అమృత్‌సర్ సెంట్రల్ ఆప్ అభ్యర్థి తొలగింపు

Wed,January 11, 2017 05:15 PM


చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున అమృత్‌సర్ (సెంట్రల్) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి దర్బారిలాల్‌ని ఆప్ తొలగించింది. దర్బారిలాల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల అంశాన్ని పూర్తిగా పరిశీలించాక దర్బాలీలాల్‌ను పోటీ నుంచి తొలగించామని ఆప్ పంజాబ్ శాఖ కన్వీనర్ గురుప్రీత్ సింగ్ తెలిపారు. త్వరలో అమృత్‌సర్ సెంట్రల్ స్థానానికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

524

More News

మరిన్ని వార్తలు...