16న అంగవైకల్య నిర్ధారణ శిబిరం

Tue,January 10, 2017 11:59 PM

నిజామాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : అంగవైక్యలం కలిగిన 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉదయం 9 గం టల నుంచి సర్వశిక్షా అభియన్, ఏఎల్‌ఐఎంసీవో సహకారంతో పరికరాలు, ఉపకరణాలు అందిం చేందు కు శిబిరాన్ని నిర్వహిస్తున్నామని డీఈవో రాజేశ్ తెలిపారు. శిబిరానికి హాజరయ్యే వికలాంగులకు రాష్ట్ర ప్ర భుత్వం జారీ చేసిన సదరం సర్టిఫికెట్‌లో 40 శాతం అంగ వైకల్యం కలి గి ఉండాలని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు, ఆదాయపు సర్టిఫికేట్, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు 6, తండ్రి లేదా తల్లితో శిబిరానికి హాజరుకావాలని తెలిపారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...