TUESDAY,    February 21, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
suryapet News
1/11/2017 2:09:28 AM
పేటలో టీఆర్‌ఎస్ భారీ ర్యాలీ
కుడకుడరోడ్డు : సూర్యాపేట జిల్లా కేంద్రంలో రా ష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు జి ల్లా వ్యాప్తంగా వామపక్ష నాయకులు, కార్యకర్తలు వేలాదిగా మంత్రి క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కనివిని ఎరుగని రీతిలో చేస్తున్న అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములవుతామంటూ జిల్లా నలుమూలల నుంచి సీపీఎం, సీపీఐ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు మంత్రి జగదీష్‌రెడ్డి చేతుల మీదుగా గులాబీ కండువాలు కప్పుకొని టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలో పాత, కొత్త నాయకులు కలసికట్టుగా పని చేస్తూ రాష్ర్టాభివృద్ధికి తోడ్పడాలన్నారు.

వామపక్ష నాయకుల భావోద్వేగం సీపీఎం, సీపీఐ పార్టీలకు రాజీనామాలు చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా వామపక్ష ఉద్యమనేత నూకల మధుసూదన్‌రెడ్డి, కార్మిక సంఘం నేత వెం పటి గురూజీ భావోద్వేగ ప్రసంగాలు చేసి అందరి హృదయాలను చలింపజేశారు.

ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలు చేసి పేదప్రజల అభివృద్ధికి ఉద్యమాలు, పో రాటాలు చేసి జైలు జీవితం అనుభవించి ఎన్నో కేసులతో ప్రజల పక్షాన పోరాడిన సంఘటనలు గుర్తు చే స్తూ కన్నీరుపెట్టారు. గత ప్రభుత్వాల పాలనలో వా మపక్షాలకు ప్రతి రోజు ఏదో ఒక ఉద్యమానికి ప్రభు త్వ విమర్శలకు ఎన్నో అవకాశాలు లభించేవన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, టీఆర్‌ఎస్ అధికా రం చేపట్టిన తరువాత ప్రజల కోసం పోరాడే నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాడని మనసులో మాట బ యట పెట్టారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించిన తెలంగాణలో మరోమారు ఉద్యమాలు జరుగకూడదనే కేసీఆర్ ఎవరికి ఎలాంటి ఉద్యమాలకు అవకాశం లేకుండా ఇతర అన్ని పార్టీలు ముక్కు న వేలేసుకునే అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్మికులు, సామాన్య ప్రజలు అన్ని వర్గాల వారికి ఎవరికి ఏం కావాలో ప్రజలంతా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో తెలిసిన మహానీయుడు కేసీఆర్ అని కొనియాడారు.

అదే స్ఫూర్తితో మంత్రి జగదీష్‌రెడ్డి జిల్లాను కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ఒక్కొక్కటిగా వివరించారు. కొత్తగా పార్టీ లో ఇచ్చేందుకు ప్రస్తుతం ఏ పదవులు లేవని ఎ లాంటి పదవి ఆశించి పార్టీలో చేరలేదని రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములవుదామని స్వచ్ఛందంగా పార్టీలో చేరామన్నారు. అనంతరం నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని పలు వీధుల్లో జై తెలంగాణ జై కేసీఆర్ జైజై జగదీషన్న అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చైర్‌పర్సన్ గండూరి ప్రవళికాప్రకాష్, కోదాడ మార్కెట్ చైర్మన్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, మారిపెద్ది శ్రీనివాస్, బడుగుల లింగయ్యయాదవ్, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాష్, కటికం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
21
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd