మాకు మీరు.. మీకు మేము
- పాక్-లంక బోర్డుల మధ్య ఒప్పందం
లాహోర్: ఐపీఎల్ తరహాలోనే దేశవాళీ టి-20 టోర్నీలకు శ్రీకారం చుట్టిన పాకిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లను పరస్పర టోర్నీల్లో ఆడించడం ద్వారా సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కౌలాలంపూర్‌లో ఒప్పందం చేసుకున్నట్లు పీసీబీ అధ్యక్షుడు జకా అష్రాఫ్ తెలిపారు. ‘ఒప్పందం ప్రకారం త్వరలో జరగనున్న శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు మా క్రికెటర్లను మేం అనుమతించాల్సి ఉంటుంది. ప్రతిగా ఈ ఏడాదిలోనే మేం నిర్వహించే ప్రీమియర్‌లీగ్‌కు తమ క్రికెటర్లను లంక పంపిస్తుంద’ని అష్రాఫ్ వివరించారు. అయితే ఇందుకోసం ఆటగావ్లూవరినీ బలవంతం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇదేవిధంగా బంగ్లాదేశ్‌తోనూ త్వరలో ఒప్పందం చేసుకుంటామన్నారు.
Other News