Home   |   Stories  |  Videos   |  Songs
 
Eection Page

ఆంధ్రా రాజ్యం గందరగోళం

నేతల తన్నులాట!
జనం తండ్లాట!!
అటు సీబీఐ దర్యాప్తు
ఇటు పార్టీల పరిశోధన
రెండున్నరేళ్లుగా స్తంభించిన పాలన

MasterMind465-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
- సీఎం మార్పిళ్లు, నేతల ఎంపికలు.. రాష్ట్రంతో ఇష్టారాజ్యంగా ఆటలు
- పీఠం కోసం జగన్, కేవీపీ ఎత్తులు.. చిత్తు చేసేందుకు కాంగ్రెస్ యత్నాలు
- చాతకాక చేతుపూత్తేసిన రోశయ్య.. సత్తా చూపుతానంటున్న కిరణ్
- సీబీఐ ఉచ్చులో చిక్కుకున్న జగన్.. బాబును టార్గెట్ చేసిన యువనేత
- మంత్రులను ఇరికించే యత్నాల్లో బాబు.. గోతులు తవ్వుకుంటున్న నేతలు
- బయటికి వస్తున్న అవినీతి బాగోతాలు.. రంగంలోకి సీబీఐ బృందాలు
- పక్కదారిపడుతున్న ప్రజా సమస్యలు.. పరిపాలనా వ్యవస్థలో నిస్తేజం


పరిణామాలకు మసిపూస్తున్న నేతలు
తెలంగాణ ఉద్యమంపై నిందలు
పాలన స్తంభనకు కారణమని ఆరోపణలు


రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా సాగుతున్న రాజకీయ జగన్నాటకం ఇది! అధికార పీఠం ఎవరి చేతుల్లో ఉండాలన్న ఏకైక అంశం కేంద్రకంగా జనాన్ని, జనాల ప్రయోజనాన్ని, వారి ఆకాంక్షలను పణంగా పెట్టి రాజకీయ నేతలు ఆడుతున్న క్రీడ ఇది! తండ్రి పోయాక తండ్రి ఆస్తి వారసత్వంగా వచ్చినట్లే రాజకీయ పీఠం కూడా వారసత్వంగా దక్కాలని పట్టుపట్టి.. తండ్రి శవం లేవక ముందే తనను ముఖ్యమంవూతిని చేయాలంటూ సంతకాల సేకరణ కార్యక్షికమాన్ని ప్రారంభించింది ఒకరు! ఆయన పేరు వైఎస్ జగన్మోహన్‌డ్డి! మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌డ్డికి తనయుడు! వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ఆయనకు ఆత్మగా చెలామణీ అయి.. సమాంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించి, అదే అర్హతగా వైఎస్ మరణానంతరం సీఎం పీఠంపై కన్నేసింది మరొకరు! ఆయన కేవీపీ రామచందర్‌రావు! వంపయితే వదిన మిట్టయితే మరదలన్నట్లు..

అయితే జగన్‌కు కాకపోతే ప్రాణమివూతుడి ఆత్మనైన తనకే ముఖ్యమంత్రి పీఠం దక్కాలని ఆకాక్షించిన వ్యక్తి! తమ దీవెనలతో రాష్ట్రంలో సీఎంగా ఎన్నికై తమనే సవాలు చేసే స్థాయిలో రాష్ట్రంలో ప్రత్యేక అధికార కేంద్రాన్ని వైఎస్ చెలాయించిన పరిస్థితిని జీర్ణించుకోలేక.. మింగలేక కక్కలేక అన్నట్లు మిగిలి.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార ‘హజంను’, ధిక్కరణను ఎదుర్కొనలేక ఇన్నినాళ్లూ నిద్ర నటించి.. ఇప్పుడు తనదైన ముద్ర వేయించుకునేందుకు తహతహలాడుతున్నది మరొకరు! ఆమె కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ! వైఎస్ మరణం అనంతరం అధిష్ఠానం మనిషిగా రాష్ట్ర సారథ్య బాధ్యతలు స్వీకరించినా.. ఒక వైపు జగన్‌ను, మరోవైపు రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను పరిష్కరించలేక తన చేతకానితనంతో మధ్యలోనే కాడి కిందపడేసిందొకరు! ఆయన కొణిజేటి రోశయ్య! అధిష్ఠానం నమ్మినబంటుగా రంగంలోకి వచ్చి.. రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తానంటూ సీఎం పీఠం ఎక్కినది ఇంకొకరు! మరెవరో కాదు.. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి!

ఈ నేతల రాజకీయ పరమావధులు.. ఈ నేతల రాజకీయ ఆకాంక్షల చుట్టూనే రాష్ట్ర రాజకీయం రెండున్నరేళ్లుగా గింగిరాలు తిరుగుతున్నది. ప్రజా సమస్యలను పక్కనపడేసింది. ఇప్పుడు కోర్టు మెట్లెక్కుతున్నది. రాజకీయ కక్షలు, ఎత్తులకు పై ఎత్తులు మొదలయ్యాయి. నేతలంతా ఒకరి వెనుక ఒకరు వీలైనంత లోతుగా గోతులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరి గుట్టును మరొకరు బయటకు లాగుతున్నారు. మీడియా కూడా టన్నుల కొద్దీ న్యూస్‌ప్రింట్‌ను వీటిచుట్టే ముద్రించేసింది. రీళ్ల కొద్దీ రాజకీయ సినిమాను చూపించేసింది. ఈ క్రమంలోనే తండ్రి హయాంలో జగన్ లక్షల రూపాయల పెట్టుబడులు అనతికాలంలోనే వేల కోట్లుగా రూపాంతరం చెందడం వెనుక మతలబులు ఏంటన్న ప్రశ్నలు ముందుకు వచ్చాయి! తనకు పంటికింద రాయిలా పరిణమించిన జగన్ రాజకీయ అంతు తేల్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్ అధిష్ఠానం.. పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ పోయింది! ఫలితం.. సీబీఐ కేసులో జగన్ ఇప్పుడు పీకల్లోతు కూరుకుపోయారు! సోదరసమానుడు గాలి జనార్దన్‌డ్డిలానే జగన్ అరెస్టు తథ్యమన్న పరిస్థితి నెలకొంది.

