Friday, May 24, 2013
Home >> Features >> Mee Features
ప్రియమైన ప్రజలారా!

kiran-cbnమన తెలంగాణ కరెంటు లేక, తింటెందుకు తిండి లేక, సబ్సిడీ విత్తనాల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే మన సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తున్న సందేశం ఇలా ఉంది.

‘‘ప్రియమైన రైతులారా! మీకోసం మేం చాలా చేశాం. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు ఇవ్వడం వల్ల నిరంతరం మీరు అప్రమత్తంగా ఉండేలా చేశాం. విత్తనాలకోసం మిమ్మల్ని రోజుల తరబడి క్యూలో నిలబెట్టడం వల్ల మీ శారీరక దారుఢ్యాన్ని పెంచాం. పంటలొస్తే రేటు రాకుండా చూశాం. పంటలు లేనప్పుడు రేట్లు ఎక్కువ ఉండేలా చేశౠం. ఇలా రైతులను, కూలీలను వలసలు పంపి దేశంలోని అన్ని ప్రాంతాలనూ చూసే వీలు కల్పించాం. పల్లెల్లో పశు సంపద లేకుండా చేసి యంత్రాలకు మీరు దగ్గరయ్యేలా చేశాం. కష్టాలను మరిచిపోయేందుకు వీధికో బెల్టుషాపును పెట్టి మీకు చేరువ చేశాం. చైతన్యయావూతలు, పొలం బడులు నిర్వహించి, అధికారులు మాట్లాడేది మీకు అర్థం కాకుండా, మీరు మాట్లాడేది అధికారులకు అర్థం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాం. స్థూలంగా సేద్యమే లేకుండా చేశాం. వడ్డీలేని రుణాలిచ్చాం. ఆ రుణాలు తీసుకోవడానికి మీ తాతలు దిగొచ్చేలా చేశాం. నేల తల్లిని నమ్ముకుని దేశం కోసం తిండిగింజలు పండిస్తున్న మీ కుటుంబాలకు పురుగుల మందులను సబ్సిడీపై అందిస్తున్నాం. నలుగురికి అన్నం పెట్టాల్సిన మీతో పురుగుల మందును తినిపిస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం చేయాలి?!

సదా మీ బాగు కోరే
- మీ ముఖ్యమంత్రి



123ప్రియమైన పిచ్చోళ్లారా! సేద్యం దండగని ఎప్పుడో చెప్పాను. మీరు ఇప్పుడు నిజంగానే అనుభవిస్తున్నారు. ఎవడో పండిస్తే మనం తినాలికానీ, మనం పండిస్తే ఇంకోడు తినడమేంటి? మా తెలుగుదేశం పార్టీ పుణ్యాన (కంటు చార్జీలు పెంచడం వల్ల), కాంగ్రెస్ పుణ్యాన (కంటు కోతల వల్ల) బట్టలు ఆరేసుకోవడానికి మీకు కరెంటు తీగలు దొరికాయి. కానీ మీ ఒంటిపై బట్టలే లేకుండా పోయాయి. ఈసారి మాకు ఓటేస్తే రైతనే వాడినే లేకుండా చేస్తాం. కాంగ్రెస్ వాళ్లకాలంలో పురుగుల మందులు కావాలి. కానీ మేం కానీ ఖర్చు లేకుండా మిమ్మల్ని పైకి పంపిస్తాం.

సదా మీ క్షామం కోరే
- మీ మాజీ ముఖ్యమంత్రి



అందుకే ఇలాంటి దొంగ నాటకాల రాజకీయ నాయకులకు ఓట్లేసి గద్దెపూక్కనీయకుండా ండాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. తెలంగాణ కోసం కొట్లాడాలి. తెగించి పోరాడుదాం.. తెలంగాణ తెచ్చుకుందాం!

- చిట్టిమాల సతీష్,
బాచుప్పల తుర్కపల్లి, నల్గొండ

Other News
    Most Viewed galleries
    Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
    © 2011 Telangana Publications Pvt.Ltd
    News Photo Galleries Features
    Latest News
    Telangana News
    Seemandhra News
    National News
    International News
    Festivals gallery
    Actress gallery
    Cinema gallery
    Fashion gallery
    Political gallery
    Sports gallery
    Zindagi
    Turning Point
    Mee Features
    Life Style
    Sunday magazine