|
|
Home >> Sports Home >> >> News
నేనలా అనలేదు
న్యూఢిల్లీ: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీవీఎస్ లక్ష్మణ్‌కు కెప్టెన్ ధోనీ నుంచి మద్దతు లభించలేదని తాను వ్యాఖ్యానించలేదని టీమిండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ అంటున్నాడు. ధోనీ సహకారం అందివుంటే లక్ష్మణ్ పరిస్థితి కచ్చితంగా భిన్నంగా ఉండేదని శనివారం వీవీఎస్ నుంచి రిట్మైంట్ ప్రకటన వెలువడిన వెంటనే గంగూలీ అన్నట్లుగా మీడియాలో కథనాలు వెలువడ్డ సంగతి తెలిసిందే. దీనిపై దాదా ఆదివారం మాట్లాడుతూ, ‘లక్ష్మణ్‌కు ధోనీ మద్దతు లేదన్న కామెంట్ నేను చేయలేదు. కెప్టెన్‌గా ధోనీ 24 గంటలూ ఆటగాళ్లందరికీ అందుబాటులో ఉండాలని మాత్రమే అన్నాన’న్నాడు. ఇక ఆటగాళ్లతో చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు అవగాహనలోపం ఉందని తానన్నట్లుగా వచ్చిన వ్యాఖ్యలనూ దాదా కొట్టిపారేశాడు.
Other News
|
|||||