ధోనీ పాదాలను తాకి..

Wed,January 11, 2017 12:44 AM

DHONIFAN
చూడటానికి ఇది ప్రాక్టీస్ మ్యాచే.. అందులోనూ వర్కింగ్ డే... అభిమానుల సంఖ్య పెద్దగా ఉండదని అందరూ అనుకున్నంటున్న వేళ.. బ్రౌబర్న్ స్టేడియానికి జనాలు పోటెత్తారు. కెరీర్‌లో చివరిసారిగా నాయకత్వ బాధ్యతలు వహిస్తున్న మిస్టర్ కూల్ ధోనీని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. మధ్యాహ్నం కాకముందే స్టేడియం గేట్ల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. దీంతో క్షణాల్లోనే అన్ని స్టాండ్‌లు నిండిపోయాయి. తొలి వికెట్ పడిన వెంటనే ధోనీ..ధోనీ అంటూ మైదానంలో అరుపులు మొదలయ్యాయి. అయితే రాయుడు రావడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. మ్యాచ్ మధ్యలో ఓ వీరాభిమాని ఫీల్డ్‌లోకి పరుగెత్తుకొచ్చి ధోనీ కాళ్లు మొక్కాడు. ఈ హఠాత్పరిణామానికి కలవరపడ్డ మహీ.. పిచ్ మీదకు వెళ్లొద్దని చెప్పడంతో అతను జంప్ చేస్తూ దాటేశాడు. వెంటనే పోలీసులు వచ్చి అతణ్ని బయటకు తీసుకెళ్లారు.

1020

More News

మరిన్ని వార్తలు...