పని భారం అయితే?!

Mon,March 20, 2017 01:40 AM

works
ఎక్కువ బరువులెత్తడం, నైట్ డ్యూటీలు చేసే స్త్రీలలో సంతాన సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ అని హార్వర్డ్ యూనివర్సిటి చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

పెద్దపెద్ద బరువులు తరచుగా ఎత్తడం వల్ల సంతాన సాఫల్యత మీద ప్రభావం పడుతోంది. ఎక్కువగా బరువులు ఎత్తే పనులు చేసే మహిళల్లో 14.1 శాతం పరిణతిచెందిన అండాల విడుదల మీద ప్రభావం పడుతున్నట్టు తేలింది. అంతేకాదు ఎక్కువ శారీరక బరువు కలిగి ఉండడం, ఎక్కువగా నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే వారిలో కూడా అండం విడుదల మీద ప్రభావం పడుతున్నట్టు ఈ అధ్యయనం తెలియజేస్తోంది.

కాబట్టి పిల్లలను కనాలని అనుకుంటున్న మహిళలు వీలైనంత వరకు బరువైన పనులు చెయ్యడం, నైట్‌డ్యూటీలు చెయ్యడం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిదని ఈ అధ్యయనం జరిపిన నిపుణులు సూచిస్తున్నారు. సంతాన సాఫల్య సమస్యలు ఎదుర్కొంటున్న 500 వందల మంది మహిళలను అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాలను వారు వెల్లడించారు.

614
Tags

More News

మరిన్ని వార్తలు...