Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Sports Home >> >> News
రష్య బుల్ బుల్ స్పెయిన్ బుల్ సెర్బియా బుల్లోడు

tennish-ఫెదరరూ ఫేవ
-గెలిస్తే.. సంప్రాస్ రికార్డు సమం
- రేపటి నుంచే వింబుల్డన్

తివాచీ పరిచారా అన్నట్టుగా పచ్చటి కోర్టు..
స్వచ్ఛమైన ఆటకు ప్రతీక అన్నట్టుగా శ్వేతవర్ణ దుస్తుల్లో దర్శనమిచ్చే ఆటగాళ్లు..ఆనందాన్ని చప్పట్ల ద్వారా మాత్రమే వ్యక్తం చేసే జనం.. ఆహా.. నిజంగా నయనానందకరమే కదూ వింబుల్డన్! ఈ చారివూతక టోర్నీ మీ ముందుకొచ్చేస్తోంది. మొన్న ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ విజేతగా నిలిచిన రష్యా అందం షరపోవా.. స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో పాటు చెక్ చరిష్మాటిక్ క్విటోవా.. స్విస్ స్టార్ ఫెదరర్.. సెర్బియా బుల్లోడు జొకోవిచ్.. ఇలా ఎందరో ఫేవట్లు! పోరాడేందుకు వారు సిద్ధమవుతున్నారు.. తిలకించేందుకూ మీరూ సిద్ధంకండి!లండన్:వింబుల్డన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు రోజర్ ఫెదరర్. తనకచ్చొచ్చిన ఈ వేదికన స్విస్ వీరుడు ఏకంగా ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచి నిన్నటి దిగ్గజం పీట్ సంప్రాస్ అత్యధిక ఏడు టైటిళ్ల రికార్డుకు అడుగుదూరంలో నిలిచిపోయాడు. గ్రాస్‌కోర్టు రారాజుగా పేరుగాంచిన ఫెదరర్ చివరిసారిగా ఇక్కడ మూడేళ్ల క్రితం టైటిల్ నెగ్గాడు. ఆ మరుసటి ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ లేక కొట్టుమిట్టాడుతున్న ఫెదరర్ తన ఫేవట్ వింబుల్డన్‌తోనే పునర్‌వైభవాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నాడు. అంతేకాదు.. ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ లండన్ ఒలింపిక్స్‌కు పరీక్షలాంటిది. గతంలో రెండుసార్లు విశ్వ క్రీడల్లో డబుల్స్‌లో స్వర్ణం నెగ్గిన ఫెదరర్ సింగిల్స్‌లో మాత్రం విఫలమయ్యాడు. దీంతో ఈ విజయం అందించే ఆత్మవిశ్వాసంతో ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం నెగ్గి అరుదైన ‘కెరీర్ స్లామ్’ ఘనతను పూర్తిచేసుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతున్నాడు ఫెదరర్. అయితే ఫెదరర్ ఫైనల్ చేరే క్రమంలో జొకోవిచ్ రూపంలో సెమీస్‌లో పెద్ద గండాన్ని ఎదుర్కోనున్నాడు. కానీ గతేడాది ఇక్కడ సోంగా చేతిలో ఓడి క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టిన ఫెదరర్ ఈమారు మాత్రం అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయనీయనన్న ధీమాతో ఉన్నాడు. ఇక ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే చక్కని ఛాన్స్ కూడా ఫెదరర్ ముం దుంది. ఇక శనివారమే ముగిసిన వింబుల్డన్ సన్నాహక ఈవెంట్ యునిసెఫ్ ఓపెన్ నెగ్గి ఫెదరర్ మంచి ఊపుమీదున్నాడు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరుమీదున్న రెండోసీడ్ నాదల్ ఇక్కడా అదే దూకుడును కొనసాగించాలన్న ఉబలాపడుతున్నాడు. గతంలోలానే ఈసారీ సెమీస్‌లో ముర్రేను ఓడించి ఫైనల్ చేరడం ఖాయమని స్పష్టం చేస్తున్న నాదల్.. అదే జరిగితే అతనికి టైటిల్ నెగ్గడం కూడా పెద్ద కష్టం కాకపోవచ్చు.

షరపోవా జోరు సాగేనా..?

మహిళల్లో మాత్రం ఈసారి పోరు ఆసక్తికరం కానుంది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో కెరీర్ గ్రాండ్‌స్లామ్‌ను అందుకోవడమే గాకుండా మళ్లీ నెంబర్ వన్‌గా అవతరించిన రష్యన్ బ్యూటీ షరపోవా దూకుడుకు కళ్లెం వేసేందుకు బెల్జియం క్వీన్ క్లియ్‌స్టర్స్‌కు సిద్ధంగా ఉంది. గాయంతో ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన మాజీ నెంబర్ వన్ క్లియ్‌స్టర్స్ వింబుల్డన్‌తో తిరిగి తన సత్తాను చాటుకుంటానంటోంది. క్వార్టర్స్‌లో క్లియ్‌స్టర్స్‌ను ఢీకొనే చాన్స్ ఉన్న షరపోవా, ఆ తర్వాత ఫైనల్ చేరే క్రమంలో మూడోసీడ్ రద్వాన్‌స్కా, ఐదుసార్లు చాంపియన్ వీనస్ విలియమ్స్, ఆస్ట్రేలియా స్టార్ సమంతా స్టోసర్‌లను ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ వీరందరినీ అధిగమించినా తుదిపోరులో డిఫెండింగ్ చాంపియన్, చెక్ భామ క్విటోవా లేదా మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్‌లో ఒకరితో తలపడాలి. మరో పార్శంలోనున్న నాలుగోసీడ్ క్విటోవా ఫైనల్ చేరాలంటే క్వార్టర్స్‌లో రెండోసీడ్ అజంకాపై నెగ్గాలి.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine