రామ్ సింగ్‌కు క్లియన్స్
న్యూఢిల్లీ: తొలుత లండన్ ఒలింపిక్స్ అథ్లెట్ జాబితాలో చేర్చారు. ఆనక ఫిట్‌నెస్ ఉంటేనే లండన్‌కు పంపుతామన్నారు. దీంతో అతనికి తన సత్తా నిరూపించుకోక తప్పింది కాదు! మొత్తానికి మారథాన్ రన్నర్ రామ్ సింగ్ యాదవ్ లండన్ టికెట్ దక్కించుకున్నాడు. ఆదివారం భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) నిర్వహించిన ఫిట్‌నెస్ ట్రయల్స్‌లో అతను పాసయ్యాడు. ‘రామ్ సింగ్ 10 కిమీ. పరుగును 32.30 నిమిషాల్లో పూర్తిచేశాడు. అతని ఫిట్‌నెస్‌పై సంతృప్తితో క్లియన్స్ ఇచ్చాం’ అని ఏఎఫ్‌ఐ సెక్రటరీ జనరల్ సీకే వాల్సన్ అన్నారు. ట్రిపుల్ జంపర్లు మయూఖ, రంజిత్ మహేశ్వరీలకు రామ్ సింగ్ తరహాలోనే క్లియన్స్ ఇచ్చింది ఏఎఫ్‌ఐ.
Other News