బీఎస్‌ఎన్‌ఎల్ బిల్లుల చెల్లింపునకు గడువు పొడిగింపు

Tue,March 21, 2017 01:57 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కలిగి ఉండి బిల్లులు చెల్లించకుండా తొలగించిన కనెక్షన్ల పునరుద్ధరణకు జూన్ 15వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలంగాణ టెలికాం సర్కిల్ సీజీఎం ఎల్.అనంతారం ఓ ప్రకటనలో తెలిపారు. సర్వీ స్ పునరుద్ధరణ సమయంలో ఉచితంగా బీఎస్ ఎన్‌ఎల్ సిమ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ.21 చార్జీ తో నెల వరకు చార్జీలు లేకుండా ఒకే నెం బర్‌కు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చన్నారు. రూ.39లతో రెండు నెంబర్లకు, రూ.49లతో మూడు నెంబర్ల వరకు ఉచితంగా మాట్లాడు కునే అవకాశం బీఎస్‌ఎన్‌ఎల్ కల్పిస్తోందని తెలిపారు.

277
Tags

More News

మరిన్ని వార్తలు...