దీంతో జగన్ మాజీ సీఎం చంద్రబాబుపై పడ్డారు. ఆయన పరిపాలన సమయంలో అక్రమాలపై తన తల్లితో పిటిషన్ వేయించారు. ఆయనపైనా సీబీఐ విచారణ మొదలైంది. ఇప్పడు చంద్రబాబు కూడా వైఎస్ హయాంలో మంత్రులుగా ఉండి అక్రమాలకు పాల్పడినవారిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. దీంతో రేపోమాపో వీరిపైనా విచారణలు మొదలు కానున్నాయి! నేటి మంత్రులంతా దాదాపుగా వైఎస్ కేబినెట్‌లో పని చేసినవారే. దీంతో వారంతా కూడా ఇప్పుడు సీబీఐ సుడిగుండంలో చిక్కుకుని ఉన్నారు. సీబీఐ అధికారులు వంద మంది దర్యాప్తు చేస్తుంటే రాజకీయ పార్టీల పక్షాన వెయ్యి మంది సమాంతర దర్యాప్తు చేస్తున్నారు. మంత్రులకు ఎదురవుతున్న అవస్థలు.. ఇప్పటికే తమ సహచర ఐఏఎస్ అనుభవిస్తున్న చెరసాలలు చూసిన అధికారగణం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఫైళ్లపై సంతకాల విషయంలో జవాబుదారీతనంపై ఇప్పుడిప్పుడే వారిలో సృహ కలుగుతున్నది. వారూ చేతుపూత్తేస్తున్నారు. నాటి అక్రమాల్లో నిర్బంధంగానో అనివార్యంగానో పాలుపంచుకున్న అధికారుల చేతిలో చాలానే గుట్టు దాగి ఉంది. వీరంతా నోళ్లు విప్పితే పెద్ద పెద్ద పేర్లే బయటికి రావడం ఖాయంగా కనిపిస్తుండటంతో మంత్రులు, రాజకీయ నాయకులు భయవూభాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది.

వెరసి.. రెండున్నరేళ్లు గడిచిపోయాయి. రాష్ట్రంలో ఊడలు దిగిన ఒక ముఖ్యమంత్రి నుంచి, ఆయన వారసుడి నుంచి, ఆయన ఆత్మ నుంచి ఆధిపత్యాన్ని పునఃవూపతిష్టించుకోవడానికి ఈ రెండున్నరేళ్లూ గందరగోళంగా చేతికి వచ్చిన పావును కదిపిన ఫలితమే ఇంత రాజకీయం. చివరకు తెలుగు రాష్ట్రంలో ఢిల్లీ పత్తాలాట, ఆజాద్‌ల జాదూ మళ్లీ నడుస్తున్నది. ఒక రాజకీయ పార్టీ తన సంస్థాగత ఇబ్బందులను పరిష్కరించుకునే క్రమంలో మొత్తం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థనే ఈ కాలంలో ఫణంగా పెట్టింది. పరిపాలన సంగతి పక్కనపెడితే.. అంతర్గత సమస్యలను అధిగమించడంలోనే కాలం గడిచిపోయింది. ఇది జగమెరిగిన సత్యం! ఇది నిప్పులాంటి నిజం! కానీ.. ఇవే రాష్ట్రంలో పాలనను స్తంభింప చేశాయని మాత్రం ఈ నేతపూవరూ అంగీకరించరు! అసలు దీన్ని పాలనను స్తంభింపచేసే అంశంగా గుర్తించేందుకూ ఒప్పుకోరు! గుండె చెరువు చేస్తున్న రైతుల ఆత్మహత్యలు వీరెవ్వరికీ పట్టవు. తెలంగాణ కోసం జరిగే బలిదానాలు వీరి మనసును కరిగించవు. అధిక ధరలు, అక్రమాల సంగతి సరేసరి.. కానీ.. అందరూ వేలెత్తి చూపేది మాత్రం ఒకే ఒక్క అంశాన్ని.. అదే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని. ఒక ప్రాంతం తన అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటాన్ని! హవ్వ! ఎంత దుర్నీతి! ఎంత కాపట్యం! ఎంత దుర్మార్గం! ఒక నింద వెనుక రాజకీయ సామ్రాజ్యం మసకబార్చిన మంత్రాంగం కథాకమామిషు! ఇదీ.. దూద్ కా దూద్.. పానీ కా పానీ..!!

