చిరుతకు సవాల్!

అతని వేగాన్ని చూసి చిరుతే సిగ్గుపడుతుందేమో.. తన రాజసాన్నే తలదన్నేలా ఆ పరుగేమిటని!గాలిదేవుడే ఈర్షపడతాడేమో.. వేగానికి సిసలైన ప్రతినిధి అయిన తననే మించిపోయాడని!కాలమే క్యా బాత్ హై అని ముక్కునవేలేసుకుంటుందేమో.. అలుపెరుగని తన పయనానికే సవాలు విసురుతున్నాడని!అతనెవరో కాదు.. ఐదారేళ్లుగా స్ప్రింట్‌లో రారాజుగా వెలుగొందుతున్న ఉస్సేన్ బోల్ట్... ఉరఫ్ జమైకా చిరుత!!ఐతే లండన్ ఒలింపిక్స్ రూపంలో అతనికిప్పుడు కెరీర్‌లోనే పెను సవాలు ఎదురవుతోంది. ఫిట్‌నెస్‌పరంగానే కాదు.. బ్లేక్, పావెల్, టైసన్ గే ఇత్యాదుల వల్ల కూడా!!అవును.. ఈసారి విశ్వక్షికీడలు ఉస్సేన్ బోల్ట్ సత్తాకు పరీక్షే! తన దేశానికే చెందిన స్ప్రింటర్ యోహన్ బ్లేక్ అతనికి పక్కలోబప్లూంలా తయారయ్యాడిప్పుడు. మొన్నటికి మొన్న కింగ్‌స్టన్‌లో జరిగిన ఒలింపిక్ ట్రయల్స్‌లో బోల్ట్‌ను తోసిరాజని అగ్రస్థానంలో నిలిచాడు. ఒకసారి కాదు.. బోల్ట్‌కు ఎంతో ప్రీతిపావూతమైన 100 మీ. విభాగంతో పాటు 200 మీ.లోనూ తన సీనియర్‌ను చిత్తు చేశాడు బ్లేక్. బోల్ట్ అభిమానులతో పాటు విశ్లేషకుపూవ్వరూ ఊహించని పరిణామమిది.
పరుగు అంటేనే బోల్ట్.. బోల్ట్ అంటేనే పరుగు అని భావించే పరిస్థితుల్లో బ్లేక్ అతని ఆధిపత్యానికి బీటలు వేశాడని అనుకోవాలా? లేదంటే.. ఒలింపిక్స్ వారాల వ్యవధి మాత్రమే ఉన్నదశలో బోల్ట్‌కు ఈ పరాభవం ఏమిటి? మరి.. లండన్ ఒలింపిక్స్‌లోనూ బోల్ట్ ఈ రకంగానే చేతుపూత్తేస్తాడా? అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివే!! వీటికి సమాధానం మనకు త్వరలోనే లభించనుంది. ఇప్పటికైతే కాగితంపై చూస్తే, డిఫెండింగ్ చాంపియన్‌గా అతనే ఫేవట్ అనడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. ఐతే లండన్‌లో బోల్ట్‌కు ప్రమాదఘంటికలు మోగనున్నాయని వాదించేవారు బ్లేక్ ప్రతిభను గణాంకాల్లో విశ్లేషిస్తుండడం ఇక్కడ ఆసక్తికరం. కింగ్‌స్టన్ ట్రయల్స్‌లో బోల్ట్‌ను ఖంగుతినిపించే దశలో 100 మీ. పరుగును బ్లేక్ 9.75 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా బ్లేక్ 100 మీ. స్ప్రింట్ చరివూతలో 9.80లోపు సమయాన్ని నమోదు చేసిన నాలుగోఅథ్లెట్ (మిగతా ముగ్గురు బోల్ట్, అసఫా పావెల్, టైసన్ గే) మాత్రమే అయాడనేది వారి వాదన. అంతేకాదు గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 100మీ. విభాగంలో స్వర్ణాన్ని కొట్టింది కూడా బ్లేకే! అప్పట్లో 9.92 సమయాన్నే నమోదు చేసిన అతడు తర్వాత జరిగిన నాలుగు ప్రదర్శనల్లోనూ ఇంతకంటే తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని అధిగమించాడు. విశ్వ క్రీడల నేపథ్యంలో ఇవన్నీ బ్లేక్ ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసేదనేది వారి వాదన.
ఐతే బోల్ట్ శకం ముగిసిపోలేదని, కీలకదశలోనే అతనిలో ప్రతిభ పెల్లుబికివస్తుందని వాదించే వాళ్లూ ఉన్నారు. అమెరికా లెజెండరీ స్ప్రింటర్ మిచెల్ జాన్సన్ ఇదే అంటున్నాడు. ‘బోల్ట్ నుంచి అత్యుత్తమ స్థాయి ప్రదర్శన కరువైనప్పుడు దాన్ని సొమ్ముచేసుకోగలనని మాత్రమే బ్లేక్ నిరూపించాడు. బోల్ట్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. అతనిలో ప్రధాన లోపం ఇదే. దీన్ని అధిగమిస్తే గనక బోల్ట్‌ను ఎవ్వరూ ఆపలేరు. అతనిలో టాలెంట్‌కు కొదువలేదు. గత బీజింగ్ ఒలింపిక్స్ తరహాలోనే మరోసారి మూడు బంగారు పతకాల్ని సాధిస్తాడు’ అని జాన్సన్ విశ్వాసంగా చెబుతున్నాడు. నిజానికి కింగ్‌స్టన్ ట్రయల్స్‌లో బ్లేక్ (9.75)కన్నా బోల్ట్ (9.87) వెనుకబడింది కేవలం 0.11 సెకన్లు మాత్రమే. అది కూడా జాన్సన్ అన్నట్టుగా తీసుకోవడంలో తడబడడం వల్లే. ఇక తను ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నందుకు కారణాన్ని విశ్లేషిస్తూ బోల్ట్.. ‘స్టిఫ్ షూ (బిగుతైన) వాడడం వల్లే వెనుకబడాల్సివచ్చింద’ంటున్నాడు. బోల్ట్ చెబుతోంది నిజమా? లేదంటే తనను డిఫెండ్ చేసుకోవడానికి చెబుతున్నాడా? అనే విషయాన్ని పక్కనబెడితే అతనికి మాత్రం రానున్నవి నిద్రలేని రాత్రులే! బ్లేక్ ఇత్యాదులను చిత్తుచేసి పసిడిపంట పండిస్తేగానీ అతను సుఖంగా నిద్రపోలేడు. ఇది నిజం!!

Other News