ముగిసిన జాతీయ అటవీ క్రీడోత్సవాలు

Thu,January 12, 2017 01:50 AM

SATS
హైదరాబాద్, నమస్తేతెలంగాణ: గచ్చిబౌలీ స్టేడియంలో ఈనెల 7న మొదలైన అఖిల భారత అటవీ క్రీడోత్సవాలు బుధవారం ముగిశాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ ధవే ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రతీ యేటా నేషనల్ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు ముఖ్యమంత్రి కేసీఆర్ 5కోట్ల రూపాయలను విడుదల చేయడం అభినందించదగ్గదని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రశాంత్‌కుమార్ ఝా,అడిషనల్ పీసీసీఎఫ్ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.

190

More News

మరిన్ని వార్తలు...