- రెండున్నరేళ్లుగా స్తంభించిన పాలన
KingM-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema- ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ ఆటలు
- పరస్పరం గోతులు తవ్వుతున్న నేతలు
- బయటికి వస్తున్న అవినీతి బాగోతాలు
- పక్కదారిపడుతున్న ప్రజా సమస్యలు
- పరిపాలనా వ్యవస్థలో నిస్తేజం
- పరిణామాలకు మసిబూస్తున్న నేతలు
- తెలంగాణ ఉద్యమంపై నిందలు


రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిన పాపాన్ని తలా కొంచెం పంచుకున్నదెవరు? మునుపెన్నడూ ఎరుగని రాజకీయ సంక్షోభాన్ని రాష్ట్రం ఎందుకు ఎదుర్కొంటున్నది? గందరగోళ పాలనకు కారకుపూవరు? సూత్రధారుపూవరు? పాత్రధారుపూవరు? పాలనలో నిస్తేజానికి రాజకీయ నాయకుల పుణ్యమెంత? ఉద్యమాలు చేసిన పాపమెంత? ఎదురులేని నేతగా చలామణీ అయిన వైఎస్ హఠాన్మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాలకు, జనానికి చేసిన కీడెంత? రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిక్షిశామిక వేత్తలు తమ ఫైల్ కదులుతుందా? లేదా? అన్న శంక పెట్టుకోవడం వెనుక దాగి ఉన్న అసలు మర్మమేంటి? సీబీఐ నిఘాలో దాదాపు 200 కంపెనీలు ఎందుకు పడ్డాయి? ఒక్కసారిగా సీబీఐ చుట్టు నేతలు, అధికారులు ఎందుకు పరివూభమిస్తున్నారు? అక్రమాల పుట్టలు ఎందుకు బద్దలవుతున్నాయి? ఈ కథాకమామిషు తెలుసుకోవాలంటే వైఎస్ ఏకఛవూతాధిపత్యం వహించిన ప్రభుత్వాల కాలానికి వెళ్లాలి! ఎందుకంటే.. ప్రస్తుత సంక్షోభ మూలాలకు పునాది పడింది అక్కడే మరి!

(టీ న్యూస్, హైదరాబాద్)అది 2004 మే! పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ దాహార్తి తీరిన సమయం! చంద్రబాబు దౌర్భాగ్యమో.. వైఎస్ అదృష్ణమో.. కరువు పోయింది. జోరుగా వర్షాలు పడ్డాయి. వ్యవసాయం మళ్లీ పుంజుకుంది. జలయజ్ఞం మొదలైంది. లక్షల కోట్లతో ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. తీవ్ర అవినీతి ఆరోపణలూ వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ రాత్రికి రాత్రే అంచనా వ్యయాలు పెరిగిపోయాయి. రింగురోడ్లు డిస్కోడాన్స్‌లా మెలికలు తిరిగాయి. హైదరాబాద్ భూముల్లో బౌల్డర్ హిల్స్ మొలిచాయి. కోకాపేట్‌లో భూములు కోట్లయ్యాయి. రాజకీయ ఖాతాలు ధనంతో బరు సంపద చలనం పరుగులు పెట్టింది. ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి. కాంగ్రెస్ రెండోసారి గెలిచింది. రాష్ట్రంలో తానే అధినాయకుడినని వైఎస్ ప్రకటించుకుంటున్న వేళ.. ఢిల్లీ అధిష్ఠానానికి సంబంధం లేకుండానే తానే కింగ్ అనుకున్నవేళ.. అనుకోని ఘటన! 2004 సెప్టెంబర్ 2న రాజశేఖర్‌డ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇక్కడే రాష్ట్రంలో దౌర్భాగ్య రాజకీయాలకు పునాది పడింది. అధికార పీఠం కోసం పాకులాటతో ఆంధ్రా రాజ్యంలో గందరగోళానికి తెరలేచింది.

జగన్ పాకులాట
JVP05-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవైఎస్ తొలి ప్రభుత్వంలో పెద్దగా కనిపించని ఆయన కొడుకు జగన్మోహన్‌డ్డి.. 2009 ఎన్నికలకు ముందు రాజకీయాల్లో వేలు పెట్టారు. తన వ్యాపారాలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించారు. పత్రిక, వార్తా చానల్ కూడా పెట్టారు. 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. తండ్రి మరణానంతరం తననే సీఎం చేస్తారని ఆశించారు. అధిష్ఠానం మనసులో ఏముందో తెలుసుకోకుండానే, ఒకవైపు తన తండ్రి శవం ఉండగానే తనను సీఎం చేయాలని కోరుతూ సంతకాలు సేకరించారు. పీఆర్పీ వంటి పార్టీల మద్దతూ కోరారు. జగన్‌కంటూ ఒక వర్గం అప్పుడే మొదలైంది. దివంగత వైఎస్ ‘ఆత్మ’ కూడా ఇందుకు మద్దతుగా నిలిచింది. కానీ.. అధిష్ఠానం అప్పటికి పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న రోశయ్యకే పగ్గాలిచ్చింది. అయినా జగన్.. ఎప్పటికైనా తానే సీఎం అని ఊహించుకున్నారు. ఇక్కడే ‘ఆత్మ’ మరో అంచనా వేసింది. జగన్‌కు కాకపోతే తనకైనా పదవి దక్కుతుందని కేవీపీ లెక్కలేశారు.

అనుభవశూన్యత, రాజకీయాల్లో పరిపక్వతలేమి, పిన్న వయసు తదితర కారణాలతో జగన్ అభ్యర్ధ్థిత్వాన్ని హైకమాండ్ అంగీకరించదని భావించిన కేవీపీ పరోక్షంగా తన అదృష్టం పరీక్షించుకున్నారు. అధిష్ఠానం వేరే ఆలోచన చేసింది. ఊడలు దిగిన నేతగా, అధిష్ఠానాన్నే ప్రభావితం చేసిన వైఎస్ స్థానంలో మళ్లీ అటువంటి వ్యవస్థే వేళ్లూనుకుంటే జరిగే అనర్థాలను పసిగట్టింది. వైఎస్ జమానా అనుభవంతో అధిష్ఠానం బేరీజు వేసుకుని అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని నిర్ణయించుకుంది. దీంతో జగన్‌ను దూరం పెట్టింది. కేవీపీ ఆశలపైనా నీళ్లుచల్లింది. రోశయ్యను సీఎం చేసింది.అప్పటికే ఓదార్పు పేరుతో జైత్రయావూతల స్థాయిలో పర్యటనలు చేస్తున్నజగన్.. సానుభూతి సంపాదించుకునే పనిలోపడ్డారు. జగన్‌ను కట్టడిచేసేందుకు అధిష్ఠానం రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ.. రోశయ్య అందుకు సహకారం అందించలేక పోయారు. దీంతో సీఎం మార్పిడి అధిష్ఠానానికి అనివార్యమైంది. అనూహ్యంగా కిరణ్‌కుమార్‌డ్డి సీఎం రేసులో అగ్రభాగాన నిలిచారు. పార్టీని జగన్ వీడారు.

ఫలించని కేవీపీ ఎత్తుగడ
వైఎస్ మరణానంతరం సీఎం సీటు కోసం కేవీపీ తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే సీఎం సీటును జగన్ కోరుకుంటున్నప్పటికీ.. ఆయన రాజకీయ అనుభవం అప్పటికి కేవలం నాలుగు నెలలే. రాజకీయాల్లో పరిపక్వత లేదు. దీనికితోడు చిన్న వయసుకావడంతో జగన్ ఆకాంక్షను హైకమాండ్ ఒప్పుకునే ప్రసక్తి ఉండదని కేవీపీ నిర్థారణకు వచ్చారు. పైగా తాను కాకుంటే రాష్ట్ర పార్టీని సమర్థవంతంగా నడిపే నాయకుడు ఉండడని, అందరినీ కలుపుకొని పోయే స్థాయి, పలుకుబడి తనకొక్కడికే ఉందని కేవీపీ తన ప్రయత్నాలు తాను చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆనాడు జగన్‌కు అనుకూల ముఠాను తయారుచేశారనే అభివూపాయం ఉంది.

శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీ టికెట్లు ఇవ్వడంలో వైఎస్‌కు చేదోడు వాదోడుగా ఉండి కీలక పాత్ర వహించిన కేవీపీకి సహజంగానే అందరితో సన్నిహిత సంబంధాలు పెరిగాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిలతో, ఢిల్లీ పెద్దలతో అనుబంధాన్ని పెంచుకున్నారు. వైఎస్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో కేవీపీ కూడా బలీయశక్తిగా ఎదిగారు. సచివాలయంలో సీ బ్లాక్‌లో వైఎస్ తీసుకునే నిర్ణయాలు డీ బ్లాక్‌లో కూర్చున్న కేవీపీకి ముందు తెలిసే జరిగేవి. దేవుడి వరం కోసం పూజారిని ప్రసన్నం చేసుకోవాలనే నానుడి ఎలా ఉన్నప్పటికీ డీ బ్లాక్‌లో కేవీపీని కలిస్తే తప్ప ఏ పనీ జరగదనే విమర్శలొచ్చాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజావూపతినిధులు, పారిక్షిశామికవేత్తలు, ఆయా వర్గాల ప్రముఖులు, చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఏ చిన్న పని కావాలన్నా కేవీపీనే ముందు ఆశ్రయించేవారు. అలా కేవీపీకి ఏ దశలోనూ ఎదురు లేకుండా పోయింది.

చివరకు సాధారణ ఉద్యోగులు మొదలు.. సర్వీసు కేడర్ దాకా బదిలీలు, నియామకాల్లో ఆయన మాట చెల్లుబాటయ్యేది. నీటి పారుదల ప్రాజెక్టుల విషయం కావచ్చు, టెండర్లపరిశీలన, ఖరారు కావచ్చు, గనుల లీజులు కావచ్చు, కీలక ఆంశాలలో కేవీపీతో అధికారులు, సంబంధిత మంత్రులు చర్చించిన తరువాతే ఆ వివరాలు సీఎంకు చేరేవి. అక్కడ డీల్ కుదిరిన తరువాతనే కేబినెట్ ఆమోదముద్ర పడేదన్నది నాటి ప్రభుత్వ వ్యవహార శైలిగా ప్రచారం జరిగింది. మొత్తంగా సమాంతర ప్రభుత్వానికి కేంద్ర బిందువుగా కేవీపీ కార్యాలయం ఉండేది. ఈ పరిస్థితి అంతా అధిష్ఠానానికి తెలిసినందున వైఎస్ మరణం తర్వాత తనకే సీఎం పీఠం ఇస్తారని కేవీపీ భావించారు. అధిష్ఠానం కూడా ఈ పరిణామాలు తనకు తెలుసు కాబట్టే కేవీపీని సీఎం పీఠానికి దూరంగా ఉంచింది. వైఎస్ హయాంలో పార్టీ పరంగా కాంగ్రెస్ బలహీన పడటం, వ్యక్తుల ప్రాధాన్యం పెరగడం వంటి పరిణామాలను జాతీయ నాయకులు అప్పటికే గుర్తించారు. అందుకే అలాంటి పరిస్థితినే మళ్లీ తలకెత్తుకునేందుకు అధిష్ఠానం విముఖత వ్యక్తం చేసింది.

