓ పాట ఉంది. ఆదీ కూడా మంచి ఆదరణ పొందింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ట్రెండ్‌ను ఫాలో అవడంపైనే సినిమా పరిక్షిశమ దృష్టి నిలుపుతుంది కానీ దాని పరిణామాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదని.

Other News



Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine