ఒలింపిక్స్‌కు సహనా కుమారి

హై జంప్‌లో జాతీయ రికార్డు బద్దలు
- తొలిరోజు సత్తా చాటిన గీత
హైదరాబాద్, టీ మీడియా (ఖేల్ ప్రతినిధి):కర్ణాటక హైజంపర్ సహనా కుమారి లండన్ బెర్త్ దక్కడం.. తెలుగు తేజం సత్తి గీత స్వర్ణంతో మెరవడం.. ఇవీ అంతర రాష్ట్ర జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు విశేషాలు. గచ్చిబౌలీ స్టేడియంలో శనివారం ప్రారంభమైన చాంపియన్‌షిప్‌లో సహన మహిళల హై జంప్‌ను 1.92 మీ లంఘించడం ద్వారా ఆరేళ్ల కిత్రం నాటి (బాబీ అలోయ్‌సిస్; కేరళ) జాతీయ రికార్డును బద్దలుకొట్టి లండన్ టిక్కెట్ కొట్టేసింది. పశ్చిమ బెంగాల్ అథ్లెట్ మల్లిక (1.79 మీ.)కు రతజం, కేరళ అథ్లెట్ సిజి (1.76 మీ.)కు కాంస్యం దక్కాయి. ఇక లోకల్ స్టార్ గీత 100 మీ స్ప్రింట్‌లో స్వర్ణంతో మెరిసింది. ఈ విభాగంలో ఫేవట్‌గా భావించిన మనీషా (హర్యానా) ఫాల్స్ రేసుకు పాల్పడడం గీతకు కలిసొచ్చింది. 12 సెకన్లలో రేసును పూర్తిచేసి ప్రథమస్థానాన్ని అందుకున్న గీత తొలిరోజు పోటీల్లో ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా నిలిచింది. అంజూ (కేరళ, 12.18 సె), రుమా సర్కార్ (పశ్చిమ బెంగాల్, 12.37 సె)లు రెండు, మూడుస్థానాల్లో నిలిచారు. పురుషుల వంద మీటర్ల రేసులో ఏపీ అథ్లెట్ అబ్ధుల్ నజీబ్ ఖురేషీ 10.59 సెకన్లతో రెండోస్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఇక 200 మీ. పరుగు స్పెషలిస్ట్ ధరమ్‌బీర్ సింగ్ 100 మీ. రేసును 10.51 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు.
అంతకుముందు పోటీలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. ఈ కార్యక్షికమంలో రాష్ట్ర క్రీడల మంత్రి వట్టి వసంత కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇతర పోటీల ఫలితాలు: మహిళల 5వేల మీటర్లు: 1. సహనారా ఖతి, 2. ఆత్రి మోనిక, 3. అర్చనా పాల్; పురుషుల 5వేల మీటర్లు: 1. ఇంద్రజిత్ పటేల్, 2. మాన్‌సింగ్, 3. సుశీల్ కుమార్; పురుషుల ట్రిపుల్ జంప్: 1. అర్పిందర్ సింగ్, 2. సౌరభ్, 3. రాజశేఖర్; మహిళల పోల్‌వాల్ట్: 1. సురేఖ, 2. ఖ్యాతి, 3. రమ్య; మహిళల జావెలిన్ త్రో: 1. అనూ రాణి, 2. సుమన్ దేవి, 3. రూపిందర్ కుమార్.
Other News