రోశయ్య ఆగమనం, నిష్ర్కమణం
సమయానుసారం

వైఎస్ మరణానంతరం తక్షణమే అయినా.. ఆచితూచి తీసుకున్న నిర్ణయం మేరకే రోశయ్యను పీఠం ఎక్కించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఆయన తన సమర్థతను ప్రదర్శించుకోలేక పోయారు. జగన్ వర్గాన్ని కట్టడి చేయలేక పోయారు. అధిష్ఠానం ఎంతగా వెన్నుదన్నులిచ్చినా తెగువ చూపలేక పోయారు. తనకంటూ ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకునే సాహసం కూడా చేయలేక పోయారు. విచిత్రం ఏమిటంటే.. అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన పలు టీడీపీ అనుకూల పత్రికలు రోశయ్య ప్రభుత్వానికి పూర్తి సానుకూలతను వ్యక్తం చేశాయి. అయినా రోశయ్య కాడి కిందపడేశారు. అనారోగ్యం, వయసు పైబడిన కారణాలు చూపుతూ చేతుపూత్తేశారు. ఇదే సమయంలో రోశయ్య కూడా కేవీపీనే నమ్ముకున్నారు. రోశయ్య హయాంలో కేవీపీకి మళ్లీ పెరుగుతున్న ప్రాధాన్యం, వీరిద్దరూ కలిసిపోయిన సంకేతాలతో అధిష్ఠానం అప్రమత్తమైంది. కేవీపీ మళ్ళీ బలపడుతుండడం, జగన్ వర్గం తాకిడి ఎక్కువవడం, రెడ్డి సామాజిక వర్గం అంతా జగన్‌తో జతకడతారని అప్పట్లో ప్రచారం బాగా జరగడంతో రోశయ్య వల్ల రాష్ట్రంలో పార్టీ బతకదని భావించిన హైకమాండ్ సమయం చూసి ఆయన్ని మార్చింది.

గుణపాఠం నేర్చుకున్న అధిష్ఠానం
వైఎస్ జమానాతో గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. పార్టీలో వ్యక్తుల ప్రాబల్యం పెరగకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా వైఎస్‌కు దీర్ఘకాలం అవకాశం ఇచ్చి, ఆ తరువాత 2004లో సీఎం పదవి కూడా కట్టబెట్టడంతో ఏర్పడిన ప్రతిబంధకాలను ఢిల్లీ పెద్దలు వైఎస్ మరణం తర్వాత తప్ప గుర్తించలేక పోయారు. వైఎస్ హయాంలో ఆయనను కట్టడి చేసే పరిస్థితి అధిష్ఠానానికి లేకపోయింది. దీంతో మింగలేక కక్కలేక అన్నట్లుగా వైఎస్‌ను మార్చలేక.. పూర్తిగా ఆయనపైనే ఆధారపడింది. 2009ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి మార్చివేసుకుని వైఎస్ అంతా తానై వ్యవహరించారు. తాను కోరుకున్నవారికి టికెట్లు ఇప్పించుకున్నారు. తాను చెప్పినట్లు వింటేనే రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ గెలుస్తుందని హస్తిన పెద్దలకు హెచ్చరికలు చేశారు. తన వాదనలకు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోక తప్పని పరిస్థితి కల్పించారు. 2009 ఎన్నికలప్పుడే తానే కాబోయే సీఎంనని ప్రకటించుకున్నారు. అధిష్ఠానం వైఎస్‌కు ఇస్తున్న ప్రాధాన్యంపై లోలోన అసంతృప్తి రగులుతున్నప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరూ కనీసం ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితులన్నింటినీ తనకు అనుకూలంగా మార్చుకున్న వైఎస్.. రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని శక్తిగా చలామణి అయి, తనకు ప్రత్యామ్నాయమే లేదని గర్వంగా నిలబడ్డారు.

ఇతర రాష్ట్రాలకు భిన్నంగా, కాంగ్రెస్ సహజ పరిణామాలకు విరుద్ధంగా ఏపీలో జరుగుతున్న ఏక నాయకత్వ పాలనను అరికట్టలేక ఏళ్ళ తరబడి పార్టీ అధిష్ఠానం మౌన ప్రేక్షక పాత్ర వహించింది. అయితే వైఎస్ మరణం తర్వాత ఏపీ వ్యవహారాలను గుణపా తీసుకుని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వైఖరిని ప్రోత్సహించరాదని, ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, నాడు ఇందిర అమలు జరిపిన పార్టీ వ్యవహారాలనే కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే పార్టీకి నష్టమైనప్పటికీ అటు జగన్‌ను, ఇటు కేవీపీని పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. తొలుత రోశయ్యతో ప్రయోగం విఫలం కావడంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రోశయ్యను తప్పించి జగన్ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు రాయలసీమకే చెందిన కిరణ్‌కుమార్‌డ్డిని సీఎం చేశారు.

నమ్మినబంటుగా పీఠంపైకి కిరణ్
సీఎం మార్పిడి వ్యవహారం అకస్మాత్తుగా జరిగిపోయింది. హస్తినలో అప్పటికే రాయబారాలు జరిపిన కిరణ్.. అసెంబ్లీ స్పీకర్‌గా తాను అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తినని, అవకాశం ఇస్తే జగన్‌ను కట్టడి చేస్తానని, పార్టీకి ‘పూర్వవైభవం’ తెస్తానని హామీ ఇచ్చారు. ఇందుకు ఏడాది సమయం కోరారు. సీఎం పీఠం దక్కించుకున్నారు. కేంద్ర హోం మంత్రి పీ చిదంబరం, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మురాదాబాద్ ఎంపీ అజహరుద్దీన్ కృషి కూడా కిరణ్‌కు సహకరించిందని వార్తలు వచ్చాయి.

