|
|
Home >> Sports Home >> >> News
సోధి అవుట్
లండన్: షూటింగ్‌లో భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కచ్చితంగా పతకం సాధించగలడని భావించిన రంజన్‌సింగ్ సోధి ఫైనల్‌కు చేరకుండానే వెనుదిరిగాడు. పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో సోధి 150కిగాను 134 పా యింట్లు మాత్రమే సాధించి 11వ స్థానంలో నిలిచాడు. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించాల్సి తొలి ఆరుగురు జాబితాతోపాటు పోటీల నుంచి నిష్క్రమించాడు. తొలిరౌండ్‌లో 50కిగాను 48 పాయింట్లు సాధించిన సోధి ఆ తరువాత రెండు రౌండ్లలో వరుసగా 44, 42 మాత్రమే నమోదు చేయడం తీవ్ర ప్రభావం చూపింది. అంతర్జాతీయ పోటీల్లో తాను ఇంత దారుణమైన ప్రదర్శన ఇంతకుముందెప్పుడూ కనబరచలేదని సో ధి అన్నాడు. కాగా, షూటర్ విజయ్‌కుమార్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ అంశంలో ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకొన్నాడు. క్వాలిఫికేషన్‌లో విజయ్ 293 పాయింట్లు సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.
Other News
|
|||||