SATURDAY,    February 25, 2017
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
vijetha Educational Magazine
suryapet News
1/10/2017 2:15:16 AM
భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

పాలకవీడు : రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా రైతులు పంటలను సాగుచేయాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి అన్నారు. మండలం లోని జాన్‌పహాడ్ గ్రామంలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట సమూహం అభివృద్ధిపై రైతులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను రైతులు అలవర్చుకోవాలన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా మార్గాలు చూడాలని, వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటిని వినియో గించుకొని కూరగాయల సాగును చేపట్టాలని సూచించారు.

అనంతరం గ్రామంలో రైతులు సాగు చేసిన మొట్టపంటలను పరిశీలించారు. కార్యక్రమంలో నల్లగొండ వ్యవసాయశాఖ అధికారి ఆఫీసర్ పద్మజ, మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణా అధికారి స్వప్న,శ్రావణి, ఎంపీటీసీ సభ్యులు గన్నె సైదా, శేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు.
15
Advertisement
E-Paper
Advertisement


© 2011 Telangana Publications Pvt.Ltd