చెప్పినట్లే సీఎంగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీకి ప్రత్యర్థులుగా మారిన జగన్, కేవీపీలను కట్టడి చేసే ప్రయత్నాలను కిరణ్ మొదలుపెట్టారు. శాఖల కేటాయింపులోనే అది కనిపించింది. జగన్ అనుకూలురు, లేదా కేవీపీ వర్గంగా చలామణీ అయినవారికి ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారు. అనేక సార్లు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ శాఖలను మార్చలేదు. పైగా ఒక్కొక్కరిని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు తన మార్కు పాలన మొదలు పెట్టారు. రెండు రూపాయల కిలోబియ్యం పథకం వైఎస్‌దిగా ప్రాచుర్యంలో ఉండగా, దాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీసి రూపాయికే కిలో బియ్యం అన్నారు. రాజీవ్ యువ కిరణాలు పేరుతో 15 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. జనవరి నుంచి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా విమర్శలకు గురికావడంతో ఈ కార్యక్షికమానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తూ, నిధుల కేటాయింపులపై కోత విధిస్తూ జరిగిన పనులకే బిల్లులు చెల్లిస్తున్నారు. సంక్షేమ పథకాలు వ్యక్తుల పుణ్యంకాదని, పార్టీ పుణ్యమేనని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

మళ్ళీ ఇందిర సూత్రం
వైఎస్ పాలన కాలం అనుభవాలతో కాంగ్రెస్ మళ్లీ ఇందిర సూత్రాన్ని అమల్లోకి తెస్తోంది. ఒకవైపు కిరణ్‌ను సీఎంగా కొనసాగిస్తూనే సమాంతర నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నదని పార్టీ వర్గాలంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డీ శ్రీనివాస్‌లకు గుర్తింపునివ్వడం ఇందులో భాగమేనని అంటున్నారు. సీఎంగా కిరణ్ ఎక్కడ దెబ్బతింటే అక్కడ ప్రయోజనం పొందడానికి పీసీసీ చీఫ్ బొత్స పావులు కదుపుతున్నారు. తాను అందరికంటే సమర్ధుడినని, కాపు వర్గంపై తన ఆధిపత్యం ఉందని, చిరంజీవి కూడా తనకే మద్దతు ఇస్తారని బొత్స చెప్పుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తనను గుర్తించి, ఆదరించే వాళ్ళు భారీగా ఉన్నారని, భవిష్యత్తులో తానే పార్టీకి దిక్సూచీనని బొత్స ఎప్పటికప్పుడు హైకమాండ్ వద్ద తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయం చరమాంకానికి చేరుకున్నదని భావిస్తున్న దశలో డీఎస్ దశ తిరిగింది. గట్టినేత ఉండాలనే ఉద్దేశంతోనే అధిష్ఠానం డీఎస్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి, మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని అంటున్నారు. ఒకవేళ కిరణ్‌ను రానున్న రోజుల్లో తప్పిస్తే డీఎస్‌కు అవకాశం కల్పించాలనేది హైకమాండ్ వ్యూహంలో భాగమని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న ఈ దశలో అదే ప్రాంతానికి చెందిన, బీసీ వర్గ నేత డీఎస్‌ను సీఎంగా చేయాలనే ఆలోచనతో హైకమాండ్ ఉండవచ్చని కూడా పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఇదంతా ఇందిరాగాంధీ ఫార్ములా అమల్లో భాగమేనని అంటున్నారు.


తెలంగాణ ఉద్యమంపై నిస్సిగ్గుగా నిందలు
ఒకరిని బొందబె మరొకరి యత్నాలు.. ఒక నాయకుడిని ముంచేందుకు మరో నాయకుడు తవ్వే గోతులు! అవినీతి కీలకాంశమై ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు! ఇంతటి రాజకీయ సంక్షోభం మధ్య రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలో దాదాపు 200 కంపెనీలు సీబీఐ స్కానర్ కింద ఉన్నాయట! కొత్త సంస్థలు ప్రారంభించుకోవాలనుకున్న కంపెనీలు బ్యాంకు రుణాల కోసం వెళితే సీబీఐ నిఘాలో ఉన్న నిజం తెలిసి నిర్ఘాంతపోతున్నాయి. వెరసి ఒకవైపు కొత్త కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు ఉత్సాహం చూపించడం లేదు. మరోవైపు ఇంతటి పాలనా నిస్తేజంలో తమ ఫైళ్లు కదులుతాయో లేదో తెలియక అనేక కంపెనీలు రాష్ట్రంనుంచి ఉడాయిస్తున్నాయి.

ఇన్ని పరిణామాలకు కారణమైంది కాంగ్రెస్. రాష్ట్రంలో తన అధికార సౌధాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. నాటి పాలకులు తమ పాలనలో చెలరేగి చేసిన ‘మేళ్లు’ ఇప్పుడు రాష్ట్రానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు వ్యవసాయం సంక్షోభంలో చిక్కి రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, తెలంగాణరాష్ట్రం కోసం బలిదానాలు జరుగుతుంటే, అధిక ధరలు, అక్రమాలతో జనం విసిగిపోతుంటే..సెజ్‌ల పేరుతోనో, థర్మల్ విద్యుత్ కేంద్రాల పేరుతోనో, ఎమ్మార్ భవంతులతోనో జనం భూమి కోల్పోయి ఆకలితో మండుతుంటే, నీరు లేక పంటలు ఎండుతుంటే, శాంతి భద్రతలు మృగ్యమై కత్తులు కుత్తుకలను ఉత్తరిస్తుంటే.. ఏవీ పట్టించుకోకుండా తమ రాజకీయ ప్రయోజనాలను పదికాలాలపాటు కాపాడుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న పాలకులు.. ఒకర్ని మరొకరు మింగడానికి, సీబీఐ తన దర్యాప్తులో వంద మందిని దించితే రాజకీయ పార్టీలు ఒకరి లొసుగులు మరొకరు తవ్వడానికి వెయ్యి మందిని దించి కష్టపడుతున్నారు. అంతిమంగా రాష్ట్ర అభివృద్ధికి కలుగుతున్న ఆటంకాలు, అవరోధాలకు ఒక్క తెలంగాణరాష్ట్ర డిమాండ్‌నే కారణంగా చూపుతున్నారు. ఒక ఆత్మగౌరవ పోరాటంపై విషం గక్కుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలపై నిస్సిగ్గుగా నిందలేస్తున్నారు!

