ఫిట్‌నెస్‌పైనే శ్రద్ధ పెడుతున్నా

హైదరాబాద్, టీ మీడియా (ఖేల్ ప్రతినిధి): లండన్ ఒలింపిక్స్‌లో రాణిస్తానన్న విశ్వాసముందని భారత ఏస్ షట్లర్ గుత్తా జ్వాల ధీమా వ్యక్తం చేసింది. విశ్వక్షికీడల్లో సత్తాచా కఠోరంగా శ్రమిస్తున్నానని, ప్రధానంగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నానని చెప్పింది. భారత్ నుంచి డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో లం డన్ ఒలింపిక్స్‌కు ఎంపికైన సందర్భంగా ప్రముఖ వాచీల తయారీదారు ‘ఒమేగా’ సంస్థ గురువారం నగరంలో జరిగిన ఓ కార్యక్షికమంలో తనను సన్మానించిన సందర్భంగా జ్వాల మాట్లాడింది. ‘లండన్‌లో రెండు ఈవెంట్లలో పోటీపడుతున్నందున ఫిట్‌నెస్ కాపాడుకోవడమన్నది నాకు కీలకం. అందుకోసం కఠోర సాధన చేస్తున్నా. ఇప్పటిదాకా ఎల్బీ స్టేడియంలో ప్రాక్టీస్ చేశా. శుక్రవారం నుంచి గచ్చిబౌలీలోని గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తా.
ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు పూర్తిస్థాయిలో కృషిచేస్తా’ అని జ్వాల తెలిపింది. ఇక ప్రస్తుతం భారత టెన్నిస్‌లో నడుస్తున్న వివాదంపై అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ, ‘ఎవరితో కలిసి ఆడాలని నిర్ణయించే హక్కు ఆటగాళ్లకే వదిలేస్తే మంచిది. ఓ క్రీడాకారిణిగా ఈ అంశంలో సానియాకే నా మద్దతు. ఎవరితో సమన్వయం ఉంటే వారితో జట్టు కడితేనే మంచిది. అప్పుడే మంచి ఫలితాలు రాబట్టగలమ’ని జ్వాల చెప్పింది.
Other News