ఏడింటికి ఏడూ మనోళ్లే..

కొలంబో: చిత్రమే ఇది! శ్రీలంక ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్)లో మన ఆటగాళ్లు పాల్గొనేందుకు బీసీసీఐ అనుమతించడంలేదు. కానీ ఆ లీగ్‌లో ఉన్న ఏడు ఫ్రాంచైజీల్నీ భారతీయులే సొంతం చేసుకున్నారు. వయాంబ ఫ్రాంచైజీని అత్యధికంగా రూ. 28.5 కోట్ల మొత్తానికి వద్వాన్ హోల్డింగ్స్ సొంతం చేసుకుంది. ఇక నెంబర్ వన్ స్పోర్ట్స్ కన్సల్టింగ్ అనే సంస్థ రూ. 23.2 కోట్లకు కందుర్తా ఫ్రాంచైజీని కొనుక్కుంది. ఉవ, రుహున జట్లు రూ. 23 కోట్ల చొప్పున వరుసగా సక్సెస్ స్పోర్ట్స్, పీరల్ ఓవర్‌సీస్‌కు దక్కాయి. ఇండియన్ క్రికెట్ డుండీ సంస్థ రూ. 22.5 కోట్లు, వెచ్చించి బస్నహిరా ఫ్రాంచైజీని, రుద్రస్పోర్ట్స్ కంపెనీ, వరుణ్ బేవరెజెస్ రూ. 17 కోట్ల చొప్పున వెచ్చించి వరుసగా ఉతుర, నాగెనహిర ఫ్రాంచైజీల్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. ఒక్కో ప్రాంచైజీ గరిష్టంగా 18 మంది ఆటగాళ్లను కొనుక్కోవచ్చు. ఇందులో 6గురు విదేశీ ఆటగాళ్లుంటారు. తుది జట్టులో మాత్రం ఇద్దరే విదేశీ ప్లేయర్లుంటారు. ఈ లీగ్ ఆగస్టు 10 నుంచి 31 వరకు (కొలంబో, పల్లెకెపూల్లో) జరుగుతుంది.
Other News