హూంకరించేనా ఉత్సాహంగా

క్రీడా నేపథ్యం గల కుటుంబమే. కానీ, తన కుటుంబ సభ్యులు రాణించిన క్రీడను ఎంచుకోకుండా భిన్నమైన ఆలోచనతో క్రీడారంగంలోకి ప్రవేశించింది. అడుగుపెట్టిందే తడవుగా పతకాల పంట పండించింది. జూనియర్ స్థాయి నుంచి తాజాగా ఒలింపిక్స్ దాకా ప్రస్థానం విజయవంతంగా సాగుతోంది. ఆమే ఉత్తరవూపదేశ్‌లోని మీరట్‌కు చెందిన గరిమా చౌదరి. జూడోలో భారత్ నుంచి లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక క్రీడాకారిణి. అర్హత సాధించడమేకాదు హూ..హా అంటూ భారత సత్తాను విశ్వక్షికీడల వేదికన చాటుతానంటోంది జుడోకా గరిమా.
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ చరివూతలో జూడోలో భారత్‌కు ఇప్పటిదాకా సాధ్యంకాని పతకాన్ని లండన్‌లో సాధించిపెడతానంటోంది 22 ఏళ్ల గరిమా చౌదరి. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జరిగిన ఆసియా జూడో చాంపియన్‌షిప్స్‌లో 63 కిలోల విభాగంలో ఏడోస్థానంలో నిలవడం ద్వారా అంతర్జాతీయ జూడో సమాఖ్య (ఐజెఎఫ్) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గరీమా 88వ ర్యాంకు పొందింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం ద్వారా తన కల నిజమైందని చెబుతోంది. ‘ఏ అథ్లెట్‌కైనా విశ్వక్షికీడల్లో పాల్గొనాలనేది ఓ స్వప్నం. అదిప్పుడు సాకారం కాబోతోంది. నా పని ఇంతటితోనే అయిపోలేదు. ఒలింపిక్ పతకంతో స్వదేశానికి తిరిగి రావడమే నా లక్ష్యమ’ని గరీమా పేర్కొంది. 14 ఏళ్ల వయసులోనే గరీమా జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఆ తరువాత 2004లో కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్‌లో పాల్గొంది.
జాతీయ స్థాయిలో స్థిరంగా రాణిస్తూ 2007లో జరిగిన జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. అదే టోర్నీలో తరువాతి రెండేళ్లలో వరుసగా రజతం, కాంస్యం దక్కించుకుంది. ఇక దక్షిణాసియా క్రీడల్లో 2006లో స్వర్ణం కైవసం చేసుకోవడమేగాక 2009 మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో కాంస్యం సాధించింది. ఈ ఏడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లోనూ కంచు మోగించింది. గరిమాలో లక్ష్యం చేరాలన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కువని, ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తే పతకం ఖాయంగా తేగలదని ముందునుంచీ నమ్మకంతో ఉన్నామని, అది కచ్చితంగా జరుగుతుంని గరిమా కోచ్ జీవన్ శర్మ అన్నాడు. లండన్‌లో ప్రధానంగా జపాన్, కొరియా జుడోకాలే ఎదురుపడతారని, అయితే పలు అంతర్జాతీయ టోర్నీలో గరిమా ఇప్పటికే వారిని ఓడించినందున సానుకూల ఫలితాలనే ఆశించవచ్చన్నారు. సో.. గరిమాకు ఆల్ ద బెస్ట్ చెబుదాం.
Other News