కుస్తీ వీరుడే త్రివర్ణ పతాకధారి
న్యూఢిల్లీ:‘బీజింగ్’ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా కుదరన్నాడు. మరి.. ఆ చాన్స్ ఎవరికి? స్టార్ బాక్సర్ విజేందర్‌కా.. లేదంటే టెన్నిస్ వెటరన్ లియాండర్ పేస్‌కా? ఇలా ఇన్నాళ్లుగా కొనసాగుతున్న తర్జనభర్జనలకు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) ముగింపునిచ్చింది. లండన్ ఒలింపిక్స్ ఆరంభ సంబరాల్లో మన త్రివర్ణ పతాకం బీజింగ్ కాంస్య పతక విజేత, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చేతుల్లో రెపపలాడనుంది. జూలై 27న జరిగే విశ్వక్షికీడల ప్రారంభోత్సవంలో భారత బృందాన్ని ముందుండి నడిపించే గౌరవాన్ని సుశీల్‌కు కట్టబెడుతూ ఐఓఏ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఓఏ అధ్యక్షుడు వీకే మల్హోత్రా ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. నిజానికి ఈ గౌరవం బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన ఏస్ షూటర్ అభినవ్ బింద్రాకు దక్కాలి. ఐతే ఆరంభోత్సవాలు పూర్తయిన మూడోరోజే బింద్రాకు పదిమీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ పోటీ ఉండడంతో మరింత ఏకాక్షిగత కోసం అతను ఈ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. ఇక బీజింగ్ క్రీడల కాంస్య పతక విజేత, స్టార్ బాక్సర్ విజేందర్‌కు ఆరంభోత్సవం మరుసటిరోజే తన ఈవెంట్‌కు సంబంధించి వేయింగ్ ప్రో గ్రామ్ ఉండడంతో అతను కూడా తనకు కుదరదన్నాడు. దీంతో 2000 సిడ్నీ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పేస్‌కు ఈ గౌరవం దక్కనుందేమో అనే అంచనాలు వినిపించినా, తుదకు ఈ చాన్స్‌ను కుస్తీవీరుడు సుశీల్ కొట్టేశాడు.
వద్దేవద్దు.. మాకెన్‌ది అదే మాట!
సురేశ్ కల్మాడీపై క్రీడల మంత్రి అజయ్ మాకెన్ తన వైఖరికే కట్టుబడ్డారు.. తీవ్ర అవినీతి ఆరోపణలతో కామన్వెల్త్ నిర్వహణ కమిటీ నుంచి ఉద్వాసనకు గురైన కల్మాడీ లండన్ ఒలింపిక్స్‌కు వెళ్లొద్దని తను వ్యక్తం చేసిన అభివూపాయంలో ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. ‘కల్మాడీని లండన్ ఒలింపిక్స్‌కు దూరం గా ఉంచాలని అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్యలతో మాట్లాడమని ఇప్పటికే భారత ఒలింపిక్ సమాఖ్యకు నివేదించా. లండన్ ఒలింపిక్ బృందంతోపాటు వచ్చేందుకు కల్మాడీకి ఎలాంటి అధికారిక హో దా లేదు. అతనికి ఐఓఏలో సభ్యత్వంలేదు.. ప్రభుత్వ ప్రతినిధీ కాదు. తనపై వచ్చిన ఆరోపణల నుంచి విముక్తి లభిస్తే తప్ప.. లండన్‌కు వెళ్లరాదని కల్మాడీకి నేను మళ్లీ చెబుతున్నా’నని మాకెన్ అన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు నుంచి అనుమతి పొందిన తనను మాకెన్ లండన్ వెళ్లకుండా అడ్డుపడుతున్నారని కల్మాడీ విమర్శించిన సంగతి తెలిసిందే.
నమ్మకాన్ని నిలబెడతా: సుశీల్
లండన్ ఒలింపిక్స్‌లో ఆరంభోత్సవంలో భారత పతకాధారిగా తనను ఎంపికచేయడంపై సుశీల్ కుమార్ ఉబ్బితబ్బిబవుతున్నాడు. విశ్వ క్రీడల వేదికపై భారత పతాకాన్ని చేబూనడం గొప్ప గౌరవమన్న సుశీల్, తనపై నమ్మకముంచి ఈ బాధ్యతను అప్పగించిన ఐఓఏకు ఈ సందర్భంగా కృతజతలు తెలియజేస్తున్నానన్నాడు. ‘చాలా సంతోషంగా ఉంది. నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెడతా. లండన్ నుంచి పతకంతోనే తిరిగొస్తా’ అని అమెరికాలో ట్రైనింగ్ క్యాంప్‌ను ముగించుకుని ఆదివారమే భారత్ చేరిన సుశీల్ అన్నాడు.
Other News