ఏ సంబంధం లేకున్నా.. కేవలం తాళి కట్టించుకున్నందుకే కష్టాలను పంచుకుంటుంది భార్యామణి. అలాంటి.. భార్యామణులందరికీ ‘అభివందనం’. మనతో రక్తసంబంధం లేకున్న కేవలం ప్రేమ బంధంతో అక్కున చేర్చుకునేదే అర్థాంగి. తన ఇంటి పేరును విడిచి భర్త ఇంటి పేరును మోసి పరువు, ప్రతిష్ఠలను కాపాడుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారే కానీ, భార్తే దీపం అనరు. తన ప్రేమనే నూనెగా చేసి, వాత్సల్యాన్ని వత్తిగా చేసి మనకు వెలుగునిస్తుంది భార్య. భర్త చనిపోతే ఆ జ్ఞాపకాలతోనే శేష జీవితాన్ని గడిపేస్తుంది. అదే మొగుడు.. ఏడాదిలోపే ఇంకోస్త్రీని పెళ్లాడుతున్నాడు. నిజంగా అర్థాంగి మగాడికి దీపం. కరెన్సీ కాగితాల కోసం అర్థాంగిని బలిచేయొద్దు. మనతో జన్మ, జన్మల బంధంతో ఏడడుగులు నడిచి, మూడు ముళ్లు వేయించుకొని పచ్చని సంసారంలో అర్థాంగి అయి మమతల కోవెలలో దేవత అవుతుంది. ఆ అర్థాంగిని మనం కంటి పాపలా చూసుకోవాలి. ఆ శ్రీమతి మనకు స్వర్ణయుగంను తెచ్చి మన ఇంట సిరుల పంటను పండిస్తుంది. అలాంటి మహిళామణులకు ఇదే హృదయపూర్వక వందనం.
- కె. శ్రీనివాస్, బెల్లంపల్లి