తెలంగాణ ఉద్యమంపై నిస్సిగ్గుగా నిందలు
ఒకరిని బొందబె మరొకరి యత్నాలు.. ఒక నాయకుడిని ముంచేందుకు మరో నాయకుడు తవ్వే గోతులు! అవినీతి కీలకాంశమై ప్రత్యర్థులను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు! ఇంతటి రాజకీయ సంక్షోభం మధ్య రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలో దాదాపు 200 కంపెనీలు సీబీఐ స్కానర్ కింద ఉన్నాయట! కొత్త సంస్థలు ప్రారంభించుకోవాలనుకున్న కంపెనీలు బ్యాంకు రుణాల కోసం వెళితే సీబీఐ నిఘాలో ఉన్న నిజం తెలిసి నిర్ఘాంతపోతున్నాయి. వెరసి ఒకవైపు కొత్త కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు ఉత్సాహం చూపించడం లేదు. మరోవైపు ఇంతటి పాలనా నిస్తేజంలో తమ ఫైళ్లు కదులుతాయో లేదో తెలియక అనేక కంపెనీలు రాష్ట్రంనుంచి ఉడాయిస్తున్నాయి. ఇన్ని పరిణామాలకు కారణమైంది కాంగ్రెస్. రాష్ట్రంలో తన అధికార సౌధాన్ని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. నాటి పాలకులు తమ పాలనలో చెలరేగి చేసిన ‘మేళ్లు’ ఇప్పుడు రాష్ట్రానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

ఓవైపు వ్యవసాయం సంక్షోభంలో చిక్కి రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, తెలంగాణరాష్ట్రం కోసం బలిదానాలు జరుగుతుంటే, అధిక ధరలు, అక్రమాలతో జనం విసిగిపోతుంటే..సెజ్‌ల పేరుతోనో, థర్మల్ విద్యుత్ కేంద్రాల పేరుతోనో, ఎమ్మార్ భవంతులతోనో జనం భూమి కోల్పోయి ఆకలితో మండుతుంటే, నీరు లేక పంటలు ఎండుతుంటే, శాంతి భద్రతలు మృగ్యమై కత్తులు కుత్తుకలను ఉత్తరిస్తుంటే.. ఏవీ పట్టించుకోకుండా తమ రాజకీయ ప్రయోజనాలను పదికాలాలపాటు కాపాడుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న పాలకులు.. ఒకర్ని మరొకరు మింగడానికి, సీబీఐ తన దర్యాప్తులో వంద మందిని దించితే రాజకీయ పార్టీలు ఒకరి లొసుగులు మరొకరు తవ్వడానికి వెయ్యి మందిని దించి కష్టపడుతున్నారు. అంతిమంగా రాష్ట్ర అభివృద్ధికి కలుగుతున్న ఆటంకాలు, అవరోధాలకు ఒక్క తెలంగాణరాష్ట్ర డిమాండ్‌నే కారణంగా చూపుతున్నారు. ఒక ఆత్మగౌరవ పోరాటంపై విషం గక్కుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలపై నిస్సిగ్గుగా నిందలేస్తున్నారు!

సీబీఐ చుట్టూ రాజకీయాలు
CBI102-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకారణాలేమైనా అవినీతి రొచ్చును కడిగేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. అది చంద్రబాబు హయాం అయినా.. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలైనా.. దశాబ్దం పాటు అవినీతి ఏరులైపారింది. వీటికి పతాకసన్నివేశమా అన్నట్లు సీబీఐ కొరడా ఝళిపించింది. జగన్‌కుపచ్చి వ్యతిరేకిగా ముద్రపడిన మంత్రి డీఎల్ రవీంవూదాడ్డి ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో జరిగిన అక్రమాలపై తొలుత నోరు విప్పారు. ఆ తర్వాత శంకర్‌రావు వంతు. జగన్ తన తండ్రి హయాంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాస్తులు సంపాదించుకున్నారంటూ ఆ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలను జత చేసి హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటోగా తీసుకున్న హైకోర్టు సంచలన రీతిలో జగన్‌పై విచారణకు సీబీఐని ఆదేశించింది. జగన్‌పై విచారణ కాస్తా.. వైఎస్ హయాంలో అక్రమాలను తవ్వితీసే ప్రక్రియగా రూపాంతరం చెందుతున్నది. గాలికి కట్టబెట్టిన గనుల లీజులు కావచ్చు.. ఎమ్మార్ అవకతవకలు కావచ్చు.. జగన్ అక్రమాస్తుల వెనుక మేళ్లు పొందిన కంపెనీల గుట్టు కావచ్చు.. మొత్తం మీద వైఎస్ హయాంలో జరిగిన బీభత్సాన్ని కడిగిపారేసేందుకు సీబీఐ సమాయత్తమైంది.

