Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, May 23, 2013
 


Home >> Sports Home >> >> News
చుంబన సేవనం చేదుగుళికైన వేళ

లండన్: స్టార్ ఫార్ములా వన్ రేసర్ హామిల్టన్‌కు కొత్త చిక్కొచ్చిపడింది. అసలే తన ప్రేయసి నికోల్ షెర్జింగర్‌తో అతనికి అంతంతమావూతమే సంబంధాలున్నాయి. ఈ దశలో ఓ ర్యాప్ సింగర్‌తో గాఢచుంబనంలో మునిగితేలుతున్న ఫొటో ఒకటి బయటకుపొక్కడం ఇతని లవ్ సమస్యని మరింత పెంచింది. ఇటీవల లండన్‌లో స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్న హామిల్టన్.. ర్యాప్ సింగర్ ప్రీదా షార్ప్‌తో అధర చుంబనంలో తేలియాడాడు. ఐతే, దీన్ని తన ప్రేయసి సీరియస్‌గా తీసుకుంటుందని భయపడ్డాడో ఏమో.. ఏదో మర్యాదకి ముద్దిచ్చానని చెబుతున్నాడు. అంతేకాదు ప్రీదా తనకు చెల్లిలాంటిదనీ చెబుతున్నాడు. ‘ప్రీదా నాకు చెల్లెలుతో సమానం. నికోల్‌కూ తను ఫ్రెండే. కిస్ ఇవ్వకుండా గుడ్ బై చెప్పలేం కదా. నేనూ అదేచేశాను. ఈసారి మళ్లీ కలిస్తే, షేక్‌హ్యాండ్‌తో సరిపెడతాలే’ అంటూ ట్వీట్ పోస్ట్ చేశాడు. అన్నట్టు.. ‘ ఇక నుంచి మనదిక అన్నా చెల్లెలి వరుస’ అంటూ ప్రీదాకు ప్రత్యేకంగా ఓ మెసేజ్ పంపాడట. మరి.. దీన్ని అతని ప్రేయసి విశ్వసిస్తుందా?

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine