నీకన్నా నన్ను చూసేవాళ్లే ఎక్కువ

తన అందం అనే అందలానికి ఎవరూ అందరు అన్న పొగరే ఇది. లేదంటే ఇంతమాట అంటుందా అతణ్ని టెన్నిస్ స్టార్ షరపోవా! అవును మరియా షరపోవాకు కోపమొచ్చింది. ఆ ఆగ్రహంతో ఫ్రాన్స్ ఆటగాడు గిలెస్ సిమోన్‌ను ఉతికి ఆరేసింది. ఇంతకు అతడు చేసిన తప్పేంటి అంటారా? మహిళలకన్నా పురుషులు అదనంగా రెండు సెట్లు ఎక్కువ ఆడతారు.. అభిమానులూ ఉత్కం చూస్తారు. సో.. మహిళలకన్నా పురుషులకి ఎక్కువ మ్యాచ్ ఫీజ్ లభిస్తే బాగుంటుందని ఇటీవల ఓ సందర్భంలో అన్నాడు. అంతే.. మహోక్షిగురాలైంది మరియా. ‘నీవు నా అంత పాపులర్ కాదని తెలుసుకో.. నీకన్నా నన్ను చూసేందుకే జనాలొస్తారు గుర్తుంచుకో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. ‘మాకు ఇటీవలే పురుషలతో సమానంగా ్రప్రైజ్‌మనీ ఇస్తున్నారు.
మేం ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తూవచ్చాం. ఎవరి అండ లేకున్నా పోరాడి సాధించుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. మరియా వ్యాఖ్యల్ని సెరెనా సమర్ధించింది. ‘సిమోన్ కన్నా మరియా ఎంత హాటో వింబుల్డన్‌లోనే తెలిసిందిగా? అందుకే అతనికంటే ఆమెను చూసేందుకు జనాపూక్కువొస్తారు’ అంటూ సిమోన్ ఆదిలో ఇంటిబాటపట్టడాన్ని.. మరియా అప్రతిహతంగా సాగుతున్న విషయంతో పరోక్షంగా పోల్చింది సెరెనా.
Other News