Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> School News
ఎపిపిఎస్‌సి స్టడీ మెటీరియల్ ఇండియన్ హిస్టరీ-15

historyప్రాచీన భారతదేశ చరిత్రలో మౌర్యుల అనంతరం వెలసిన గుప్తు సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో పరిపాలనా పరంగా నూతనశకానికి నాంది పలికింది. గుప్తుల కాలంలో ముఖ్యంగా సముద్ర గుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, స్కంధ గుప్తుని కాలంలో జరిగిన సంఘటనల నుంచి తరచుగా ప్రశ్నలు వస్తున్నాయి. గుప్తుల కాలం నాటి కళలు, సాహిత్యం నుంచి ప్రతిసారి ఒక ప్రశ్న వస్తుంది.

గుప్తుల అనంతర కాలంలో హర్షుని పాలన, హర్షుని విజయాలు, అదేవిధంగా చాళక్యుల కాలంలో రెండవ పులకేశి జరిపిన యుద్ధాలు, పల్లవులలో సింహవిష్ణువు నుంచి రెండో నందివర్మ వరకూ ఉన్న రాజుల కాలంలో జరిగిన యుద్ధాలు, పల్లవుల వాస్తు, శిల్పకళ, సాహిత్యాలు పరీక్ష కోణంలో ముఖ్యమైన అంశాలు. పల్లవుల వాస్తు కళకు ప్రతిబింబమైన ఏకశిలా ఆలయాలు, కైలాసనాథ ఆలయంపై ఎక్కువ ప్రశ్నలు రావడం జరిగింది.

ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి రాచరిక పరిపాలనతోపాటు వాస్తు, శిల్పకళ, సాహిత్యపరమైన అంశాలకు సంబంధించి పట్టికల రూపంలో సమాచారాన్ని తయారుచేసుకుని ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు.
1.భాగవత మతాన్ని అనుసరించిన మొదటి గ్రీకు చక్రవర్తి? ( )
1. అలెగ్జాండర్ 2. డొమింగ్‌ఫేస్
3. హెలియోడోరస్ 4. సెల్యుకస్ నికేటర్
2.నంద వంశ పాలకుడైన ఖారవేలుగు ‘కళింగ’ను ఆక్ర మించడాన్ని తెలిపే శాసనం? ( )
1. మస్కీ శాసనం 2. హథిగుంఫా శాసనం
3. జునాగఢ్ శాసనం 4. భబ్రూశాసనం
3.గ్రీకు రచనలలో శాండ్రోకొట్టస్‌గా వ్యవహరించబడిన భారతీయ రాజు? ( )
1. అశోకుడు 2. బింబిసారుడు
3. సముద్రగుప్తుడు 4. చంద్రగుప్తుడు
4.సల్లేఖనవ్రతం ద్వారా తనువు చాలించిన మౌర్యరాజు?
1. బింబిసారుడు 2. చంద్రగుప్తుడు ( ) 3. అశోకుడు 4. బింబిసారుడు
raja5.చైనా నుంచి రోమన్ సామ్రాజ్యానికి వెళ్లే సిల్క్‌మార్గం (Silk route)పై ఆధిపత్యం సాధించిన ఏకైక భారతీయ పాలకుడు? ( )
1. కనిష్కుడు
2. చంద్రగుప్తుమౌర్యుడు 3. సముద్రగుప్తుడు
4. విక్రమాధిత్యుడు-II
6.‘ఏకబ్రాహ్మణ’ అనే బిరుదును ధరించిన శాతవాహన రాజు? ( )
1. మొదటి పులోమావి 2. గౌతమీపుత్ర శాతకర్ణి
3. శ్రీముఖుడు 4. శ్రీశాతకర్ణి
7.మొట్ట మొదటిసారిగా వెండి నాణేలను ముద్రించిన గుప్తు పాలకుడు? ( )
1. సముద్రగుప్తుడు 2. చంద్రగుప్తుడు-I
3. చంద్రగుప్తుడు-II 4. స్కంధగుప్తుడు
8. ఉత్తర భారతాన్ని పాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి?
1. గౌడ శశాంకుడు 2. హర్షుడు ( )
3. పులకేశి-II 4. స్కంధగుప్తుడు
9. ‘ఐ హోళీ శాసనం’ను కృతి చేసిన ప్రముఖ కవి ‘రవికీర్తి’ ఏ రాజు ఆస్థాన కవి? ( )
1. రెండవ పులకేశి 2. శ్రీశాతకర్ణి
3. యజ్ఞశ్రీ శాతకర్ణి 4. హర్షుడు
10. హర్షుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ‘మహామోక్ష పరిషత్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రదేశం?
1. గయ 2. సారనాథ్ ( )
3. ప్రయాగ 4. నలంద
11. తంజావూర్‌లో బృహదీశ్వరాలయ నిర్మాత? ( )
1. రాజరాజు-I 2. ఒకటవ రాజేంద్రుడు
3. కుళోత్తుంగచోళుడు
4. మొదటి పరాంతకుడు
12. సంస్కృత భాషలో మొట్టమొదటి సుదీర్ఘ శాసనాన్ని జారీ చేసినది? ( )
1. కనిష్కుడు 2. మొదటి పరాంతకుడు
3. రుద్రధమనుడు 4. గౌతమీపుత్ర శాతకర్ణి
13.‘వాతాపికొండ’ బిరుదాంకితుడిగా, ‘మహామల్ల’గా ప్రసిద్ధి గాంచిన పల్లవరాజు? ( )
1. రాజసింహుడు 2. రెండో మహేంద్రవర్మ
3. మొదటి నరసింహవర్మ 4. రెండో నందివర్మ
14. ‘మత్తవిలాస ప్రహసనాన్ని’ రచించిన పల్లవరాజు? ( )
1. మొదటి నరసింహ వర్మ
2. మొదట మహేంద్రవర్మ
3. రెండో పులకేశి
4. రెండవ నరసింహవర్మ
15. ఏ పల్లవరాజు కాలంలో హూయాన్‌త్సాంగ్ కంచిని సందర్శించడం జరిగింది? ( )
1. మొదటి పులకేశి 2. రెండవ పులకేశి
3. మొదటి నరసింహవర్మ 4. స్కంధవర్మ
guptulu16.పర్షియన్ రాజైన ‘రెండో ఖస్రూ’ ఆ స్థానానికి రాయ బారిని పంపిన చాళుక్యరాజు? ( )
1. మొదటి పులకేశి 2. రెండవ పులకేశి
3. మొదటి కీర్తివర్మ 4. మొదటి విక్రమాదిత్యుడు
17. హూణులను ఎదుర్కొన్న గుప్తరాజు? ( )
1. స్కంధ గుప్తుడు
2.కుమార గుప్తుడు
3. సముద్ర గుప్తుడు 4.చంద్రగుప్తుడు
18. చంద్రగుప్తుని కుమార్తె అయిన ప్రభావతిని వివాహ మాడిన వాకటక రాజు? ( )
1. రుద్రసింహుడు 2. రుద్రసేనుడు
3. రుద్రధమనుడు 4. కాకుత్సవర్మ
19. పట్టాడకల్‌లోని ఆలయాలు ఏ రాజు వాస్తుశైలిని ప్రతిబింబిస్తున్నాయి? ( )
1. పల్లవులు 2. చాళుక్యులు
3. చోళులు 4. గుప్తులు
20. గుప్తుల పరిపాలనా కాలంలో కోశాధికారి? ( )
1. రజ్జుక 2. రణభండాగారిక
3. తాడయుక్తక 4. అగ్రహారిక
21. నెమలి వాహనుడైన కార్తికేయుడి బొమ్మతో కూడిన నాణేలను జారీ చేసిన గుప్త రాజు? ( )
1. కుమార గుప్తుడు-I 2. స్కంథ గుప్తుడు
3. సముద్ర గుప్తుడు 4. పురగుప్తుడు
22. సరిగా జతపర్చనిది ఏది? ( )
1. నిష్కర్షణ - బంగారు నాణేలు
2. శతమాన - వెండి నాణేలు
3. కాకిని - బంగారు, వెండి నాణేలు
4. కార్ధపణ - బంగారు, వెండి, రాగినాణేలు
23. సువర్ణభూమి లేదా సువర్ణద్వీపం అని ప్రాచీన కాలంలో ఏ ప్రాంతం యొక్క పేరు? ( )
1. ఇండోనేషియా దీవులు 2. మలయా ద్వీపకల్పం
3. సుమత్రా 4. బర్మా
charitra24. ‘శతసహస్ర సంహిత’ అనేది ఈ క్రింది వానిలో దేనికి గల మరోపేరు? ( )
1. మహాభారతం 2. రామాయణం
3. గృహ్యసూత్రాలు 4. ఉపనిషత్తులు
25. ఈ కింది వానిలో కషాణుల కాలం నాటి ప్రధాన మార్కెట్ ఏది? ( )
1. బ్రోచ్ 2. కోర్‌భాయ్
3. మచిలీపట్నం 4. బేగ్రామ్
26. పాణిని అష్టాధ్యాయి ఈ కింది వానిలో దేనికి సంబంధించి నది? ( )
1. తత్వం 2. న్యాయం
3. వైద్యం 4. వ్యాకరణం
27. గ్రామం మొత్తంపై విధించే పన్నును గుప్తుల కాలంలో ఏమని పిలిచేవారు? ( )
1. పిండక 2. భోగ
3. భాగ 4. కీర
28. శుంగ వంశ రాజ్యానికి రాజధాని ఈ కింది వానిలో ఏది? 1. కనోజ్ 2. పాటలీపుత్రం ( )
3. విదిశ 4. శాకంబరి
29. హాలుడు సింహళ రాకుమారైన లీలావతిని వివా హమాడినట్లు తెల్పుతున్న కావ్యం? ( )
1. గాథాసప్తశతి 2. లీలావతి కావ్యం
3. లీలావతి పరిణయం 4. హర్షచరితం
30. ‘దేవపుత్ర’, ‘సీజర్’ అనే బిరుదులను పొందిన కుషాణురాజు? ( )
1. కనిష్కుడు 2. కాడ్‌ఫైసిస్
3. శాండ్రోకొట్టస్ 4. పైవరెరూ కాదు
31. శాతవాహనుల కాలంలో ధాన్యం వ్యాపారులను ఏమని పిలిచేవారు? ( )
1యశేణులు 2.ధమనికులు 3.మచ్ఛికలు 4.పైవేవీకావు
32. శకుల అనంతరం భారతదేశంలో ప్రవేశించిన పార్షియన్ల మాతృదేశం ఏది? ( )
1.ఇరాక్ 2. ప్రస్తుత ఇరాన్
3పస్తుత నేపాల్ 4. ప్రస్తుత ఆఫ్ఘన్ ప్రాంతం
answers33. సంగం యుగంలో ధనిక భూస్వామ్యవర్గం ఎవరు?
1. ఉలవార్ 2. నాయక ( )
3. వెల్లాల 4. బ్రాహ్మణులు
34. గుప్తుల కాలంలో తూర్పు భారతదేశంలో అతి ముఖ్యమైన రేవు? ( )
1. ఒరపట్టా 2. సిబోర్
3. బ్రోచ్ 4. తామ్రలిప్తి

ప్రీవియస్ క్వశ్చన్స్
1.‘త్రిపుర మూర్త్య మహేశ్వర’ అనే బిరుదును పొందిన చాళుక్యరాజు? (గూప్-్ర1, 2010) (1)
1. గుణగ విజయాదిత్యుడు 2. కుబ్జవిష్ణువర్ధనుడు
3. రాజరాజ నరేంద్రుడు 4. రెండవ విజయాదిత్యుడు
2. ఆంధ్రదేశంలో ఎవరికాలంలో బంగారు నాణేలను ‘మాడా’ అని పిలిచేవారు? (గూప్-2, 2001) (2)
1. శాతవాహనులు 2. కాకతీయులు
3. విజయనగర పాలకులు 4. చాళక్యులు
3. మౌర్యుల తరువాత, ఏ వంశం రాజ్యానికి వచ్చినది? (గూప్-2, 2000) (1)
1. శుంగులు 2. నందులు
3. గుప్తులు 4. కుషాణులు
4.మహాభారతంలో ధృతరాష్ట్రుడి 100 మంది కుమారులతో పాటు, ఒక కుమార్తె కూడా ఉందని చరిత్ర చెబుతుంది. అయితే ఆమె పేరు ఏమిటి? (జెఎల్-2003) (2)
1. వైశాలి 2. దృశ్యల
3. రత్నావళి 4. దర్వెనీత
5. లింగాయతీ ఉద్యమ స్థాపకులెవరు? (ఎఇ-2009)
1. బసవరాజు 2. రామానుజ (1)
3. శంకరాచార్య 4. కంబన్

వ్యాసకర్త ః పోటీ పరీక్షల ట్రైనర్

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine