|
|
Home >> Sports Home >> >> News
దారాసింగ్ పరిస్థితి విషమం
ముంబై: నిన్నటితరం కుస్తీయోధుడు, నటుడు దారాసింగ్ మృత్యువుతోపోరాడుతున్నాడు. 83 ఏళ్ల దారాసింగ్‌కు ఇటీవల తీవ్రగుండెపోటు రావడంతో ఆస్పవూతిలో చేర్చారు. ఐతే బుధవారం ఆయన ఆరోగ్యపరిస్థితి మరింత విషమించిందని డాక్టర్లు తెలిపారు. ‘గుండెపోటుకు గురైనప్పుడు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో మెదడు తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఆయన పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది’ అని కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రెజ్లర్‌గా లబ్ధప్రతిష్టుడైన దారా తర్వాత సినీరంగ ప్రవేశంతో అభిమానలోకానికి మరింత దగ్గరయ్యాడు. షేర్-ఎ-దిల్, మేరే నామ్ జోకర్, ధరమ్ కరమ్ వంటి హిట్ చిత్రాల్లో కనిపించిన దారా.. 80వ దశకంలో బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రామాయణంలో హనుమంతుని పాత్ర పోషించి మెప్పించాడు.
Other News
|
|||||