ఈ క్రమంలోనే గాలి జనార్దన్‌డ్డి, ఓఎంసీ డైరెక్టర్ శ్రీనివాసడ్డి అరెస్టయ్యారు. వారికి ప్రయోజనాలు చేకూర్చారన్న ఆరోపణలపై గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్‌ను, తాజాగా గనుల శాఖ మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మిని కటకటాల వెనక్కు పంపింది. మరోవైపు ఎమ్మార్ అవకతవకలపై సీబీఐ మరికొందరు రాజకీయ నేతలు, అధికారులను ప్రశ్నించింది. ఈ కేసుల్లో తెర వెనుక ఉన్న తిమింగలాలను బయటికి తెచ్చే పనిలోఉంది. ఈ విచారణతో వైఎస్ హయాంలో అక్రమాలు, అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తనపై సీబీఐ విచారణకు ప్రతిగా మాజీ సీఎం చంద్రబాబును జగన్ టార్గెట్ చేశారు. తన తల్లి విజయమ్మతో చంద్రబాబు ఆస్తులపై పిటిషన్ వేయించారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. చంద్రబాబు, మరికొందరిపై ప్రాథమిక విచారణకు సీబీఐని ఆదేశించింది. ఇదిక్కడితో ఆగేట్టులేదు. చంద్రబాబు కూడా వైఎస్ హయాంలో పని చేసిన డజనుకుపైగా మంత్రుల అక్రమాలపై కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో మంత్రులు కూడా సీబీఐ సుడిగుండంలోకి రాక తప్పని పరిస్థితి నెలకొంది.

వైఎస్ ‘ఆత్మ’ తెరమరుగు
2003లో వైఎస్ రాజశేఖరడ్డి పాదయాత్ర చేసినప్పట్నుంచి ఆయననే అంటిపెట్టుకుని ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంవూదరావు ప్రస్తుతం పాలనా వ్యవహారాల్లో తెరమరుగైనట్టే. వైఎస్ ముఖ్యమంవూతిగా ఉన్న సమయం(2004-09)లో షాడో సీఎంగా పేరు తెచ్చుకున్న కేవీపీ అప్పట్లో అనేక ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగలిగారు. ‘నేను శరీరానై్నతే..కేవీపీ నా ఆత్మ’ అని వైఎస్సార్ స్వయంగా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం వారిద్దరి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది. అందుకే 2004లో ప్రభుత్వం ఏర్పడగానే కేవీపీని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారు. 2008లో ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా పదవి కట్టబెట్టారు. అంతేకాదు ఆయన మీద ప్రేమతో వైఎస్ 2008 లో రాజ్యసభకు సభ్యుడిగా పార్లమెంట్‌కు పంపారు. జలయజ్ఞం టెండర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ట్రాన్స్‌ఫర్లు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆకర్షించడం వంటి కీలక నిర్ణయాల్లో కేవీపీ చాలా కీలక పాత్ర పోషించి రాజ్యాంగేతర శక్తిగా అవతరించారు.

2009లో మరోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ సర్కారు ఆయనను ప్రజాభవూదతా సలహా కమిటీకి చైర్మన్‌గా నియమించి, హోంమంత్రి అధికారాలను నామమావూతపు స్థాయికి దిగజార్చింది. దీంతో హోం శాఖలో కూడా కేవీపీ అన్నీ తానై వ్యవహరించారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ కాలంలో ఓ బలమైన శక్తిగా ఎదిగిన కేవీపీ ప్రస్థానానికి వైఎస్ మరణంతో బ్రేక్ పడింది. జగన్‌ను సీఎం చేసేందుకు ఆయన సోనియాతో, ఇతర పెద్దలతో గంటల కొద్దీ, రోజుల కొద్దీ చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాతి పరిణామాల్లో ఓదార్పు యాత్రలకు పూర్తిస్థాయిలో మద్దతివ్వకపోవడం, వైఎస్సార్ పార్టీ స్థాపించినప్పటికీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం జగన్, కేవీపీల మధ్య విభేదాలకు తావిచ్చాయి.
మరోవైపు అప్పటిదాకా తనను ఎంతో కొంత ఆదరించిన రోశయ్య రాజీనామా చేయడం, కిరణ్‌కుమార్‌డ్డి సీఎం కావడంతో ఆయనకు మునుపటి ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే కేవీపీ 2010 నవంబర్ 28న ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. అటు సీఎం లాబీలో, ఇటు గాంధీభవన్‌లో ఆరేళ్లపాటు ఎదురేలేని హోదా అనుభవించిన ఆయన ప్రస్తుతం క్రియాశీలక వ్యవహారాల నుంచి తెరమరుగయ్యారు.

అధికారుల్లో భయాందోళనలు
srilaxmi-(1)05-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaవైఎస్ హయాంలో జరిగిన వ్యవహారాలపై సీబీఐ దృష్టి సారిస్తున్న నేపథ్యంలో అధికారులు తీవ్రంగా కలవరపడుతున్నారు. వైఎస్ హయాం లో చెప్పిన చోట సంతకం పెట్టడం మినహా తమకు మరోమార్గం లేకపోయిందని పలువురు అధికారులు చెబుతున్నారు. శ్రీలక్ష్మి వంటి అధికారులు సైతం సీబీఐ ముందే ఈ విషయాన్ని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జీవోలపై మంత్రుల సంతకాలు ఉండాల్సిందేనన్న వాదనను ఐఏఎస్ అధికారులు మందుకు తెచ్చారు. మంత్రుల జవాబుదారీతనం ఉండేలా చూసేందుకు, తమపై పూర్తి బాధ్యత పడకుండా తప్పించుకునేందుకు అధికారులు ఈ ప్రతిపాదనలు చేస్తున్నారు.

Other News
Results
Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine