పవార్‌కు వీడ్కోలు

- ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా ఇసాక్
కౌలాలంపూర్:అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ వైదొలిగారు. న్యూజిలాండ్‌కు చెందిన అలెన్ ఇసాక్ ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్‌గా, నిన్నటిదాకా ఐసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన 60 ఏళ్ల ఇసాక్ ఐసీసీకి 8వ అధ్యక్షుడు. ఇక ఐసీసీకి కొత్త సీఈఓ కూడా వచ్చారు. దక్షిణావూఫికా మాజీ వికెట్ కీపర్ డేవ్ రిచర్డ్సన్ తమ దేశానికే చెందిన హరూన్ లోర్గాత్ నుంచి ఈ బాధ్యతల్ని స్వీకరించారు. కాగా ఉపాధ్యక్షపదవిలో కొనసాగుతున్న వ్యక్తి అధ్యక్షునిగా ఎంపికవుతూ వస్తున్న సంప్రదాయం ఇసాక్ తో ముగియనుంది. 2014లో ఇసాక్ పదవీ విరమణ చేశాక అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ను ఐసీసీ పూర్తి ప్రక్షాళన చేయనుంది. కాగా ఐసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ఇసాక్ అన్నారు. ‘గత రె ండేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం.. ఇకముందూ ఉంటాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ను ఇప్పుడున్నట్లుగా ఆరోగ్య స్థితిలో నడపడం సవాలేకానుంది. మూడు ఫార్మాట్లనూ వేటికవే ప్రాధాన్యత కలిగేవిధంగా చూడడమూ ముఖ్యమే’ అని ఇసాక్ అన్నారు.
భారత్‌ను బలవంతంగా ఒప్పించలేం: డీఆర్‌ఎస్‌ను బీసీసీఐపై బలవంతంగా రుద్దలేమని ఐసీసీ ప్రకటించింది. బీసీసీఐ చక్రం తిప్పడం వల్లే యూడీఆర్‌ఎస్ తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై ఐసీసీ వెనక్కు తగ్గిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త సీఈఓ డేవ్ రిచర్డ్సన్ పై విధంగా స్పందించారు.
Other News