గ్రామీణులకు మెరుగైన సేవలు అందించాలి

Tue,January 10, 2017 11:56 PM

రెంజల్ : గ్రామీణ ప్రాంతంలో నిరుపేద మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై చిన్న చూ పు చూడకుండా మెరుగైన సేవలందించాలని రంగారెడ్డి అసిస్టెంట్ కలెక్టర్ పామెల సట్‌పతి సూచించారు. మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్త రా ణి రికార్డు నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలమృతం, భోజనం పంపిణీ చేసే విధానాన్ని సూపర్‌వైజర్ సవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె అధికారులతో కలిసి సబ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు గ్రామాల్లో వాటి ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. మొదటి కాన్పు ప్రభుత్వ దవాఖానలోనే అయ్యేలా ఏఎన్‌ఎంలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఆమె వెంట ఆరోగ్య శాఖ తరపున సూపర్‌వైజర్ గోవర్ధన్, రమణ, తదితరులు ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...