Wednesday, June 19, 2013
Home >> Features >> Mee Features
నిజం తెలియక

colombo-sri-lankaఒకరోజు నేను కొండాపూర్‌కి వెళ్లి పనులు చూసుకొని లోకల్ బస్‌లో మా కాలనీకి తిరుగు ప్రయాణమయ్యాను. ఎంతోసేపు నిల్చున్నాక ఓ బస్సు రద్దీతో వచ్చింది. నిల్చోవడానికి కూడా స్థలం లేదు. ఇంకో బస్సు కోసం వేచి చూడాలంటే.. మళ్లీ ఎంత సమయం పడుతుందో అనుకుంటూ అదే బస్సు ఎక్కాను. సీనియర్ సిటిజన్స్ సీట్లు కూడా ఖాళీగా లేవు. బస్సు నెమ్మదిగా వెళుతోంది. ఓ రెండు స్టేజీల తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకుంటూ నిల్చోవడానికి సందు దొరికింది. అప్పుడు వెనుక ఉన్న ఒకరిపై నా దృష్టి పడింది. ఓ పదహారేళ్ల కుర్రాడు, వాడి పక్కన ఓ పెద్దాయన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పక్కనే ఎంతో మంది ముసలివాళ్లు నిలుచున్నా ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు.

నేను మాత్రం ఆ కుర్రాడిని మనసులోని తిట్టుకోసాగాను. ‘ఈ కాలం కుర్రాళ్లు పెద్దలను గౌరవించడం లేదు. తెలివి ఎక్కువైన కొద్ది తల్లిదంవూడులను మరచిపోతున్నారు. కలికాలం అంటే ఇదే మరి’ అంటూ మనసులోనే నా కసి ఆ కుర్రాడిపై తీర్చుకుంటున్నాను. ఓ పది స్టేజీలు దాటాక బస్సు ఎల్.బి.నగర్ స్టేజీలో ఆగింది. ఇంతలో ఆ పెద్దాయన ఆ కుర్రాడిని చంకలోకి ఎత్తుకొని బస్సు దిగిపోయాడు. ఆ సీటు పక్కన కూర్చున్న ఇంకో ప్రయాణికుడిని ఆ కుర్రాడి గురించి వాకబు చేశాను.‘సార్! ఆ పిల్లవాడికి పుట్టినప్పట్టి నుంచి పోలియో వ్యాధితో పాటుగా, మెదడు కూడా సరిగా పనిచేయదు. ఆ పెద్దాయన అతని తాతగారట.’అని చెబుతుంటే ఆ కుర్రాడిని మనసులో తిట్టుకున్నందుకు పశ్చాత్తాపపడసాగాను. నిజం తెలియక ఎంతో తప్పుచేశానని బాధపడ్డాను. ఇప్పటికీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ దృశ్యమే కళ్లముందు కనిపిస్తుంది.

- పులిజాల రవీందర్‌రావు,
వనస్థలిపురం, హైదరాబాద్

Other News
Most Viewed galleries
Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine