|
|
Home >> Sports Home >> >> News
లండన్ ఒలింపిక్స్‌లో భారత రిఫరీలు
న్యూఢిల్లీ:భారత్‌కు చెందిన ఇద్దరు బాక్సింగ్ రిఫరీ జడ్జిలు ప్రతిష్టాత్మక లండన్ ఒలింపిక్స్‌కు అధికారులుగా ఎంపికయ్యారు. కిషన్ నార్సి, జే కోలిలు లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీలకు రిఫరీలుగా వ్యవహరించనున్నట్లు భారత బాక్సింగ్ సమాఖ్య బుధవారం తెలిపింది. విశ్వ క్రీడల్లో అధికారులుగా ఈ ఇద్దరినీ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) ఎంపిక చేసింది. ఏఐబీఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా అయిన కిషన్ నార్సికి గతంలో మూడుసార్లు ఒలింపిక్స్ (1984, 1988, 1992)లో రిఫరీగా వ్యవహరించిన అనుభవం ఉంది. బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌తో పాటు కామన్వెల్త్, ఆసియా క్రీడలులాంటి ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు అధికారిగా పనిచేసిన నార్సి రెండేళ్లక్షికితం ఏఐబీఏ నుంచి ‘ఉత్తమ సాంకేతిక అధికారి’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. భారత్ నుంచి ఇప్పటిదాకా స్టార్లు విజేందర్ సింగ్, మేరీ కామ్ సహా మొత్తం ఎనిమిదిమంది బాక్సర్లు లండన్ పోటీలకు అర్హత సాధించారు.
Other News
|
|||||