అప్పట్లో ధోనీ చేతుల్లో బెస్ట్ టీమ్
-వరల్డ్‌కప్ విక్టరీకి అదే కారణమన్న వీరూ
నోయిడా:రాజుగారి చిన్న భార్య మంచిదంటే దానర్థం? ఇలానేవుంది ధోనీ కెప్టెన్సీని సెహ్వాగ్ విశ్లేషిస్తున్న తీరు. 2007 టి-20 కప్, 2011 వరల్డ్‌కప్పుల్లో భారత్ గెలవగలిగిందంటే అందుకు రీజనేంటి? అని వీరూను అడిగితే ఏమంటున్నాడో తెలుసా? ‘ధోనీకి అత్యుత్తమ జట్టు అందుబాటులో ఉన్నందునే వరల్డ్‌కప్ విక్టరీ సాధ్యమైంది. అప్పట్లో ఆస్ట్రేలియా కూడా వరుసగా వరల్డ్‌కప్‌లు గెలిచిందంటే అది జ ట్టు ప్రతిభేకానీ కేవలం కెప్టెన్ వల్లేకాదు. ధోనీ కెప్టెన్సీలో మాకు అత్యంత పటిష్ట జట్టు అందుబాటులో ఉండడం వల్లే ప్రపంచకప్ ను గెలిచామనేది నా అభివూపాయం’ అని సింపుల్‌గా అనేశాడు. మరి దీనర్థం? ధోనీ గొప్ప కెప్టెన్ కాదనేది సెహ్వాగ్ అభివూపాయమని భావించాల్సివుంటుందా? గతకొన్నాళ్ల నుంచి ఇద్దరి మధ్య పొసగడం లేదని వస్తున్న కథనాల్నిబట్టి చూస్తే, వీరూ తన వ్యాఖ్యల ద్వారా మహీ సాదాసీదా కెప్టెన్ మాత్రమే అనే అభివూపాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశాడని అనుకోవచ్చు. మరి.. సెహ్వాగ్ వ్యాఖ్యలపై ధోనీ కౌంటర్ ఇస్తాడా అనేది పక్కనబెడితే.. తాను పూర్తిఫిట్‌నెస్‌తో లంక టూర్‌కు సిద్ధమయ్యానని వీరూ అన్నాడు. ‘ఐపీఎల్‌లో దాదాపుగా అన్ని మ్యాచుల్లోనూ ఆడాను. ఫిట్‌నెస్ ప రంగా నాకిప్పుడు ఎలాంటి సమస్యలూ లేవ’న్నాడు. టెస్ట్ క్రికెట్ మనుగడకు ముప్పువాటిల్లనుందని ఇటీవల ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలతో సెహ్వాగ్ విభేదించాడు. ‘ఏ టీనేజ్ క్రికెటర్‌నైనా అడిగిచూడండి? టెస్ట్ క్రికెటర్‌ను కావాలనుందనే చెబుతాడు. ఏదో ఒక ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పాలనుకున్న ఆటగాళ్లు కూడా తొలుత పరిమిత ఓవర్ల ఆటకే వీ డ్కోలు చెప్తారు. అంతేగాని, టి-20లో ఆడేందుకు టెస్టుల కు గుడ్ బై చెప్పడం మనం ఎక్కడా చూడం’ అని వీరూ విశ్లేషించాడు. ఇక ద్రవిడ్ కెప్టెన్‌గా కొనసాగిన రోజుల్లో అతనికి జట్టు సభ్యుపూవరూ సహకరించలేదని చాపెల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు వీరూ నిరాకరించాడు.
Other News