బ్రావోకు జరిమానా!
లీడ్స్: అంపైర్ల నిర్ణయంపై బహిరంగ వ్యాఖ్యలు చేసిన ఫలితానికి డ్వెన్ బ్రావో జరిమానాకు గురయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండోవన్డేలో గేల్ 51 బంతుల్లో 53 పరుగులతో ఊపుమీదున్నదశలో గ్రేమ్‌స్వాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఐతే అంపైర్ టోనీ హిల్ (న్యూజిలాండ్) నిర్ణయాన్ని సవాలు చేస్తూ గేల్ రివ్యూ కోరాడు. బంతి తొలుత ప్యాడ్‌ను తాకిందా, లేదంటే బ్యాట్‌నా అనేదానిపై తీవ్ర తర్జనభర్జనలు పడిన తర్వాత థర్డ్ అంపైర్ ధర్మసేన కూడా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్నే సమర్థించాడు. దీంతో ఒకదశలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసిన విండీస్ తర్వాత 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తుదకు నిర్ణీత ఓవర్లలో 238 పరుగులే చేసింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 2 వికెట్లే కోల్పోయి సులువుగా ఛేదించింది. ఐతే మ్యాచ్ ముగిశాక గేల్‌ను ఔట్‌గా ప్రకటించడం సమర్థనీయం కాదని మీడియా సమావేశంలో బ్రావో విమర్శించాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు.
Other News