|
|
Home >> Sports Home >> >> News
‘చెవ్వు’ కేక!
సుశీల్ ఫైనల్లో చోటు కోసం టాంటనోవ్ (కజకిస్తాన్)తో తలబడుతున్న బౌట్ అది! హోరాహోరీగా సాగుతోంది. అంతలోనే టాంటనోవ్ కెవ్వుమని ఓ చిన్నపాటి కేకేశాడు! రక్తమోడుతున్న చెవిని రిఫరీకి చూపిస్తూ సుశీల్ తనను కొరికాడని ఫిర్యాదు చేశాడు. ఐతే దీన్ని రిఫరీ తేలిగ్గా తీసుకున్నాడు. సుశీల్ తనకు ఏమీ తెలియనట్టు అమాయకంగా నిల్చున్నాడు. బహుశా సెమీస్ పోరు నువ్వానేనా అన్నట్టుగా సాగడంతోనే సుశీల్ ఇలా చేశాడేమో! రెండో పీరియడ్ ముగిసేటప్పటికి సుశీల్-టాంటనోవ్ 1-1తో సమంగా ఉన్నారు. ఇక మూడో పీరియడ్‌లో 34 సెకన్లు మాత్రమే మిగిలివున్న దశలో సుశీల్.. టాంటనోవ్‌ను కిందపడేసి మీదకు లంఘించాడు. సుశీల్‌కు రెండు పాయింట్లయితే వచ్చాయి గానీ, టాంటనోవ్ మాత్రం రక్తం కారుతున్న చెవి పట్టుకొని పైకి లేచాడు. కజక్ శిబిరమైతే సుశీల్‌పై ఫిర్యాదు చేయకపోవడం విశేషం.
Other News
|
|||||